జియో నుంచి మరో సూపర్ ఆఫర్

Written By:

ఇప్పటికే పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించి మిగతా టెలికం సంస్థలకు నిద్రలేకుండా చేసిన రిలయన్స్ జియో, తాజాగా, పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ రీచార్జ్ లపై మరో అద్భుత ఆఫర్ ను ప్రకటించింది.పేటీఎం, ఫోన్‌ పే ద్వారా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

జియో ఫోన్ ఫ్రీ ఆర్డర్స్ స్టార్ట్, ఏం అడుగుతున్నారంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేటీఎం, ఫోన్‌ పే యాప్‌ల ద్వారా రీచార్జిలపై

తాజా నివేదికల ప్రకారం ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ జియో పేటీఎం, ఫోన్‌ పే యాప్‌ల ద్వారా రీచార్జిలపై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది.

క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌

పేటీఎం ద్వారాఅయితే రూ.300 ఆఫర్‌పై రూ.76ల క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకుంటే రూ.75 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది.

ఒక ప్రోమో కోడ్‌

అయితే దీనికి జియో యూజర్లకు కంపెనీ పంపిన ఒక ప్రోమో కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రోగ్రెస్ టు రీఛార్జ్'

పేటీఎం యాప్‌లో 'మొబైల్ ప్రీపెయిడ్' లేదా 'మొబైల్ పోస్ట్‌ పెయిడ్' అప్షన్స్‌ను ఎంచుకుని జియో ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి 'ప్రోగ్రెస్ టు రీఛార్జ్'పై క్లిక్ చేయాలి.

ప్రోమో కోడ్‌ ఎంట్రీ పై కొంత గందరగోళం

ఆ తరువాత ప్రోమో కోడ్‌నుకూడా జతచేయాలి. దీంతో రీచార్జ్‌ పూర్తవుతుంది. అయితే ఈ ప్రోమో కోడ్‌ ఎంట్రీ పై కొంత గందరగోళం నెలకొంది.

జియో వినియోగదారుల ప్రోమో కోడ్

ముఖ్యంగా ఇప్పటికే జియో వినియోగదారుల ప్రోమో కోడ్ జాబితాలో ఉందనీ, అందుకనీ పేటీఎం ద్వారా రీచార్జ్‌ సందర్భంగా ఈ ప్రోమో కోడ్ ఎంటర్ అవసరం లేదని తెలుస్తోంది.

రీఛార్జ్ పూర్తి అయిన 24 గంటల్లో

రీఛార్జ్ పూర్తి అయిన 24 గంటల్లో ఈక్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ రూ. 76 కస్టమర్ల ఖాతాలో చేరుతుంది. మరిన్ని వివరాలను అధికారిక జియో వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Reliance Jio offering Rs 75, Rs 76 cashback via Paytm and PhonePe, all you need to know about exciting offers
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting