జియో రూ.700 ధర పరిధిలోని రెండు ప్లాన్‌లలో బెటర్ ఏది?

|

భారతదేశపు నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కంపెనీ తన యొక్క వినియోగదారులకు ఇప్పుడు దాదాపు ఒకే ధర పరిధిలో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ.719 ధర వద్ద లభించే ప్లాన్ 2021లో టారిఫ్ పెంపు తర్వాత ప్రకటించబడిన కంపెనీ యొక్క పాత ఆఫర్ కావున చాలా మంది వినియోగదారులకు రూ.719 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలిసి ఉండవచ్చు. అయితే రూ.750 ధర వద్ద లభించే ప్లాన్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా జియో కంపెనీ తన యొక్క వినియోగదారులకు అందించింది కావున ఇది చాలా కాలం పాటు ఉండకపోవచ్చు.

రీఛార్జ్

కావున రూ.750 ధర వద్ద లభించే ప్లాన్ తో రీఛార్జ్ చేయడానికి ఇదే సరైన సమయం. మీ ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసేలోపు రీఛార్జ్ చేయడం ద్వారా కూడా మీరు ఈ ప్లాన్‌ను క్యూలో ఉంచవచ్చు. ఈ రెండు ప్లాన్‌ల మధ్య కేవలం రూ.31 తేడా మాత్రమే ఉంది. ఈ రెండింటిలో ఏది వినియోగదారులకు మంచి ఎంపికగా ఉంటుందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

రిలయన్స్ జియో రూ. 719 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో రూ. 719 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

రూ.719 ధర వద్ద జియో అందించిన పాత ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 84 రోజుల చెల్లుబాటు కాలానికి అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు 2GB రోజువారీ డేటా ప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లాన్‌తో అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ మరియు జియోసెక్యూరిటీతో సహా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌తో అందించే మొత్తం డేటా 168GB. అంటే ఈ ప్లాన్‌తో ప్రతి 1GB డేటా (రూ. 719/168) = రూ.4.27 ఖర్చు వస్తుంది. ఈ ప్లాన్‌ని ఉపయోగించడానికి రోజువారీ ఖర్చు (రూ. 719/84) = రూ. 8.55.

రిలయన్స్ జియో రూ. 750 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో రూ. 750 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో సంస్థ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా ప్రకటించిన కొత్త ప్లాన్ రూ.750 ధర వద్ద లభిస్తూ ఇది 90 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. కాబట్టి ఈ ప్లాన్ రెండు భాగాలుగా వస్తుంది. మొదటి భాగం రూ.749 ప్లాన్ అయితే రెండవ భాగం రూ.1 ప్లాన్. రూ.749 ప్లాన్‌తో వినియోగదారులు 90 రోజుల చెల్లుబాటు కాలానికి అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో పాటు రోజువారీ 2GB డేటా ప్రయోజనాలను పొందుతారు. అయితే మరొకటి రూ.1 ప్లాన్ అనేది మీ మైజియో అకౌంటుకు క్రెడిట్ చేయబడే డేటా వోచర్. ఇది మీకు 100MB డేటాను అందిస్తుంది. ఈ 100MB డేటా వోచర్ కూడా 90 రోజుల అదే చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ మరియు జియోసెక్యూరిటీ వంటివి ఉన్నాయి. వినియోగదారులు రూ.749 ప్లాన్‌తో ఒక్కో GB డేటాను (రూ.749/180) = రూ.4.16 లతో పొందుతారు. ఆపై రూ.1 ప్లాన్ అదనంగా 100MB ఉంటుంది. ఈ ప్లాన్‌ను ఉపయోగించడానికి రోజువారీ ఖర్చు (రూ. 750/90) = రూ. 8.33.

Jio Rs.719 VS Jio Rs.750: ఏ ప్లాన్ బెటర్?

Jio Rs.719 VS Jio Rs.750: ఏ ప్లాన్ బెటర్?

రూ.750 ధర వద్ద లభించే ప్లాన్ రోజువారీ ఖర్చుతో మరియు ప్రతి 1GB డేటా ధర పరంగా చూసుకుంటే కనుక రూ.719 ప్లాన్ కంటే తక్కువ ఖర్చును కలిగి ఉండి స్వల్పంగా సరసమైనదిగా ఉంది. ఈ ప్లాన్‌లలో రెండు మంచి ఎంపికగా ఉన్నప్పటికీ వాస్తవం ఏమిటంటే 2022 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రకటించిన రూ.750 ప్లాన్ శాశ్వతంగా ఉండకపోవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio Offers Rs.700 Price Range Two Prepaid Plans: Which One is Better

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X