మార్చి తరువాత జియో డేటా ప్లాన్ ఎంతో తెలుసా..?

Written By:

మార్కెట్లోకి వచ్చి రావడంతోనే ఉచిత ఆఫర్లతో టెల్కోలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో మార్చి వరకు ఉచిత ఆఫర్ ని పొడిగించిన విషయం తెలిసిందే. అయితే మార్చి తరువాత జియో డేటా ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. డేటా కోసం జియో ఎంత ఛార్జ్ చేయబోతుందనేదానిపై ఇప్పటి నుంచే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం సెక్యూరిటీ టిప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో డేటా ప్లాన్ రూ. 100గా

ప్రస్తుత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగిసిన తరువాత జియో డేటా ప్లాన్ రూ. 100గా ఉండనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది.

ఉచిత ఆఫర్‌ని జూన్ 30 వరకు

అయితే మరో వైపు ఉచిత ఆఫర్‌ని జూన్ 30 వరకు పొడిగించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.

100 మిలియన్ల లక్ష్యంగా

100 మిలియన్ల లక్ష్యంగా దూసుకుపోతున్న ముఖేష్ అంబాని అది నెరవేరేదాకా ఉచిత ఆఫర్లను ఇచ్చే అవకాశం కూడా ఉందని మరికొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.

రూ .2 లక్షల కోట్ల ప్రారంభ పెట్టుబడితో

సుమారు రూ .2 లక్షల కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఎంట్రీ ఇచ్చిన జియో ఇతర టెల్కోలను తారిఫ్‌వార్‌ లో అనివార్యంగా లాక్కొచ్చింది.

ఇతర కంపెనీలను

మరి ఈ రూ. 100ల డాటా ప్లాన్‌ ఇతర కంపెనీలను ఏ మాత్రం ఇరకాటంలో పెడుతుందనేది ఇప్పుడు టెక్ విశ్లేషకులను సైతం ఆలోచనలో పడేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio may charge Rs 100 for data after free offer ends read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot