ఇక ‘6’ సిరీస్‌తో మొబైల్ నెంబర్లు

రిలయన్స్ జియో గురించి మరో ఆసక్తికర సమచారం వెలుగులోకి వచ్చింది. '6'సిరీస్‌తో ప్రారంభమయ్యే మొబైల్ నెంబర్లను త్వరలో మార్కెట్లో విడుదల చేసేందుకు జియో సిద్ధమవుతోంది. టెలికం టాక్ కథనం ప్రకారం.. అస్సాం, రాజస్థాన్, తమిళనాడు సర్కిళ్లలో '6'సిరీస్‌ మొబైల్ స్విచ్చింగ్ కోడ్‌లను ఇష్యూ చేసేందుకు డిపార్గ్ మెంట్ ఆఫ్ టెలికం (DoT) నుంచి జియోకు అనుమతి లభించిందట.

ఇక ‘6’ సిరీస్‌తో మొబైల్ నెంబర్లు

రాజస్థాన్ సర్కిల్‌లో 60010 నుంచి 60019 సిరీస్ వరకు, అస్సాం సర్కిల్‌లో 60020-60029 సిరీస్ వరకు, తమిళనాడు సర్కిల్‌లో 60030-60039 సిరీస్ వరకు మొబైల్ స్విచ్చింగ్ కోడ్స్ జియోకు లభించాయట. ఈ నేపథ్యంలో, '6'సిరీస్‌తో ప్రారంభమయ్యే మొబైల్ నెంబర్ కనెక్షన్లను ఆయా సర్కిళ్లలో జియో త్వరలోనే ఇష్యూ చేయనుంది.

ఇక ‘6’ సిరీస్‌తో మొబైల్ నెంబర్లు

ఇదే సమయంలో మధ్యప్రదేశ్, గుజరాత్ సర్కిళ్లకు సంబంధించి '7'సిరీస్‌, కోల్‌కతా.. మహారాష్ట్ర సర్కిళ్లకు సంబంధించి '8'సిరీస్ మొబైల్ స్విచ్చింగ్ కోడ్‌‌లను జియోకు లభించినట్లు టెలికం టాక్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. 9, 8, 7 సిరీస్‌లతో ప్రారంభమయ్యే మొబైల్ నెంబర్లు త్వరలో అయిపోతున్న నేపథ్యంలో '6'సిరీస్‌ నెంబర్లకు టెలికం శాఖ ఆమోద ముద్ర వేసిందట.

English summary
Reliance Jio May Soon Give Users Mobile Numbers Starting With '6'. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot