రిలయన్స్ జియోలో వేల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు,అప్లయి చేసుకోండిలా !

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్తను మోసుకొచ్చింది. దిగ్గజాలను మట్టికరిపిస్తూ పోతున్న ఈ దిగ్గజం ముందు ముందు తన వ్యాపార విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 3వేల మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోబోతోంది. జియో కంపెనీలోని పలు విభాగాల్లో వీరిని రిక్రూట్‌ చేసుకోవాలని జియో భావిస్తోంది. ఈ మేరకు కంపెనీ అఫిషియల్ వెబ్ సైట్లో పేర్కొంది. రిలయన్స్‌ జియో వెబ్‌సైట్‌ జియో.కామ్‌లోని జాబ్‌ లిస్టింగ్స్‌లో 'జియోగ్రాఫికల్‌ జాబ్స్‌' కేటగిరీ కింద సుమారు 2437 ఓపెనింగ్స్‌ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్టు పేర్కొంది. ఈ కేటగిరీ కింద ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో 925 స్థానాలకు, సేల్స్‌, డిస్ట్రిబ్యూషన్‌లో 726 స్థానాలకు, ఆపరేషన్స్‌లో 182 స్థానాలకు, సప్లయ్‌ చైనాలో 109 స్థానాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు రిపోర్టులు తెలిపాయి.

జియో IPL ఆఫర్, 102 జిబి డేటా,ఫైనల్ మ్యాచ్ వరకు ఉచిత లైవ్‌లు,లగ్జరీ హోం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాయింట్‌ జాబ్స్‌..

అంతేకాక ‘పాయింట్‌ జాబ్స్‌' కోసం కూడా 585 మందిని నియమించుకోబోతోంది. ఈ జియో పాయింట్‌ టీమ్‌, చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లలో జియో పాయింట్లను లాంచ్‌ చేయడం కోసం పనిచేయనున్నాయి. కస్టమర్‌ సేల్స్‌ అండ్‌ సర్వీసు టచ్‌ పాయింట్లను ఇవి ఆపరేట్‌ చేయనున్నాయి.

3000 మంది ఎగ్జిక్యూటివ్‌లను ..

ఇలా సుమారు 3000 మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని జియో భావిస్తోంది. టెలికాం మార్కెట్ల మధ్య ఏర్పడుతున్న తీవ్రమైన పోటీ కర వాతావరణ నేపథ్యంలో, జియో దూకుడుగా ఉందని విశ్లేషకులు చెప్పారు.

కంపెనీ విస్తరణలో భాగంగా..

జియో కంపెనీలో ఇప్పటికే లక్షల సంఖ్యల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు.కాగా కంపెనీ విస్తరణలో భాగంగా మరిన్ని ఉద్యోగాలను సృష్టించాలని కంపెనీ భావిస్తోంది. ఈ విషయం మీద ఆసక్తి ఉన్న వారు మరిన్ని వివరాలకు జియో అఫిషియల్ వెబ్‌సైట్ జియో.కామ్‌ని సందర్శించగలరు.

జియో దెబ్బకు..

తన డిస్కౌంట్లు, ఉచిత వాయిస్‌ ఆఫర్స్‌తో టెలికాం మార్కెట్‌లో ఈ కంపెనీ సంచలనాలే సృష్టిస్తోంది. జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని టెలికాం కంపెనీలు మెర్జ్ దిశగా అడుగులు వేశాయి. మరికొన్ని అదే బాటలో నడుస్తున్నాయి.

2016 సెప్టెంబర్ లో..

కాగా 2016 సెప్టెంబర్ లో దేశీయ టెలికాం రంగంలోకి ప్రవేశించిన జియో వచ్చిన అనతి కాలంలోనే దేశంలో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఉచిత ఆఫర్లు , డిస్కౌంట్ల పేరుతో టెలికాం మార్కెట్లో ఓ సునామిని తలపించింది. దీంతో పాటు జియో యాప్స్ ద్వారా సినిమాలు, టీవీషోలు, మ్యూజిక్ లాంటి ఫీచర్లను అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Over 3,000 job listings from Reliance Jio come at a time of intense competition among telecom companies in a consolidating market, say some analysts.more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot