జియోటీవీ యాప్ ఇప్పుడు వెబ్ వర్షన్‌లో...

Posted By: BOMMU SIVANJANEYULU

దాదాపుగా 13 కోట్ల మంది యూజర్లతో భారతదేశపు అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచిన రిలయన్స్ జియో తన జియోటీవీ లైవ్ స్ట్రీమింగ్ సర్వీసుకు సంబంధించి వెబ్ వర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వెబ్‌వర్షన్ జియోటీవీ యాప్ ద్వారా జియో చందాదారులు తమ ల్యాప్‌టాప్స్ అలానే డెస్క్‌టాప్ కంప్యూటర్లలో లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే వీలుంటుంది.

జియోటీవీ యాప్ ఇప్పుడు వెబ్ వర్షన్‌లో...

జియోటీవీ సర్వీసులో దాదాపుగా 15 భాషలకు సంబంధించి 500 టీవీ ఛానళ్లతో పాటు 60 హెచ్‌డి ఛానల్స్ అందుబాటులో ఉంటాయి. https://jiotv.comలోకి వెళ్లటం ద్వారా ఈ సర్వీసును యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. జియోటీవీ వెబ్ కంటెంట్‌ను యాక్సిస్ చేసుకునే ముందు యూజర్లు తమ అకౌంట్ ద్వారా సైన్-ఇన్ కావల్సి ఉంటుంది. ఈ క్రమంలో జియో నెంబర్‌తో పాటు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

జియోటీవీ వెబ్‌వర్షన్‌కు సంబంధించిన యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంచుమించుగా స్మార్ట్‌ఫోన్ యాప్ తరహాలోనే ఉంటుంది. జియో టీవీ వెబ్‌సైట్‌లో స్పోర్ట్స్, న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్, మూవీస్ తదితర క్యాటగిరీలకు సంబంధించి అన్ని రకాల టీవీ ఛానల్స్ అందుబాటులో ఉంటాయి.

జియోటీవీ యాప్ ఇప్పుడు వెబ్ వర్షన్‌లో...

జియోటీవీ తరహాలోనే జియో మూవీ స్ట్రీమింగ్ సర్వీస్ కూడా వెబ్‌వర్షన్‌లో లభ్యమవుతోంది. https://www.jiocinema.com/లోకి వెళ్లటం ద్వారా ఈ సర్వీసును యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. ఈ సర్వీస్‌ను యాక్సిస్ చేసుకునే ముందు జియో యూజర్లు తమ అకౌంట్ ద్వారా సైన్-ఇన్ కావల్సి ఉంటుంది.

ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్ లో మరిన్ని వీడియోలు!

ఈ క్రమంలో జియో నెంబర్‌తో పాటు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. జియో సినిమా వెబ్‌సైట్‌లో సినిమాలు, వీడియోలు, ట్రెైలర్స్ తదితర క్యాటగిరీలకు సంబంధించి అన్ని రకాల కంటెంట్ ఇంగ్లీష్, హిందీ ఇంక ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

English summary
Reliance Jio has now launched a web version of JioTV app which allows Jio users to access over 500 tv channels.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot