Home
News

జియో కళ్లు చెదిరే ఆఫర్, రూ.499కే జియోఫై

కొత్త కొత్త ఆఫర్లతో అందర్నీ ఆకట్టుకుంటున్న జియో ఇప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో సరికొత్త ఆఫర్‌తో దూసుకొచ్చింది.

By Hazarath Aiah

కొత్త కొత్త ఆఫర్లతో అందర్నీ ఆకట్టుకుంటున్న జియో ఇప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో సరికొత్త ఆఫర్‌తో దూసుకొచ్చింది. టెలికాం దిగ్గజాలకు సవాల్ విసిరే ఆఫర్లతో అందర్నీ అలరిస్తున్న జియో రెండు రోజుల క్రితమే జియో ఒప్పో మాన్‌సూన్‌ ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జియోఫై ఆఫర్ ద్వారా అందర్నీ అలరించేందుకు రెడీ అయింది. తాజాగా జియోఫై పోర్టబుల్‌ 4జీ రూటర్‌ విక్రయాలను పెంచడానికి సరికొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌..

500 రూపాయల క్యాష్‌బ్యాక్‌..

జియోఫై రూటర్ ధర మార్కెట్లో రూ.999గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై జియో కస్టమర్లకు 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దీంతో జియోఫై రూటర్‌ 499 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది.

గతేడాది సెప్టెంబర్‌లోనే

గతేడాది సెప్టెంబర్‌లోనే

గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ పోర్టబుల్‌ రూటర్‌ ధరను రూ.1999 నుంచి రూ.999కు తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన కొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కేవలం కొత్త జియోఫై యూనిట్‌ కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఇప్పటికే ఈ డివైజ్‌ కలిగి ఉన్నవారికి..

ఇప్పటికే ఈ డివైజ్‌ కలిగి ఉన్నవారికి..

కాగా ఇప్పటికే ఈ డివైజ్‌ కలిగి ఉన్నవారికి ఈ ఆఫర్‌ వర్తించదు. జూలై 3 నుంచి అంటే నేటి నుంచి ఈ ఆఫర్‌ను యూజర్లకు జియో అందిస్తోంది. అయితే ఎప్పుడు వరకు ఈ ఆఫర్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుందో కంపెనీ వెల్లడించలేదు.

పోస్టుపెయిడ్‌ సిమ్‌

పోస్టుపెయిడ్‌ సిమ్‌

జియోఫై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ యూజర్లు పొందడం కోసం, తొలుత యూజర్లు ఆ డివైజ్‌ను కొనుగోలు చేయాలి. దానిలో కొత్త పోస్టుపెయిడ్‌ సిమ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. కచ్చితంగా కనీసం 199 రూపాయల విలువైన పోస్టుపెయిడ్‌ ప్లాన్‌తో యూజర్లు రీఛార్జ్‌ చేయించుకోవాలి.

12 నెలల పాటు రీఛార్జ్‌

12 నెలల పాటు రీఛార్జ్‌

ఇలా 12 నెలల పాటు రీఛార్జ్‌ చేయించుకుంటూనే ఉండాలి. 12 నెలల తర్వాత, తర్వాత బిల్‌ సైకిళ్లలో ప్రకటించిన 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్‌జియో అందించనుంది.

రూ.199 కింద 25 జీబీ డేటా

రూ.199 కింద 25 జీబీ డేటా

జియో తన పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ రూ.199 కింద 25 జీబీ డేటాను, ఉచిత వాయిస్‌ కాల్స్‌ను, అపరిమిత ఎస్‌ఎంఎస్‌లను, జియో యాప్స్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందనున్నారు.

మాన్‌సూన్‌ ఆఫర్

మాన్‌సూన్‌ ఆఫర్

కొత్త జియో ఒప్పో మాన్‌సూన్‌ ఆఫర్ ప్రకటించిన రోజుల్లోనే మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. మాన్‌సూన్‌ ఆఫర్‌ కింద 4,900 రూపాయల విలువైన ప్రయోజనాలను జియో తన ఒప్పో కస్టమర్లకు అందిస్తోంది.

రోజుకు 1.5 జీబీ అదనపు డేటా

రోజుకు 1.5 జీబీ అదనపు డేటా

జియో తన ఎంపిక చేసిన ప్యాక్‌లకు రోజుకు 1.5 జీబీ అదనపు డేటాను యూజర్లకు ఆఫర్‌చేస్తోంది.ఈ ఆఫర్ ను గత నెలలో ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. 

5జీతో జియో

5జీతో జియో

టెల్కోలకు దిమ్మతిరిగింది, 5జీతో జియో వచ్చేస్తోంది

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio's New Offer: Here's How You Can Avail Rs. 500 Cashback On JioFi More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X