Home
News

56 రోజుల పాటు జియో 112 జిబి డేటా ఉచితం, ఎలా పొందాలో తెలుసుకోండి

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో బంఫరాఫర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది.

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో బంఫరాఫర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. వినూత్న పథకాలతో కస్టమర్లకు కొత్త కిక్ ఇస్తున్న జియో అధినేత ఈ సారి మరో ఆసక్తికర కిక్కుతో యూజర్లకు వలవేశారు. జియో ఫోన్‌ మ్యాచ్‌ పాస్‌' అని ప్రకటించిన ఈ ఆఫర్‌లో 112 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. దీన్నీ మీరు 56 రోజుల పాటు ఎప్పుడైనా వాడుకోవచ్చు. కాగా ఈ ఆఫర్ మే 27వ తేదీవరకు మాత్రమే చెల్లుతుంది. దీనితోపాటు 4డే జియో క్రికెట్‌ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్‌ ఫోన్లలో నాలుగు రోజులు పాటు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. మరి ఈ ఆఫర్ ని జియో వినియోగదారుడు ఎలా పొందాలో చూద్దాం.

10మంది స్నేహితులు..

10మంది స్నేహితులు..

ముందుగా 112 జీబీ డేటా అందుకోవాలంటే మొత్తం 10మంది స్నేహితులు, లేదా బంధువులు జియో ఫోన్‌ కొనుగోలు చేయాలి.అంటే జియో వినియోగదారుడు 10మంది స్నేహితులు లేదా, బంధువులతో జియో ఫోన్‌‌ని కొనుగోలు చేయించాల్సి ఉంటుంది.

మొదటి నాలుగు సబ్‌స్క్రైబర్ల తరువాత ..

మొదటి నాలుగు సబ్‌స్క్రైబర్ల తరువాత ..

మొదటి నాలుగు సబ్‌స్క్రైబర్ల తరువాత రోజుకు 2 జీబీ చొప్పున నాలుగురోజుల పాటు 8 జీబీడేటా ఉచితం. 5గురు స్నేహితులు కొనుగోలు తరువాత 12రోజులుపాటు 24జీబీ వాడుకోవచ్చు. 6-9 మధ్య స్నేహితులను పరిచయం చేస్తే 8జీబీ (నాలుగురోజులు) డేటా. ఇక చివరగా 10వ ఫ్రెండ్‌కి గాను 24జీబీ డేటా 12 రోజుల (2జీబీ రోజుకు) పాటు అందిస్తుంది.

1800-890-8900 టోల్‌ ఫ్రీ నంబరుకు

1800-890-8900 టోల్‌ ఫ్రీ నంబరుకు

వినియోగదారుడు 1800-890-8900 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి జియో ఫోన్‌పై ఆసక్తి ఉన్న స్నేహితుల గురించి సమాచారం ఇవ్వాలి.

ఆసక్తి ఉన్న సదరు స్నేహితులు..

ఆసక్తి ఉన్న సదరు స్నేహితులు..

తరువాత ఆసక్తి ఉన్న సదరు స్నేహితులు టోల్‌ ఫ్రీకి కాల్‌ చేసి, వారి మొబైల్‌ ఫోన్‌ నెంబరు, తాముండే ఏరియా పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేయాలి. అనంతరం జియో రీటైలర్‌ వద్దగానీ, జియో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ద్వారా గానీ జియో ఫోన్‌ను పొందాల్సి ఉంటుంది.

జియో నంబర్‌ యాడ్‌ అయిన తరువాత మాత్రమే..

జియో నంబర్‌ యాడ్‌ అయిన తరువాత మాత్రమే..

కాగా సంబంధిత స్నేహితుని జియో నంబర్‌ యాడ్‌ అయిన తరువాత మాత్రమే ఆయా ఖాతాల్లో ఈ ఉచిత డేటా ఆఫర్‌ క్రెడిట్‌ అవుతుంది. పాస్‌ ఆఫర్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం దశలవారీగా డేటా ఆఫర్‌ను అందివ్వనుంది.

మే 27వ తేదీవరకు ..

మే 27వ తేదీవరకు ..

ఈ ఆఫర్ మే 27వ తేదీవరకు మాత్రమే చెల్లుతుంది. ఆ తరువాత ఈ ఆపర్ వర్తించదని రిలయన్స్ జియో తెలిపింది. దీంతో పాటు 4డే జియో క్రికెట్‌ ప్యాక్‌లో భాగంగా మొబైల్‌ ఫోన్లలో నాలుగు రోజులు పాటు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం కూడా కల్పించింది.

Best Mobiles in India

English summary
Reliance Jio offering 112 GB data for free – Know how to get it More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X