Home
News

Jio టారిఫ్ పెంపు తరువాత మెరుగైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

ఇండియాలోని టెలికాం సంస్థలలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ జియో గతంలో ప్రకటించిన తన యొక్క ప్రీపెయిడ్ టారిఫ్ పెంపులను ఇటీవల నుంచి అమలు చేసింది. టారిఫ్‌ల పెంపు తర్వాత టెల్కో యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లలో 'విలువైనవి' ఏవి చాలా మంది తికమక పడుతున్నారు. రూ.155 ధర వద్ద లభించే ప్లాన్‌తో ప్రారంభమయ్యి విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు మరొక మూడు ఉన్నాయి. మీరు మంచి డేటా ప్రయోజనాలు మరియు గణనీయమైన వ్యాలిడిటీ రెండింటినీ అందించే గొప్ప విలువలతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడాన్ని ఇష్టపడే వారైతే కనుక ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు చూడదగినవి. మేము మాట్లాడుతున్న ప్లాన్‌లు వరుసగా రూ.155, రూ.395 మరియు రూ.1559 ధరల వద్ద లభిస్తాయి. ఈ వ్యాసంలో మేము వివిధ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్‌ల యొక్క లోతైన అన్ని రకాల ప్రయోజనాల వివరాలను చర్చించబోతున్నాము. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్‌

జియో రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్‌

జియో యొక్క ప్రీపెయిడ్ టారిఫ్ పెంపు తరువాత వినియోగదారులకు లభించే విలువైన మూడింటి ప్లాన్‌లలో మొదటి మరియు చౌకైనది రూ.155 ధర వద్ద లభించే ప్లాన్. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ దాని వినియోగదారులకు మొత్తం వాలిడిటీలో 300 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు గరిష్ట వేగంతో మొత్తంగా 2GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో జియో సినిమా, జియో టీవీతో పాటుగా మరిన్ని కొన్ని జియో యాప్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి.

జియో రూ.395 ప్రీపెయిడ్ ప్లాన్‌

జియో రూ.395 ప్రీపెయిడ్ ప్లాన్‌

జియో టెలికాం దిగ్గజం నుండి వచ్చే తదుపరి వాల్యూ ప్లాన్ మీడియం-రేంజ్ వాలిడిటీతో లభిస్తుంది. ఇది వినియోగదారులకు 84 రోజుల మొత్తం చెల్లుబాటు కాలంలో 1000 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ రూ.395 ధరతో లభిస్తూ వినియోగదారులు 84 రోజుల చెల్లుబాటు వ్యవధిని పొందుతారు. అదనంగా వినియోగదారులు అధిక వేగంతో పనిచేసే 6GB ఇంటర్నెట్ డేటాను కూడా పొందుతారు. దీని తరువాత వినియోగదారులు 64 Kbps వేగంతో ఇంటర్నెట్ ను యాక్సిస్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ప్లాన్ కొన్ని జియో అప్లికేషన్‌లకు సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది.

జియో రూ.1559 దీర్ఘ-కాల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌

జియో రూ.1559 దీర్ఘ-కాల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌

జియో టెల్కో యొక్క వాల్యూ ప్లాన్ జాబితాలోని చివరి ప్లాన్ దీర్ఘ-కాల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్ సహేతుకమైన డేటాతో పాటు దీర్ఘకాలిక కాలింగ్ ప్లాన్‌లను కోరుకునే మరియు అవసరమయ్యే వినియోగదారులకు సరిపోతుంది. టెల్కో యొక్క ఈ దీర్ఘ-కాల ప్లాన్ రూ.1,559 ధర వద్ద లభిస్తుంది. దీనిని వినియోగదారులు 336 రోజుల చెల్లుబాటు కాలానికి పొందుతారు. వినియోగదారులు ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ మాత్రమే కాకుండా చెల్లుబాటు వ్యవధిలో మొత్తం 3600 SMSలను కూడా పొందుతారు. ఇంకా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు అధిక వేగంతో మొత్తం చెల్లుబాటు కాలానికి 24GB డేటాను అందించబడుతుంది. 24GB డేటా తర్వాత వినియోగదారులు 64 Kbps ఇంటర్నెట్ వేగం పొందుతారు. ఈ ప్లాన్‌లో వివిధ జియో యాప్‌ల యాడ్-ఆన్‌లు కూడా ఉన్నాయి. Jio ఇప్పుడు రూ. 15 నుండి డేటా యాడ్-ఆన్ వోచర్‌లను కూడా అందిస్తోంది. కాబట్టి హై-స్పీడ్ డేటా మొత్తాన్ని వినియోగించడం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు టెల్కో వెబ్‌సైట్ నుండి రిలయన్స్ జియో యొక్క మొత్తం డేటా యాడ్-ఆన్ వోచర్‌లను చూడవచ్చు.

