సంచలనాల జియో మరో సంచలనంతో దూసుకువస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్‌టీని తన కనుగుణంగా మలుచుకునేందుకు రెడీ అయింది. 'జియో వైఫై జియో జీఎస్‌టీ' స్టార్టర్ కిట్ పేరుతో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఏకంగా ఏడాది పాటు డేటాను ఉచితంగా అందించనుంది.
స్పీడ్‌లో దుమ్మురేపిన జియో, Airtelకి పెద్ద షాక్..
జియో స్టార్టర్ కిట్
జియో కొత్తగా జ్యోతిస్ట్ స్టార్టర్ కిట్‌ను గురువారం లాంచ్ చేసింది. ఇందులో బిల్లింగ్ అప్లికేషన్, జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్ ఉచితం.
ఏడాది పాటు అపరిమిత కాల్స్
దీంతోపాటు జియో వైఫై డివైస్ లో ఏడాది పాటు అపరిమిత కాల్స్, 24 జీబీ డేటా అందించనుంది. ఈ కిట్‌తో పాటు వినియోగదారులకు 10,884 రూపాయల ఇతర ఆఫర్లను పొందవచ‍్చని కంపెనీ తెలిపింది.
10,884 రూపాయల వరకు ఆఫర్లను..
రిలయన్స్ జియో వెబ్ సైట్ ప్రకారం, రూ. 1,999 ఖర్చు చేసే ఒక పరికరాన్ని, వినియోగదారులు 10,884 రూపాయల వరకు ఆఫర్లను పొందగలుగుతారు. అంతేకాదు జియో జీఎస్టీ కిట్‌ను ఈఎంఐ పద్ధతిలో కూడా కొనుక్కోవచ్చట.
జియో- జీఎస్‌టీ సొల్యూషన్
జీఎస్‌టీ స్టార్టర్ కిట్‌లో పన్నుచెల్లింపుదారులను అనుమతించడానికి వీలుగా 'జియో- జీఎస్‌టీ సొల్యూషన్' ను అందిస్తోంది.
జీఎస్‌టీ చట్టం నిబంధనలకు
జియో యాప్ బేస్డ్ జీఎస్‌టీ సొల్యూషన్ ప్లాట్ ఫాం ద్వారా రిటైలర్లు తమ రికార్డులను నిర్వహించడానికి, జిఎస్టికి తిరిగి రాబట్టడానికి జీఎస్‌టీ చట్టం నిబంధనలకు అనుగుణంగా సహాయపడుతుంది.
ఏబిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కైనా
ఏబిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కైనా ఇది అనుగుణంగా ఉంటుంది. అంటే బిల్లింగ్‌సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ తో పనిలేకుండానే జీఎస్‌టీ ఫైలింగ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ సేవలను ఏడాదిపాటు పొందవచ్చు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.