డిస్కౌంట్లకు పుల్‌స్టాప్,పెరగనున్న జియో మొబైల్ డేటా ఛార్జిల ధరలు !

By Hazarath
|

ఉచిత ఆఫర్లతో టెల్కో రంగంలో ప్రకంపనలు రేకెత్తించిన జియో ఇప్పుడు తన దిశను మార్చుకుంటోంది. 6 నెలల పాటు ఉచిత సేవలతో దేశాన్ని తన చేతుల్లోకి తీసుకున్న జియో కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో డిస్కౌంట్లకు రాం రాం చెప్పే అవకాశాలు ఉన్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

 

షియోమి మిస్టరీ, ఫోన్లను అంత తక్కువ ధరకే ఎలా ఇస్తోంది..?షియోమి మిస్టరీ, ఫోన్లను అంత తక్కువ ధరకే ఎలా ఇస్తోంది..?

 ఓపెన్ సిగ్నల్  నివేదిక

ఓపెన్ సిగ్నల్ నివేదిక

లండన్‌కు చెందిన వైర్‌లెస్ కవరేజ్ మ్యాపింగ్ సంస్థ ఓపెన్ సిగ్నల్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018వ సంవత్సరం ఆరంభంలోనే జియో తన మొబైల్ డేటా ధరలను పెంచవచ్చని తెలిసింది.

డిస్కౌంట్ ధరలకు ఫుల్‌స్టాప్..

డిస్కౌంట్ ధరలకు ఫుల్‌స్టాప్..

ఇప్పటి వరకు ఇతర టెలికాం కంపెనీల కన్నా చాలా తక్కువ ధరలకే ఆయా ప్యాక్‌లను అందించిన జియో ఇక డిస్కౌంట్ ధరలకు ఫుల్‌స్టాప్ పెట్టి తాను కూడా మొబైల్ డేటా టారిఫ్‌లను పెంచాలని చూస్తున్నట్టు తెలిసింది.

2018 నుంచి 2020 మధ్య కాలంలో...
 

2018 నుంచి 2020 మధ్య కాలంలో...

2018 నుంచి 2020 మధ్య కాలంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్యతోపాటు 4జీ డేటా సేవలను వాడే వారి సంఖ్య కూడా ఎన్నో రెట్లు పెరుగుతుందని ఇప్పటికే సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.

పెరుగుతున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని..

పెరుగుతున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని..

ఈ నేపథ్యంలో పెరుగుతున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని మొబైల్ డేటా టారిఫ్‌లను పెంచితే లాభపడవచ్చని జియో భావించిస్తున్నదట. అందుకనే ఆయా చార్జిలను పెంచే అవకాశం ఉందని తెలిసింది.

జియో నుంచి ఇంకా అధికారికంగా..

జియో నుంచి ఇంకా అధికారికంగా..

అయితే ఈ విషయంపై జియో నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు..అయితే త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది..!

Best Mobiles in India

English summary
Reliance Jio May Raise Data Prices in 2018: OpenSignal More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X