రిలయన్స్ జియో టారిఫ్‌ పెంపు ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో టారిఫ్‌ పెంపు ప్రీపెయిడ్ ప్లాన్‌లు

** రిలయన్స్ జియో టెలికాం సంస్థ డిసెంబర్ 1, 2021 నుండి దాని ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచుతుంది. ఇందులో రూ.75 విలువైన జియోఫోన్ ప్లాన్ ప్రస్తుతం రూ.91 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 3GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 50 SMS ప్రయోజనాలను అందిస్తుంది.

** గతంలో రూ.129 ధర వద్ద గల అపరిమిత ప్లాన్ ఇప్పుడు రూ.155 ధరకు పెరిగింది. ఈ ప్లాన్ 2GB నెలవారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఇది SMS ప్రయోజనాలతో Airtel మరియు Jio యొక్క బేస్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల కంటే కొంచెం చౌకగా ఉంటుంది.

** 84 రోజుల వ్యాలిడిటీతో రూ.555 మరియు రూ.599 ధరల వద్ద లభించే రిలయన్స్ జియో టెల్కో యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీపెయిడ్ ప్లాన్‌లు రెండు టారిఫ్ పెంపుదల ప్రారంభమైన తర్వాత రూ.666 మరియు రూ.719 కొత్త ధరల వద్ద అందుబాటులో ఉంటాయి. అదే ప్లాన్‌లతో పోల్చితే భారతీ ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi), జియో యొక్క ప్లాన్‌లు గణనీయంగా చౌకగా ఉన్నాయి.

** రూ. 2399 ధర వద్ద లభించే ప్లాన్ 365 రోజుల చెల్లుబాటు కాలానికి 2GB రోజువారీ డేటా మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అయితే డిసెంబర్ 1, 2021 నుండి ఇది రూ.2897 పెరిగిన కొత్త ధర వద్ద అందుబాటులో ఉంటుంది. అలాగే రూ.51, రూ.101 మరియు రూ.251 ధరల వద్ద లభించే మూడు డేటా వోచర్‌లు కూడా రిలయన్స్ జియో ద్వారా టారిఫ్ పెంపుదల అమలులోకి వచ్చిన తర్వాత వోచర్‌లు వరుసగా రూ.61, రూ.121 మరియు రూ.301 కొత్త ధరల వద్ద అందుబాటులో ఉంటాయి.

 

Vi డబుల్ డేటా ఆఫర్

Vi డబుల్ డేటా ఆఫర్

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో ఈ సంవత్సరం ప్రారంభంలో ఎంపిక చేసిన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో చందాదారులకు అత్యంత ఆకర్షణీయమైన డబుల్ డేటా ప్రయోజనాలను అందించింది. ఇది అపరిమిత వాయిస్ కాల్‌లు, 100 SMS మరియు ఇతర ప్రయోజనాలతో పాటు ప్లాన్ వాస్తవానికి అందించే డేటాకు బదులుగా రెట్టింపు డేటాను అందిస్తుంది. ఇంటి నుండి పని చేసే మరియు ఆన్‌లైన్ గేమింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్‌లో పాల్గొనే వినియోగదారులకు ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ రూ.299, రూ.449 మరియు రూ.699 ధరల వద్ద లభించే ప్లాన్‌ల నుంచి లభించే డబుల్ డేటా ప్రయోజనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం మీరు ఇప్పుడు రోజువారీ ప్రాతిపదికన పొందే 4GB డేటాకు బదులుగా వినియోగదారులు ఇకపై 2GB డేటాను మాత్రమే పొందుతారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio New Plans: These are The Better Prepaid Plans After Tariff Hike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X