Jio ప్రీపెయిడ్ ప్లాన్లకు కొత్తగా 'బ్యానర్ ట్యాగ్'!! ఎక్కువగా వాడుతున్న ప్లాన్లు ఇవే
ఇండియాలోని టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్లను బెస్ట్ సెల్లర్స్, సూపర్ వాల్యూ మరియు ట్రెండింగ్ వంటి కొత్త బ్యానర్ల లేబుళ్ళతో ట్యాగ్ చేయడం ప్రారంభించింది. ఈ బ్యానర్లు చందాదారులు ఏమి కొనుగోలు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మరియు వారి యొక్క తదుపరి రీఛార్జికి సంబంధించిన మరింత సమాచారానికి సంబందించిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. ఉదాహరణకు "బ్యాంగ్ ఫర్ ది బక్" ప్రీపెయిడ్ ప్లాన్ ను అందిస్తుందని సూపర్ వాల్యూ బ్యానర్ సూచిస్తుంది. అలాగే బెస్ట్ సెల్లర్ ట్యాగ్ అనేది చందాదారులలో జనాదరణ పొందిన ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి అని సూచిస్తుంది. అలాగే ట్రెండింగ్ ప్లాన్ ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ కలిగి ఉండవచ్చని సూచిస్తుంది.

జియో ట్రెండింగ్ బ్యానర్ ట్యాగ్
రిలయన్స్ జియో టెలికాం సంస్థ బెస్ట్ సెల్లర్ బ్యానర్ క్రింద నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లు, సూపర్ వాల్యూ బ్యానర్‌లో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు మరియు ట్రెండింగ్ బ్యానర్‌లో ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ట్యాగ్ చేసింది. ఈ కొత్త బ్యానర్లు ఇప్పుడు కంపెనీ యొక్క సైట్‌లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రెండింగ్ బ్యానర్‌లో 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 3GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాల్స్ మరియు 100SMS లను అందించే రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. ఇది JioTV, JioCinema, JioNews, JioSecurity మరియు JioCloud వంటి జియో యొక్క అన్ని రకాల యాప్ సూట్‌కు ఉచిత సభ్యత్వాన్ని అదనంగా అందిస్తుంది.

రిలయన్స్ జియో సూపర్ వాల్యూ బ్యానర్
రిలయన్స్ జియో యొక్క సూపర్ వాల్యూ బ్యానర్ లో రూ. 249 మరియు రూ. 2,599 ధరల వద్ద లభించే రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి. ఇందులో రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో లభిస్తుంది. అలాగే మరోవైపు రూ.2,599 జియో ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో 10GB అదనపు డేటాతో పాటుగా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS మరియు 2GB రోజువారీ డేటా ప్రయోజనాలతో లభిస్తుంది. ఈ ప్లాన్ రూ.399 విలువ గల డిస్నీ + హాట్స్టార్ VIP చందాను ఉచితంగా అందిస్తుంది.

రిలయన్స్ జియో బెస్ట్ సెల్లర్ బ్యానర్
రిలయన్స్ జియో టెలికాం సంస్థ చివరగా జియో బెస్ట్ సెల్లర్ బ్యానర్ కింద రూ.199, రూ.555, రూ.599, మరియు రూ.2,399 ధరల వద్ద లభించే నాలుగు ప్లాన్ లను చేర్చింది. ఇందులో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMS లు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ రూ.199 అదే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలతో 84 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. మరోవైపు రూ.599 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMSలు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను 84 రోజుల వాలిడిటీకి అందిస్తుంది. చివరిది రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ ఏడాది చెల్లుబాటుతో రూ.599 ప్లాన్ అదే ప్రయోజనాలను అందిస్తుంది. ఈ అన్ని ప్లాన్ లు జియో సూట్ యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి.


Click it and Unblock the Notifications








