జియో కొత్త ఆఫర్, రూ.149కే 24జీబి డేటా

రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో కంపెనీ నుంచి కొత్త ప్లాన్స్ మార్కెట్లోకి రాబోతోన్నట్లు సమాచారం. జూలై 21న జరగబోయే కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో భాగంగా కొత్త ఆఫర్లకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉందని అందరు భావించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ప్లాన్స్ మార్కెట్లోకి వచ్చేసాయి...

అయితే ఇంతకన్నా ముందే జియో కొత్త ప్లాన్స్ మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ కొత్త ప్లాన్స్‌లో భాగంగా జియో 4జీ డేటాను రెండు రూపాయిల 20 పైసలకంటే తక్కువకే పొందే వీలుంటుంది.

JioFi వై-ఫై డివైస్‌ను కొనుగోలు చేసిన వారికి..

ఈ ఆఫర్లు కేవలం రిలయన్స్ వై-ఫై సర్వీసులకు మాత్రేమే వర్తిస్తుంది. JioFi వై-ఫై డివైస్‌ను కొనుగోలు చేసే యూజర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు

ఈ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు ముందుగా రూ.1999 పెట్టి JioFi deviceను కొనుగోలు చేయవల్సి ఉంటుంది. డివైస్‌ను తీసుకున్న తరువాత జియో సిమ్ కార్డును తీసుకోవల్సి ఉంటుంది. సిమ్ యాక్టివేట్ అయిన తరువాత రూ.99 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ప్రైమ్ మెంబర్‌షిప్ లభిస్తుంది.

రూ.149 నుంచి రూ.999 మధ్య అనేక ప్లాన్స్

జియో చందాదారులకు రూ.149 నుంచి రూ.999 మధ్య అనేక ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యంత చౌకైన ప్లాన్ రూ.149. ఈ ప్లాన్ 12 నెలల వ్యాలిడిటీతో వస్తోంది. ప్లాన్ పిరియడ్‌లో నెలకు 2జీబి డేటా లభిస్తుంది. మొత్తంగా 12 నెలలకుగాను 24జీబి డేటా అందుబాటులో ఉంటుంది.

రూ.309 ప్లాన్‌ను తీసుకున్నట్లయితే...

రూ.309 ప్లాన్‌ను తీసుకున్నట్లయితే రోజుకు 1జీబి డేటా లభిస్తుంది. 6 రీఛార్జ్ సైకిల్స్ వరకు ఇదే బెనిఫిట్స్ వర్తిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ నెల రోజులు. రూ.509 ప్లాన్‌ను తీసుకున్నట్లయితే రోజుకు 2జీబి డేటా లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ నెల రోజులు. 4 రీఛార్జ్ సైకిల్స్ వరకు ఇదే బెనిఫిట్స్ వర్తిస్తాయి. డైలీ లిమిట్ దాటిపోయిన తరువాట ఇంటర్నెట్ స్పీడ్ 128Kbpsకు పడిపోతుంది.

రూ.999 ప్లాన్ తీసుకున్నట్లయితే

రూ.999 ప్లాన్ తీసుకున్నట్లయితే 60జీబి డేటా లభిస్తుంది. ఈ డేటాను రెండు నెలల పాటు వాడుకోవచ్చు. ఎటువంటి డైలీ లిమిట్ ఉండదు. డేటాను పూర్తిస్థాయిలో ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio launches new plans, offers 24GB at Rs 149. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot