Jio బంప‌రాఫ‌ర్‌.. రీఛార్జీల‌పై రోజుకు రూ.10 ల‌క్ష‌ల బ‌హుమ‌తులు!

|

భారతదేశపు నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ Jio త‌మ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నిత్యం ఏదో ఒక ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సంస్థ సొంత యూజ‌ర్ల‌తో పాటు కొత్త వారిని ఆక‌ట్టుకునేలా బంఫ‌ర్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది.

 
Jio బంప‌రాఫ‌ర్‌.. రీఛార్జీల‌పై రోజుకు రూ.10 ల‌క్ష‌ల బ‌హుమ‌తులు!

సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 11, 2022 మధ్య రోజుల్లో Jio ప్లాన్ల‌తో రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లకు ప్రతిరోజూ రూ. 10 లక్షల విలువైన బహుమతులను అందజేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. Jio టెలికాం రంగంలో అడుగుపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ మేర‌కు జియో ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది.

ఆరు రోజుల పాటు!

ఆరు రోజుల పాటు!

Jio కంపెనీ ప్రారంభించి ఆరు సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్న సంద‌ర్భంలో ఈ ఆఫ‌ర్‌ను వినియోగ‌దారుల ముందుకు తెచ్చింది. అయితే, ఇది సెప్టెంబర్ 6 వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ, 2022 వ‌ర‌కు ఆరు రోజుల పాటు కొన‌సాగుతుంది. ఆఫర్ వ్యవధి మధ్య కాలంలో రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లు బహుమతులు గెలుచుకోవడానికి అర్హులు. తమిళనాడు సర్కిల్‌లోని వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదని జియో తెలిపింది. భారతదేశంలోని అర్హ‌త ఉన్న టెలికాం స‌ర్కిళ్ల‌లోని జియో వినియోగదారులు ఈ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవడానికి మరియు ఏదైనా గెలుపొందడానికి అర్హులు అని భావించవచ్చు.

ఎంపిక విష‌యంపై ఎలాంటి వివ‌రాలు చెప్ప‌లేదు!

ఎంపిక విష‌యంపై ఎలాంటి వివ‌రాలు చెప్ప‌లేదు!

ఈ ఆఫ‌ర్‌కు సంబంధించి ఇతర నిబంధనలు, షరతులు, బ‌హుమ‌తుల‌కు యూజ‌ర్ల‌ను ఎలా ఎంపిక చేస్తార‌నే విష‌యాన్ని Jio తన ట్విట్టర్ పోస్ట్‌లో వివరించలేదు. టెల్కో 4G నెట్‌వర్క్ సేవలను సెప్టెంబర్ 5, 2016న ప్రకటించింది. సెప్టెంబర్ 5, 2022 నాటికి, Jio వ్యాపారంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆఫర్ ఇప్పటికే లైవ్‌లో ఉంది మరియు రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లు టెల్కో నుండి కొన్ని బహుమతులను గెలుచుకోగలరు.

పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్లకు అందుబాటులో లేదు!
 

పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్లకు అందుబాటులో లేదు!

ప్రీపెయిడ్ ప్లాన్‌ల అపరిమిత క్యూయింగ్‌ను Jio అనుమతిస్తుంది. అందువల్ల, మీరు యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ని కలిగి ఉన్నప్పటికీ, ఆఫర్‌కు అర్హత పొందేందుకు మీరు Jio నుండి మీకు ఇష్టమైన ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. టెల్కో యొక్క పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు. ఏదేమైన‌ప్ప‌టికీ, టెల్కో తన సోషల్ మీడియా పోస్ట్‌లో నిబంధనలు మరియు షరతులను వివరించలేదు.

రూ.2999 ప్లాన్‌పైనా అద్భుత‌మైన అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు:

రూ.2999 ప్లాన్‌పైనా అద్భుత‌మైన అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు:

జియో ఆరు సంవ‌త్స‌రాల వేడుక‌ల్లో భాగంగా రూ.2999 ప్లాన్‌పై కూడా ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. "1 రీఛార్జ్ తో ఆరు ప్ర‌యోజ‌నాలు" అని దీనికి పేరు పెట్టింది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా వినియోగదారులు జియో నుంచి ఆరు అద‌న‌పు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప్లాన్‌తో వ‌చ్చే ప్ర‌యోజ‌నాల‌తో పాటు.. Reliance Digital, AJIO, Jio Saavn, Netmeds.com, iXigo, 75GB Data పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది.

రూ.2,999 ప్లాన్ ప్ర‌యోజ‌నాలు:

రూ.2,999 ప్లాన్ ప్ర‌యోజ‌నాలు:

ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏడాది రోజులు ఉంటుంది. దీన్ని దీర్ఠ‌కాలిక ప్లాన్‌గా చెప్ప‌వ‌చ్చు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా వినియోగ‌దారులు డైలీ 2.5జీబీ డేటా పొంద‌వ‌చ్చు. మొత్తంగా 912.5జీబీ డేటాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. అదేవిధంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మ‌రియు డైలీ 100ఎస్ఎంఎస్‌ల‌ను పొంద‌వ‌చ్చు. దాంతో పాటుగా ఏడాది పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ పొంద‌వ‌చ్చు. వీటితో పాటుగా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ స‌ర్వీసుల‌ను కూడా వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు. డైలీ నిర్ణీత డేటా పూర్త‌యిన త‌ర్వాత నెట్ వేగం 64కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio Offering Up to Rs 10 Lakh Prize for a Limited Time to Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X