కొత్త రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న జియో,1100జిబి ఉచిత డేటాతో, స్టార్ట్ ఎప్పుడంటే ?

Written By:

దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో రాకతో టెలికారం రంగంలో విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉచిత ఆఫర్లతో జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత డేటా అనేది అత్యంత చీప్ అయింది. అప్పటివరకు టాప్ లో ఉన్న దిగ్గజాలను జియో ఒక్కసారిగా అగాధంలోకి నెట్టివేసింది. ఆకాశంలో ఉన్న డేటా ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. అయితే జియో ప్రస్థానం అక్కడితో ఆగిపోకుండా మరిన్ని రంగాల వైపు తన తన దృష్టిని మళ్లించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే 4జీ సర్వీసులతో దేశంలో మొబైల్‌ విప్లవం సృష్టించిన రిలయన్స్‌ జియో అదేస్థాయిలో మరో విప్లవం సృష్టించబోతున్నది. ఫైబర్‌ టు హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ రంగంలోకి త్వరలోనే దూసుకురాబోతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

రీఛార్జ్ చేయకుండానే జియో నుంచి అన్‌లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్, సింపుల్ ట్రిక్స్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

fibre to the home

రిలయన్స్ జియో అధినేత ముకేష్ అంబానీ fibre to the home (FTTH) broadband కనెక్షన్ సర్వీసులను త్వరలో ప్రారంభించబోతున్నారని హిందూస్తాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈ రంగంలో కూడా దిగ్గజాలకు సవాల్ విసరబోతుందని ఆ పత్రిక తెలిపింది.

గుట్టుచప్పుడు కాకుండా..

గుట్టుచప్పుడు కాకుండా ఫైబర్‌ టు హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లుచేస్తున్నదని ఈ ఏడాది జూలై, డిసెంబర్‌ మధ్య దేశవ్యాప్తంగా ఈ సర్వీసును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని హిందూస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

నెలకు 1100 జీబీ ఉచిత డేటా..

ఎవరూ ఊహించనివిధంగా నెలకు 1100 జీబీ ఉచిత డేటాను సెకనుకు 100ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఫైబర్‌ టు హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం.

రూ.4,500 రిఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌

అయితే జియో fibre to the home (FTTH) broadband కనెక్షన్ పొందాలంటే ముందుగా కస్టమర్ల నుంచి రూ.4,500 రిఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ను రిలయన్స్ జియో వసూలు చేసే అవకాశం ఉందని ఆ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.

100 జిబి ఉచిత డేటా..

100 జిబి ఉచిత డేటాను 100 mbps speedతో ఈ కంపెనీ ఆఫర్ చేయనుందని తెలుస్తోంది. ఈ ఉచిత డేటా అయిపోయిన తర్వాత కస్టమర్లు 45జిబి డేటాను నెలలో పొందుతారని ఇలా నెలలో 25 సార్లు ఉచితంగా పొందుతారని కంపెనీ తెలిపినట్లు సమాచారం.

రీఛార్జ్ చేయకుండానే జియో నుంచి అన్‌లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్, సింపుల్ ట్రిక్స్ !

ట్రయల్స్

కాగా రిలయన్స్ జియో ఈ మధ్యనే కొత్త రంగంలోకి ప్రవేశిస్తున్నామని ఆ రంగంలో ట్రయల్స్ వేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రంగమే fiber-to-the-home (FTTH), Internet of Things (IoT) సర్వీసులని తెలుస్తోంది.

దేశంలోని 99శాతం ప్రాంతాలకు..

కాగా దేశంలోని 99శాతం ప్రాంతాలకు ఈ సేవలను అందించనుంది. ఈ సేవలను పొందేవారికి జియో రూటర్‌ను అందిస్తుంది. అది సెట్‌టాప్‌ బాక్స్‌వలే కూడా పనిచేస్తుంది. దీని ద్వారా అనేక సేవలు పొందేందుకు వీలవుతుంది.

360టీవీ చానల్స్‌..

సుమారు 360టీవీ చానల్స్‌ ఈ బాక్సు ద్వారా పొందవచ్చంటున్నారు. ఇందులో 50 హెచ్‌డీ చానల్స్‌ ఉంటాయి. ఈ బాక్సుకు అనుబంధంగా ఉండే రూటర్‌ ద్వారా వైఫై సిగ్నల్స్‌ వస్తాయి. ఇంటిలోని వారందరూ ఒకేసారి మొబైల్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల ద్వారా హైస్పీడ్‌ డేటా సేవలను పొందేందుకు వీలవుతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలను..

నెట్‌ఫ్లిక్స్‌ లేదా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలను కూడా ఇందులో భాగంగానే చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. కొంతకాలంపాటు ఈ సేవలు ఉచితంగానే లభించే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mukesh Ambani-led Reliance Jio has begun offering fibre to the home (FTTH) broadband connections with 1.1 terabytes (TB) of free data at speeds of 100 megabits per second (mbps) in select markets in the country more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot