Home
News

జియో బ్రాడ్‌బ్యాండ్, టెలిఫోన్ డీటీహెచ్ సేవలు, అన్నీ కలిపి రూ.1000కే !

టెలికాం రంగంలోకి సంచలనంలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో అన్నీ కంపెనీలకు ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే.

By Hazarath Aiah

టెలికాం రంగంలోకి సంచలనంలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో అన్నీ కంపెనీలకు ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ అధిక సంఖ్యలో వినియోగదారులను తన వైపుకు తిప్పుకుంటున్నది. అయితే ఇప్పుడు ఇదే ఊపులో జియో బ్రాడ్‌బ్యాండ్ రంగం వైపు తన చూపుని సారించింది.ఈ రంగంలో పాతుకుపోయిన దిగ్గజాలకు సవాల్ విసిరేందుకు భారీ వ్యూహాలతోనే దూసుకువస్తోందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. సోషల్ మీడియాలో లీకయిన వివరాల ప్రకారం...

రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో ..

రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో ..

ఈ ఏడాది చివరి వరకు జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఇప్పటికే రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో న్యూఢిల్లీ, ముంబైలలో పలువురు ఎంపిక చేసిన యూజర్లకు ఆ సేవలను జియో ప్రయోగాత్మకంగా అందిస్తున్నది. బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఆయా సిటీల్లో పరీక్షిస్తున్నది.

న్యూఢిల్లీ, ముంబైలలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను

న్యూఢిల్లీ, ముంబైలలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను

సెప్టెంబర్ 2016లో జియో సేవలు ప్రారంభం కాగా అప్పటి నుంచే ఫైబర్ టు ది హోమ్ పేరిట బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా అందించేందుకు జియో ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే న్యూఢిల్లీ, ముంబైలలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో పరీక్షిస్తున్నది.

100 ఎంబీపీఎస్ స్పీడ్

100 ఎంబీపీఎస్ స్పీడ్

రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో 100 ఎంబీపీఎస్ స్పీడ్ కలిగిన బ్రాడ్‌బ్యాండ్‌ను యూజర్లకు అందిస్తున్నది. 

ఒకే ప్లాన్ కింద

ఒకే ప్లాన్ కింద

ఈ సేవలను ఈ ఏడాది చివరి వరకు దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, బ్రాడ్‌బ్యాండ్‌తోపాటు టెలిఫోన్, డీటీహెచ్ సేవలను ఒకే ప్లాన్ కింద అందివ్వాలని Jio ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

రూ.1వేయి లోపు

రూ.1వేయి లోపు

రూ.1వేయి లోపు ప్లాన్‌లోనే ఏకంగా బ్రాడ్‌బ్యాండ్, వాయిస్ కాల్స్ (వీవోఐపీ), డీటీహెచ్ సేవలను అందించవచ్చని తెలిసింది. జియో టీవీ యాప్ ద్వారా డీటీహెచ్ సేవలను అందించేందుకు జియో సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

మరోవైపు ఎయిర్‌టెల్ కూడా తాను ఇప్పటికే దేశంలోని ఆయా ప్రముఖ నగరాలు, పట్టణాల్లో అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనలో ఉంది.

జియోకు పోటీగా

జియోకు పోటీగా

జియోకు పోటీగా 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ.2,990 రెంటల్ ప్లాన్‌తో 1200 జీబీ డేటాను ఎయిర్‌టెల్ ఇప్పటికే తన బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు అందిస్తున్నది.

సేవల పరిధి

సేవల పరిధి

అయితే ఇకపై జియో మార్కెట్‌లోకి రానున్న నేపథ్యంలో తన సేవల పరిధిని మరింత విస్తరించాలని ఎయిర్‌టెల్ భావిస్తున్నది.

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌లో..

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌లో..

కాగా ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌లో ప్రస్తుతం యూజర్లకు రూ.1099, రూ.1299, రూ.2199 ప్లాన్లలో ఉచితంగా ల్యాండ్‌లైన్ కాలింగ్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఫ్రీగా అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Reliance Jio may launch home broadband plan at Rs 500/100GB in 100 cities More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X