ఆర్డర్ చేస్తే 90 నిమిషాల్లో జియో సిమ్ డెలివరీ

తన ఉచిత హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులతో కొద్ది రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో మరో సౌకర్యాన్ని టెలికం సర్కిల్‌లో కల్పిస్తోంది. తమ జియో సిమ్‌ను ఆర్డర్ చేసిన వారికి 90 నిమిషాల్లో ఆ సిమ్‍‌ను డెలివరీ చేస్తామని రిలయన్స్ జియో చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

600కు పైగా పట్టణాలకు హోమ్ డెలివరీ సర్వీసు

తొలిరోజుల్లో ఈ సదుపాయాన్నిముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, పూణే, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం చేసిన రిలయన్స్ జియో తాజాగా తన జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీసును 600కు పైగా పట్టణాలకు విస్తరించింది.

జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి..

జియో సిమ్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ముందుగా http://www.jio.com/en-in/jio-home-delivery లింక్‌లోకి వెళ్లి తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి మై జియో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత..

యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత కూపన్‌ను జనరేట్ చేసుకోవల్సి ఉంటుంది. కూపన్ జనరేట్ అయిన తరువాత సిమ్ కోసం అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవల్సి ఉంటుంది.

అపాయింట్‌మెంట్ ప్రాసెస్‌లో...

అపాయింట్‌మెంట్ ప్రాసెస్‌లో మీ మొబైల్ నెంబర్‌తో పాటు అడ్రస్‌ను సబ్మిట్ చేయవల్సి ఉంటుంది. సిమ్ డెలివరీ సమయంలో యూజర్ ముందుగా డాక్యుమెంట్‌లో పేర్కొన్న అడ్రస్‌లోనే ఉండాలి. అంతేకాకుండా ఆధార్ కార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Offering 90-Minute Free Home Delivery For Jio SIM. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot