Reliance Jio కొత్తగా WFH ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది!! వివరాలు చెక్ చేయండి...

|

భారతదేశంలోని టెలికాం రంగంలో గల ప్రైవేట్ టెల్కోలలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ జియో ఇప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా రెండు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లు వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ప్యాక్‌ల విభాగంలో జాబితా చేయబడ్డాయి. ఈ రెండు కొత్త ప్లాన్‌లు రూ.2878 మరియు రూ.2998 ధరల వద్ద దీర్ఘకాలిక చెల్లుబాటుతో పాటుగా అధిక మొత్తంలో డేటా ప్యాక్‌ ఎంపికల కోసం చూస్తున్న వినియోగదారుల కోసం ఉద్దేశించబడింది. ఇవి కేవలం డేటా ప్యాక్‌లు మాత్రమే కాబట్టి ఇవి వినియోగదారులకు వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను అందించవని గుర్తుంచుకోండి. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రిలయన్స్ జియో రూ.2878 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.2878 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో టెల్కో ఇప్పుడు కొత్తగా రూ.2878 ధర వద్ద అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ తన యొక్క వినియోగదారులకు 365 రోజుల చెల్లుబాటు కాలానికి రోజువారీ 2GB డేటాను అందిస్తుంది. అంటే ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీ కాలంలో అందించే మొత్తం డేటా 730GB. వినియోగదారులు తమ యొక్క రోజువారీ సరసమైన-వినియోగ-విధానం (FUP) డేటాను వినియోగించిన తర్వాత డేటా యొక్క స్పీడ్ 64 Kbpsకి తగ్గించబడుతుంది.

Samsung గెలాక్సీ A53 5G & గెలాక్సీ A33 5G ఫోన్‌లు విడుదలయ్యాయి! ధరలు ఫీచర్స్ ఇవిగోSamsung గెలాక్సీ A53 5G & గెలాక్సీ A33 5G ఫోన్‌లు విడుదలయ్యాయి! ధరలు ఫీచర్స్ ఇవిగో

రిలయన్స్ జియో రూ. 2998 ప్రీపెయిడ్ ప్లాన్
 

రిలయన్స్ జియో రూ. 2998 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో టెలికాం సంస్థ రూ.2878 ప్లాన్ తో పాటుగా రూ.2998 ధర వద్ద మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇది రూ.2878 ప్లాన్ తో పోలిస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే ఖరీదైనది. కానీ వినియోగదారులు ఈ ప్లాన్ తో 365 రోజుల చెల్లుబాటు కాలానికి 2.5GB రోజువారీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ సంవత్సరం మొత్తం అందించే డేటా ప్రయోజనం మొత్తం 912.5GB. ఈ ప్లాన్‌తో కూడా FUP డేటా వినియోగించిన తర్వాత వినియోగదారులకు ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గించబడుతుంది.

 

 

కొత్త ప్లాన్‌లు

జియో యొక్క ఈ రెండు కొత్త ప్లాన్‌లు వినియోగదారులు తమ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో పొందే రోజువారీ డేటాను పెంచడానికి ఉద్దేశించబడ్డాయి. మీరు ఇప్పటికి ఇంటి నుండి పని చేస్తున్నట్లయితే కనుక ఈ ప్లాన్‌లు మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. మీ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసినప్పటికీ ఈ ప్లాన్‌లు స్వతంత్ర వాలిడిటీని కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి. నిజంగా ఎవరికైనా అలాంటి ప్లాన్ అవసరమా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి వినియోగదారులు రిలయన్స్ జియో యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాలకు అందుబాటులో ఉన్న MyJio యాప్ ద్వారా ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. జియో అందించే డేటా ఓన్లీ WFH ప్లాన్‌లను మీరు వీటిని తనిఖీ చేయవచ్చు.

జియోఫోన్ నెక్స్ట్ రూ.1,999 EMI స్కీమ్‌

జియోఫోన్ నెక్స్ట్ రూ.1,999 EMI స్కీమ్‌

జియో కంపెనీ తన యొక్క వినియోగదారుల కోసం EMI స్కీమ్‌ను అందిస్తోంది. ఈ EMI స్కీమ్‌ ద్వారా జియోఫోన్ నెక్స్ట్ ని కేవలం రూ.1,999 మొత్తం చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో రూ.501 ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఇది ముందస్తు చెల్లింపు మొత్తంలో రూ.2,500 ధరగా చేస్తుంది. దీని తరువాత వినియోగదారులు జియో యొక్క EMI ప్లాన్‌లను కొనసాగించడానికి బహుళ ఎంపికలను కలిగి ఉంటారు. కంపెనీ ఎ) ఆల్వేస్ ఆన్ ప్లాన్, బి) లార్జ్ ప్లాన్, సి) ఎక్స్‌ఎల్ ప్లాన్ మరియు డి) ఎక్స్‌ఎక్స్ఎల్ ప్లాన్ వంటి నాలుగు రకాల ప్లాన్‌లను అందిస్తోంది.

Jio - SES జాయింట్ వెంచర్‌ ఒప్పందం

జియో మరియు SES జాయింట్ వెంచర్‌తో రిలయన్స్ జియో దేశంలో SES యొక్క శాటిలైట్ డేటా మరియు కనెక్టివిటీ సేవలను అందిస్తుంది. SES ద్వారా సేవలందించే ఎంపికలలో సముద్ర మరియు ఏరోనాటికల్ అంతర్జాతీయ కస్టమర్‌లు కూడా ఉంటారు. భారతదేశంలో జియో యొక్క మెరుగైన విక్రయాలు మరియు బ్రాండ్ స్థానం నుండి JV ప్రయోజనం పొందుతుంది మరియు SES దాని ముగింపు నుండి గరిష్టంగా 100 Gbps సామర్థ్యాన్ని అందిస్తుంది. JSTL శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి భారతదేశంలో విస్తృతమైన గేట్‌వే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే కాకుండా వాటిని ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. జియో ఈ JVతో బహుళ-సంవత్సరాల సామర్థ్యం కొనుగోలు ఒప్పందాన్ని నమోదు చేసింది. ఇది కొన్ని మైలురాళ్లపై ఆధారపడి ఉంటుంది. జియో నుండి పరికరాలు మరియు గేట్‌వే కొనుగోళ్లు కూడా ఉంటాయి. దీని విలువ సుమారు US $100 మిలియన్లు ఉంటుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Launches New Work From Home Data Pack Prepaid Plans: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X