Just In
Don't Miss
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Movies
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గెలాక్సీ ఎస్9 ప్లస్ నచ్చకుంటే 70 శాతం డబ్బు వాపస్, 1TB డేటాతో జియో దూకుడు
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ మార్కెట్లో భారీ ఆఫర్లతో అమ్మకానికి రెడీ అయింది. ఈ ఫోన్ మీద జియో, Airtel పోటా పోటీ ఆఫ్లరను అందిస్తున్నాయి. అయితే ఈ నేఫథ్యంలో జియో ఇంకా ఓ అడుగుముందుకేసింది. Galaxy S9+ స్మార్ట్‌ఫోన్ నచ్చకుంటే 70 శాతం నగదు వాపస్ ఇస్తోంది. దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్‌కు చెందిన 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ మాత్రం ప్రత్యేకంగా శాంసంగ్ స్టోర్లు, శాంసంగ్ ఆన్‌లైన్ షాప్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, జియో స్టోర్స్‌లో మాత్రమే లభిస్తున్నది.
వన్‌ప్లస్ OxygenOSలో 5 బెస్ట్ ఫీచర్లు ఇవే !

ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు..
ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు అందులో జియో సిమ్ వేసి దాంట్లో 12 నెలలకు కలిపి రూ.2500 ఆపైన విలువ గల ప్లాన్లను రీచార్జి చేసుకుని వాడాలి. దీంతో వారు ఆటోమేటిక్‌గా ఈ ఆఫర్‌కు అర్హులు అవుతారు. ఇక 12 నెలల తరువాత ఫోన్‌ను అమ్మదలిస్తే దాని ఎంఆర్‌పీ ధరలో 70 శాతానికి ఫోన్‌ను వినియోగదారులు అమ్మవచ్చు.

256 జీబీ వేరియెంట్‌పై
ఇక గెలాక్సీ ఎస్9 ప్లస్ 256 జీబీ వేరియెంట్‌పై రిలయన్స్ డిజిటల్ రూ.6వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. అదేవిధంగా ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లను కొన్నవారు రూ.4,999 తో రీచార్జి చేసుకుంటే వారికి జియోలో రూ.15వేల విలువైన డేటా బెనిఫిట్ లభిస్తుంది.

1టీబీ (1024 జీబీ) ఉచిత మొబైల్ డేటా..
దీంతో పాటు 1టీబీ (1024 జీబీ) ఉచిత మొబైల్ డేటా ఏడాది పాటు లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. దీంతోపాటు ఈ ఫోన్లను కొన్నవారికి జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కాంప్లిమెంటరీ కింద అందిస్తున్నారు.

ఎయిర్‌టెల్ పెద్ద శుభవార్త
శాంసంగ్ అభిమానులకు ఎయిర్‌టెల్ పెద్ద శుభవార్తను అందించింది. శాసంగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు Galaxy S9, S9 Plusలను ఇకపై యూజర్ల ఎయిర్ టెల్ షోరూంలో కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు కంపెనీ నుంచి ప్రకటన వెలువడింది. అంతేకాదు కంఫర్టబుల్ డౌన్‌పేమెంట్, ఈఎంఐ సదుపాయాలను కూడా అందిస్తోంది. ఇందులో కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు అనుకూలమైన డౌన్ పేమెంట్‌ను ఎంపి కచేసుకోవచ్చు. దీంతోపాటుగా ఎయిర్‌టెల్ ఒక ఆసక్తికర ఆఫర్‌ను కూడా అందించనుంది.

రూ.9,900 డౌన్ పేమెంట్..
గెలాక్సీఎస్ 9.. 64జీబీ వేరియంట్ రూ.9,900 డౌన్ పేమెంట్ ఆప్షన్, తర్వాత 24నెలవారీ వాయిదాలలో రూ.2,499 చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తోంది. గెలాక్సీ ఎస్9 + 64జీబీ వేరియంట్‌ను కేవలం రూ .9,900 డౌన్‌పేమెంట్ చేసి సొంతం చేసుకోవచ్చు. తదుపరి 24 నెలవారీ వాయిదాలలో రూ. 2,799. చెల్లించే అవకాశం.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ఉచితం
ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై అంతేకాదు ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై 8జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఒక సంవత్సరం అమెజాన్ ప్రధాన సభ్యత్వం, ఎయిర్‌టెల్ సెక్యూర్, ఎయిర్‌టెల్ టీవీ, విన్క్ మ్యూజిక్ వంటి ఉత్తేజకరమైన కంటెంట్‌ను అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ఉచితంగా అందిస్తోంది.

ధర , ఫీచర్లు
అయితే ఈ నెలలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన గెలాక్సీ ఎస్ 9 ధర రూ. 57,900. ఎస్ 9 ప్లస్ కు రూ. 64,900 ప్రారంభ ధరగా నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఫీచర్లు
గెలాక్సీ ఎస్ 9 ఫీచర్లు :
5.8కర్వ్‌డ్ సూపర్ ఎమోలెడ్ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్ 4జీబీర్యామ్ 64జీబీస్టోరేజ్ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,
గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫీచర్లు : 6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8 ఓరియో 6జీబీ ర్యామ్ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్ 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190