జియో బంపరాఫర్.. రూ.299కే రోజుకి 1.5GB డేటా.. వ్యాలిడిటీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Jio Rs 299 plan: రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. 28 రోజుల పాటు రోజుకి 1.5GB డేటా ప్లాన్‌ను కేవలం రూ.299కే లాంచ్ చేసింది. ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఇదే చీపెస్ట్ ప్లాన్. ఇంకా ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 100 SMSలు, జియోటీవీ , జియోసినిమా , JioCloud యాప్స్‌కి ఫ్రీ యాక్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా మాత్రం ఉండదు.
* అన్‌లిమిటెడ్ 5G డేటా మిస్సింగ్
రీసెంట్‌గా రేట్లు పెంచిన తర్వాత జియో, ఎయిర్‌టెల్ రెండూ 5G పాలసీలు మార్చేశాయి. ఇప్పుడు రోజుకి 2GB డేటా ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటేనే అన్‌లిమిటెడ్ 5G వాడొచ్చు. 1.5GB ప్లాన్ తీసుకుంటే మాత్రం 5G కవరేజ్ ఉన్నా ఫ్రీ 5G డేటా రాదు.

కానీ 5G ఫోన్ లేకపోయినా, 5G స్పీడ్స్ అంత ఇంపార్టెంట్ కాదనుకున్నా ఈ రూ.299 ప్లాన్ మాత్రం సూపర్ ఆప్షన్. ఈ రూ.299 రీఛార్జ్ చేసుకుంటే రోజుకి 1.5GB డేటా (మొత్తం 28 రోజులకు 42GB) వస్తుంది. ఇండియాలో ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
రోజుకి 100 SMSలు, జియోటీవీ, జియోసినిమా (ప్రీమియం కాదు), జియోక్లౌడ్ యాప్స్‌కి ఫ్రీ యాక్సెస్ లభిస్తాయి. రోజుకిచ్చిన 1.5GB డేటా అయిపోయాక స్పీడ్ మాత్రం 64 Kbpsకి పడిపోతుంది. అయినా వాట్సాప్ మెసేజ్‌ల పంపించడం, రిసీవ్ చేసుకోవడం వంటి చిన్నపాటి ఇంటర్నెట్ పనులు చేసుకోవచ్చు.
* రీఛార్జ్ ఎలా చేసుకోవాలి
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడానికి మైజియో యాప్ బెస్ట్ ఆప్షన్. అందులో చేస్తే ఎక్స్‌ట్రా ఛార్జీలు ఏమీ ఉండవు. కానీ పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడితే మాత్రం కాస్త కన్వీనియన్స్ ఫీజు వేసే ఛాన్స్ ఉంది. దాని వల్ల కాస్త రేటు పెరిగే అవకాశం ఉంది, ఈ విషయాన్ని గమనించాలి.
* డిస్నీ+ హాట్‌స్టార్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
రూ.299 ప్లానే కాదు, ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం జియో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.949. ఇందులో మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. టెలికాం బెనిఫిట్స్‌తో పాటు స్ట్రీమింగ్ బెనిఫిట్స్ కూడా ఉండటం వల్ల మూవీస్, వెబ్ సిరీస్, లైవ్ స్పోర్ట్స్ చూసేవాళ్లకి ఇది బెస్ట్.
* అప్పుడు ప్లాన్ తొలగింపు ఇప్పుడు రీఎంట్రీ
జియో ఈ రూ.299 రీఛార్జ్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. గతంలో ధరలు పెరిగినప్పుడు ఈ ప్లాన్‌ను తొలగించినప్పటికీ, ఇప్పుడు తిరిగి తీసుకురావడం విశేషం. పేద ప్రజలకు అందుబాటు ధరలో ఎక్కువ డేటా అందించాలనే ఉద్దేశంతో జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్‌కు అలవాటు పడిన వినియోగదారులు తిరిగి అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర టెలికాం కంపెనీలు కూడా ఇలాంటి చీపెస్ట్ ప్లాన్లు మళ్లీ తీసుకొస్తే మంచి పోటీ తత్వం ఉంటుంది. వినియోగదారులకు చాలా డబ్బులు కూడా ఆదా అవుతాయి..


Click it and Unblock the Notifications








