Jioలోకి మారదామనుకుంటున్నారా..?

ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ వంటి ప్రముఖ టెలికం ఆపరేటర్లకు ధీటుగా రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇతర నెట్‌వర్క్‌లకు సంబంధించిన యూజర్లను రాబట్టుకునే క్రమంలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సదుపాయాన్ని జియో ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీకి ద్వారా ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్, ఐడియా వంటి ప్రముఖ నెట్‌వర్క్‌ల యూజర్లు రిలయన్స్ జియోలోకి మారిపోయే అవకాశముంది.

Jioలోకి మారదామనుకుంటున్నారా..?

Read More : Windows 7కు ముగింపు పలికిన మైక్రోసాఫ్ట్

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా జియో ఆఫర్ చేస్తున్న సేవల పట్ల మిక్సుడ్ రివ్యూలు వ్యక్తమవుతున్నాయి. జియో సేవలు భేష్ అని పలువురు అంటుంటే, మరికొందరు మాత్రం కనెక్టువిటీ, డేటా స్పీడ్ ఇంకా కాలింగ్ విషయంలో సమస్యలను ఎదర్కుంటున్నామంటూ వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వేరొక నెట్‌వర్క్ నుంచి జియోలోకి మారదామా? వద్దా? అని విషయంలో చాలామంది తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

'Welcome Offer' మార్చి 2017 వరకు..?

Reliance Jio అఫీషియల్‌గా లాంచ్ కాక ముందు యూజర్లకు 'Preview Offer' రూపంలో అందుబాటులో ఉంది. జియో అధికారిక లాంచ్ తరువాత ప్రివ్యూ ఆఫర్ కాస్తా 'Welcome Offer'లా మారిపోయింది. ఈ ఆఫర్‌లో భాగంగా డిసెంబర్ 31, 2016 వరకు రోజుకు 4జీబి ఇంటర్నెట్ యూసేజ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్ జియో యాప్స్‌ను ఉచిత యాక్సిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని రూమర్స్  ప్రకారం జియో తన 'Welcome Offer'ను మార్చి 2017 వరకు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది.

 

5 నెలల పాటు ఉచిత బెనిఫిట్స్

మీరు వేరొక నెట్‌వర్క్ నుంచి జియో నెట్‌వర్క్ లోకి మారదామనుకుంటున్నట్లయితే మీకు మరో 5 నెలల పాటు 'Welcome Offer' బెనిఫిట్స్ లభించే అవకాశముంటుంది?.

జియో 4జీ స్పీడ్స్ నెమ్మదిగా..?

జియో ఆఫర్ చేస్తున్న 4జీ స్పీడ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయంటూ పలు ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి జియోలోకి పోర్ట్ అయ్యే ముందు ఈ విషయాన్ని పరిగణంలోకి తీసుకోండి.

Offer ముగిసేంత వరకు వెయిట్ చేయండి.

మీరు జియో ఆఫర్ చేసే వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడును అందుకోవాలనుకుంటున్నట్లయితే 'Welcome Offer' ముగిసేంత వరకు వెయిట్ చేయండి. ఫ్రీ డేటాను ఆస్వాదించాలనుకుంటున్నట్లయితే ఇప్పుడే జియోలోకి మారండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లైఫ్ టైమ్ ఉచిత కాల్స్

మీరు జియోలోకి మారటం వల్ల లైఫ్ టైమ్ ఉచిత కాల్స్ సౌకర్యం మీకు లభిస్తుంది. కేవలం డేటాకు మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.

ఎంఎన్‌పీ ద్వారా రిలయన్స్ జియోలోకి మారేందుకు ఇలా చేయండి...

మీ మొబైల్ నెంబర్ నుంచి పోర్ట్ (port) అని టైప్ చేసి కొంత స్పేస్ ఇచ్చి బ్రాకెట్లో మీ మొబైట్ నెంబర్‌ని జత చేసి 1900కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎనిమిది అంకెల యూనిక్ పోర్టింగ్ కోడ్ మీ మొబైల్‌కు సందేశం రూపంలో అందుతుంది.

 

మీ సమీపంలోని రిలయన్స్ స్టోర్..

ఈ కోడ్ ఆధారంగా మీ సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్ లేదా ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌‌ను సంప్రదించి సంబంధిత అప్లికేషన్‌లను పూరించాల్సి ఉంటుంది.

సిమ్ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా..

సిమ్ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఇతర ధృవీకరణ ప్రతాలను జియో ప్రతినిధులకు సమర్పించాల్సి ఉంది.

జియో 4జీ సిమ్ కార్డ్ మీకు అందుతుంది

ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే Jio Welcome ఆఫర్‌తో కూడిన జియో 4జీ సిమ్ కార్డ్ మీకు అందుతుంది. జియో సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే మీరు ఇప్ప‌టికే వాడుతున్న నంబ‌ర్ నెట్‌వ‌ర్క్ క‌ట్ అయిపోతుంది.

నెట్‌వ‌ర్క్ క‌ట్ అయిపోతుంది

జియో సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే మీరు ఇప్ప‌టికే వాడుతున్న నెంబ‌ర్ నెట్‌వ‌ర్క్ క‌ట్ అయిపోతుంది. అలా జరిగిన వెంటనే మీ జియో సిమ్ యాక్టివేట్ అవుతుంది..

టెలీ వెరిఫికేష‌న్ ద్వారా..

అలా యాక్టివేట్ అయిన జియో సిమ్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయటం ద్వారా Jio Welcome offerను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. దీని కన్నా ముందు యూజర్లు టెలీ వెరిఫికేష‌న్ ద్వారా మీ వివ‌రాల‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Find Out If You Should Port Your Number to Reliance Jio Right Now. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot