Just In
- 16 min ago
Amazon App ఉందా..? ఈ క్విజ్ లో పాల్గొని Rs.10000 ప్రైజ్ మనీ గెలుచుకోండి.
- 1 hr ago
ఈ App ల గురించి ఇక మరిచి పోండి..! శాశ్వతంగా బ్యాన్ అయినట్టే ...?
- 1 hr ago
FAU-G గేమ్ మొత్తానికి లాంచ్ అయింది !! డౌన్‌లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి..
- 1 day ago
Realme స్మార్ట్ఫోన్లలో వాణిజ్య ప్రకటనలను డిసేబుల్ చేయడం ఎలా?
Don't Miss
- Movies
ప్రదీప్ ఆరోగ్యంపై సుధీర్ షాకింగ్ కామెంట్స్: అతడి నవ్వు వెనుక అంతటి బాధ ఉందంటూ ఎమోషనల్!
- Sports
BWF World Tour Finals 2021: టైటిల్‌పై సింధు, శ్రీకాంత్ గురి
- News
ఏపీలో మరో పంచాయతీ- జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు సశేషం- తేలేది అక్కడే
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గత వారం వ్యవధిలో జియో నుంచి వచ్చిన బెస్ట్ ఆఫర్లు ఇవే !
దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు రేపుతన్న జియో ఈ మధ్య కొత్త కొత్త ఆఫర్లను లాంచ్ చేసింది. దిగ్గజాలకు సవాల్ విసురుతూ రిలయన్స్ జియో మార్కెట్లోకి తీసుకువచ్చిన ఆఫర్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఉచిత డేటా, అలాగే ఐపీఎల్ ఆఫర్లు ఇలా పలురకాల ఆఫర్లను జియో తమ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఈ మధ్య కాలంలో జియో నుంచి వచ్చిన బెస్ట్ ఆఫర్లు అన్నీ ఒక చోటకు చేర్చి మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.
జియో యూజర్లు నెలకి వాడే డేటా ఇంత తక్కువా ?

ఉచిత డేటా ఆఫర్
జియో ఫోన్ మ్యాచ్ పాస్' అని ప్రకటించిన ఈ ఆఫర్‌లో 56 రోజుల పాటు 112 జీబీ డేటాను జియో ఉచితంగా అందిస్తోంది. మే 27వ తేదీవరకు మాత్రమే చెల్లుబాటు అయ్యే ఈ ఆఫర్ పొందాలంటే వినియోగదారులు మరో 10మంది చేత జియో ఫోన్లను కొనిపించాలి. మొదటి నాలుగు సబ్‌స్క్రైబర్ల తరువాత రోజుకు 2 జీబీ చొప్పున నాలుగురోజుల పాటు 8 జీబీడేటా ఉచితం. 5గురు స్నేహితులు కొనుగోలు తరువాత 12రోజులుపాటు 24జీబీ వాడుకోవచ్చు. 6-9 మధ్య స్నేహితులను పరిచయం చేస్తే 8జీబీ (నాలుగురోజులు) డేటా. ఇక చివరగా 10వ ఫ్రెండ్‌కి గాను 24జీబీ డేటా 12 రోజుల (2జీబీ రోజుకు) పాటు అందిస్తుంది.

జియో ఫోన్ మ్యాచ్ పాస్ ఆఫర్
1800-890-8900 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి జియో ఫోన్‌పై ఆసక్తి ఉన్న స్నేహితుల గురించి సమాచారం ఇవ్వాలి. తరువాత సదరు స్నేహితులు టోల్ ఫ్రీకి కాల్ చేసి, వారి మొబైల్ ఫోన్ నెంబరు, తాముండే ఏరియా పిన్‌కోడ్ ఎంటర్ చేయాలి. అనంతరం జియో రీటైలర్ వద్దగానీ, జియో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా గానీ జియో ఫోన్‌ను పొందాల్సి ఉంటుంది. సంబంధిత స్నేహితుని జియో నంబర్ యాడ్ అయిన తరువాత మాత్రమే ఆయా ఖాతాల్లో ఈ ఉచిత డేటా ఆఫర్ క్రెడిట్ అవుతుంది. పాస్ ఆఫర్ ప్రక్రియ ముగిసిన అనంతరం దశలవారీగా డేటా ఆఫర్‌ను అందివ్వనుంది.

4డే జియో క్రికెట్ ప్యాక్
దీనితోపాటు 4డే జియో క్రికెట్ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లలో నాలుగు రోజులు పాటు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. అయితే ఇందుకోసం జియో వినియోగదారుడు ద్వారా 10మంది స్నేహితులు లేదా, బంధువులు జియో ఫోన్ కొనుగోలు చేయించాల్సి ఉంటుంది.

ఆపిల్ వాచ్ సీరిస్3
ఆపిల్ వాచ్ సీరిస్3లోని సెల్యులార్ వాచ్‌లను జియో కస‍్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. రిలయన్స్ జియో.కాం, జియో స్టోర్స్‌లలో, రిలయన్స్ డిజిటల్స్ ద్వారా మే11 నుంచి విక‍్రయానికి రానుండగా, మే4వ తేదీనుంచి ప్రీ ఆర్డర్ చేసుకును అవకాశాన్నికూడా కల్పిస్తున్నట్టు జియో తెలిపింది.

నెంబర్ పోర్టబులిటీ ఉచితం
ఆపిల్ వాచ్ సిరీస్ 3 జియో ఎవ్రీవేర్ కనెక్ట్ సర్వీస్‌తో అందిస్తోంది. దీంతో జియో నెంబర్‌ను ఐఫోన్, యాపిల్ వాచ్ సిరీస్ 3 సెల్యులర్ రెండింటిలోనూ ఉపయోగించు కోవచ్చు. అంటే నెంబర్ పోర్టబులిటీ ఉచితం అన్నమాట. ఇందుకు ఐ ఫోన్‌లో యాపిల్ వాచ్ ఐకాన్ ఓపెన్ చేసి, జియో నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలి. అయితే వినియోగదారులు తమకు ఐఫోన్ 6ఎస్, లేదా కొత్త మోడల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టం 11.3 లేదా ఆ తరువాతదని నిర్ధారించుకోవాలి.హోమ్ డెలివరీ అవకాశం కూడా ఉందని జియో వెల్లడించింది.

2,200 రూపాయల క్యాష్‌బ్యాక్
జియోఫై ఫ్యామిలీ విస్తరణలో భాగంగా రిలయన్స్ కొత్త జియోఫై 4జీ ఎల్‌టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌పై జియో సరికొత్త ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. పరిమిత ఆఫర్ ప్రకారం 999 రూపాయలకు లభించే జియోఫై డోంగల్‌ను కొనుగోలు చేసేటపుడు మన దగ్గర ఉన్న పాత డోంగల్/ మోడమ్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా 2,200 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఇలా చేస్తే క్యాష్‌బ్యాక్ మీ సొంతం
ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ పొందాలంటే మొదట జియో స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో జియోఫై డోంగల్‌ను కొనుగోలు చేయాలి. తర్వాత జియో సిమ్‌ను యాక్టివేట్ చేసి రూ.198 లేదా 299 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాలి. జియోప్రైమ్ మెంబర్‌షిప్ కోసం అదనంగా మరో 99 రూపాయలు చెల్లించాలి.

మైజియో’ అకౌంట్‌లో..
నాన్ జియో డోంగల్‌ను ఎక్స్చేంజ్ చేసుకునేటపుడు.. ఆ డోంగల్ సీరియల్ నెంబర్‌ను పొందపరచాలి. అదే విధంగా కొత్తగా కొనుగోలు చేసిన జియోఫై ఎమ్‌ఎస్‌డీఎన్ (MSDN) నంబర్‌ను కూడా జత చేయాలి. అలా అయితేనే క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా చేయడం ద్వారా ‘మైజియో' అకౌంట్‌లో 2,200 రూపాయలు క్రెడిట్ అవుతాయి. కానీ ఈ మొత్తమంతా ఒకేసారి క్రెడిట్ కాకుండా 50 రూపాయల విలువ గల 44 వోచర్లు లభిస్తాయి.

జియోఫై 4జీ ఎల్‌టీఈ హాట్‌స్పాట్
జియోఫై 4జీ ఎల్‌టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌పై ఏడాదిపాటు వారెంటీ ఉంది. దీని డౌన్‌లోడ్ స్పీడు 150ఎంబీపీఎస్, అప్‌లోడ్ స్పీడు 50ఎంబీపీఎస్. ‘డిజైన్డ్ ఇన్ ఇండియా' అనే ట్యాగ్‌తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ డివైజ్.. పవర్ ఆఫ్/ఆన్ చేయడానికి ఫిజికల్ బటన్లను, డబ్ల్యూపీఎస్, బ్యాటరీ కోసం నోటిఫికేషన్ లైట్స్‌ను కలిగి ఉంది. హై-స్పీడు డేటా నెట్‌వర్క్ కనెక్ట్ అవడానికి 32 మంది యూజర్లకు ఈ డివైజ్ అనుమతి ఇస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయితే స్మార్ట్‌ఫోన్లలోని జియో 4జీ వాయిస్ యాప్‌తో హెచ్‌డీ వాయిస్, వీడియో కాల్స్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. అంతేకాక ఏఎల్‌టీ3800 ప్రాసెసర్‌తో రూపొందిన ఈ డివైజ్ ఎఫ్‌డీడీ బ్యాండ్ 3, బ్యాండ్ 5, టీడీడీ-బ్యాండ్ 40లను సపోర్టు చేస్తుంది.

జియో కొలువులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75,000-80,000 మంది దాకా సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు టెలికం దిగ్గజం రిలయన్స్ జియో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో 1,57,000 మంది సిబ్బంది ఉన్నారని, ఉద్యోగుల వలసల విషయానికొస్తే .. సేల్స్ తదితర విభాగాల్లో 32%గా ఉందని, సగటున చూస్తే మాత్రం 18% మేర ఉందని సంజయ్ చెప్పారు. దేశవ్యాప్తంగా 6,000 కాలేజీలతో రిలయన్స్ జియో జట్టుకట్టినట్లు ఆయన తెలిపారు. సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190