Home
News

రూ.1.64 లకే 500MB డేటాను అందిస్తున్న జియో!! వివరాలు ఇవిగో...

ఇండియాలోని టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశించినప్పటి నుంచి తన యొక్క వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తూ నంబర్ వన్ టెలికం ఆపరేటర్ గా ఎదిగింది. ఈ టెల్కో ఇతర ఆపరేటర్లతో పోలిస్తే తన యొక్క యూజర్లకు అందించే ఖరీదైన ప్లాన్లలలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. జియో టెల్కో దీర్ఘకాలిక వాలిడిటీతో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ వినియోగదారులకు 500MB డేటాను కేవలం 1.64 రూపాయలకు మాత్రమే అందిస్తుంది. వినియోగదారులు జియో టారిఫ్ పెంపును ప్రవేశపెట్టడానికి ముందు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే కనుక ఇది అనుకూలంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.2,399 ధర వద్ద అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 500MB డేటాను కేవలం రూ.1.64 లకే అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. టెల్కో దీనిని ‘బెస్ట్ సెల్లర్' కేటగిరీ కింద లభిస్తుండడంతో చాలా మంది ప్రజలు దీనిని అధికంగా కొనుగోలు చేసినట్లు సూచిస్తుంది.

FUP డేటా

ఈ ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటాను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అంటే వినియోగదారుడు మొత్తం వాలిడిటీ కాలంలో మొత్తంగా 730GB డేటాను పొందుతాడు. 730GB డేటాకు యూజర్లు రూ.2,399 చెల్లించాల్సిన అవసరం ఉన్నందున ప్లాన్‌లో లభించే ప్రతి గిగాబైట్ (GB) డేటాకు రూ.3.28 ఖర్చవుతుంది. అంటే 1GB డేటాకు రూ.3.28 ఖర్చవుతుండగా 500MB డేటాకు రూ .1.64 అనగా సగం మాత్రమే ఖర్చు అవుతుంది.

లాంగ్ టర్మ్ ప్లాన్

ప్రస్తుత సమయంలో అధికంగా డేటాను వినియోగించే వారు మరియు నెల నెల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడని వారు. జియో యొక్క లాంగ్ టర్మ్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. దీనిని ఎంచుకున్న వారికి 1GB డేటా కోసం 3.28 రూపాయలు చెల్లించడం అనేది చాలా చౌకగా ఉంటుంది. వినియోగదారులు ఈ డేటాను దీర్ఘకాలికంగా పొందుతున్నందున ఇది వారికి చాలా పొదుపుగా ఉంటుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రోజువారీ FUP డేటాను వినియోగించిన తర్వాత కొత్త రోజు వచ్చే వరకు ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbps కు తగ్గించబడుతుంది. జియో టీవీ, జియో సినిమా, JioCloud, JioSecurity, మరియు JioNews వంటి జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ ప్రయోజనం కూడా అందించబడతాయి.

 

 

జియో రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ సౌలభ్యం

జియో రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ సౌలభ్యం

రిలయన్స్ జియో నుండి లభించే రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ అనేది మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయడంలో ఇబ్బంది పడకూడదనుకునే వినియోగదారులకు చాలా అనుకూలమైనదిగా ఉంటుంది. వోచర్ గడువు గురించి చింతించకుండా మీకు అదనపు డేటా అవసరమైతే కనుక అదనంగా లభించే డేటా వోచర్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. తక్కువ మొత్తంలో డేటాను అందించే జియో యొక్క డేటా వోచర్లు బేస్ ప్లాన్ మాదిరిగానే చెల్లుబాటు అవుతాయి. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ వచ్చే త్రైమాసికంలో లేదా ఆ తరువాత త్రైమాసికంలో జియో ప్రవేశపెట్టగల సుంకం పెంపు నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మొత్తంమీద మీరు చాలా తక్కువ ధరకు ఒక టన్ను డేటాను అందించే జియో ప్రీపెయిడ్ ప్లాన్ కావాలనుకుంటే కనుక రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు

Best Mobiles in India

English summary
Reliance Jio Offers 500MB Mobile Data For Just Rs 1.64: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X