జియో నుంచి యూజర్లకు మరో బంపరాఫర్
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో ఆఫర్‌ను ప్రకటించింది.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో ఆఫర్‌ను ప్రకటించింది. రూ.300 ఆపైన చేసే రీచార్జిలపై రూ.50 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. అయితే కస్టమర్లు ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో 24 గంటల్లోగా కస్టమర్ ఫోన్‌పే వాలెట్‌కు రూ.50 క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులు రీచార్జిలకు, బిల్ పేమెంట్స్‌కు ఉపయోగించుకోవచ్చు. కేవలం ఒకసారి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఈ నెల 21వ తేదీ వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు గడువు ఉన్నట్లు జియో తెలిపింది. ఈ సంధర్భంగా జియో రాకముందు జియో వచ్చిన తరువాత టెలికాం మార్కెట్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

దిగ్గజ టెల్కోలు సైతం..
టెలికం మార్కెట్లో జియో సృష్టించిన ప్రభంజనానికి దిగ్గజ టెల్కోలు సైతం భారీ నష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. డేటా విషయంలో జియోకు ముందు.. జియోకు తర్వాత అని చెప్పుకునే స్థాయికి చేరింది.

2జి సామ్రాజ్యాన్ని
గత పాతికేళ్లలో పాత ఆపరేటర్లంతా కలిసి స్థాపించిన 2జి సామ్రాజ్యాన్ని జియో వచ్చి రావడంతోనే నేల మట్టం చేసింది. 4జీ నెట్ వర్క్ తో ఓ సునామిని క్రియేట్ చేసింది. ఈ సునామికి పట్టిన సమయం 3 ఏళ్లు మాత్రమే.

ఉచిత డేటా వాయిస్ కాల్స్ తో
కాల్స్ ధరలు చుక్కలనంటిన నేపథ్యంలో జియో వచ్చి రావడంతోనే ఉచిత కాల్స్ అంటే ఎలా ఉంటోయో టెల్కోలకు రుచిచూపించింది. ఉచిత డేటా వాయిస్ కాల్స్ తో యూజర్లకు పండగ వాతావరణాన్ని అందించింది.

ఏకంగా 125 కోట్ల జీబీకి
జియో రాకముందు నెలకు 20 కోట్ల జీబీ మాత్రమే భారతీయులు వినియోగించే వారు జియో రాకతో అది ఏకంగా 125 కోట్ల జీబీకి చేరింది.

మొబైల్ డేటా వినియోగంలో
మొబైల్ డేటా వినియోగంలో జియోకు ముందు భారత్ 155వ స్థానంలో ఉండగా.. ఇపుడు నంబర్ 1 స్థానంలో ఉంది. టీవీని చూసే సమయంతో పోలిస్తే అంతకు ఏడు రెట్లు మొబైల్‌పై భారతీయులు గడుపుతున్నారంటే అదంతా జియో చలవే.

170 రోజుల్లో 10 కోట్ల వినియోగదార్లను
ప్రపంచంలో ఏ కంపెనీ కూడా 170 రోజుల్లో 10 కోట్ల వినియోగదార్లను సొంతం చేసుకోలేదు. అది జియోకు మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం 13 కోట్ల మందికి జియో తన సేవలందిస్తోంది.

జీబీ రూ.50 కంటే తక్కువ
జియో రాకముందు 1జీబీకి రూ.250 నుంచి రూ.4000 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇపుడు ఒక జీబీ రూ.50 కంటే తక్కువకే లభిస్తోంది.

84 రోజులకు రోజూ 1 జీబీ
84 రోజులకు రోజూ 1 జీబీ జియో వినియోగదార్లకియతే 84 రోజులకు రోజూ 1 జీబీ చొప్పున రూ.399కే వస్తోంది. అంటే రూ.50/జీబీ కంటే చాలా తక్కువన్నమాట.


Click it and Unblock the Notifications








