రిలయన్స్ జియో యూజర్లకు రూ. 64 వేల కోట్లు సేవ్ చేసిందట, ఎలాగో తెలుసా

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఓ విప్లవాన్ని సృష్టించి చౌక ధరల్లో డేటా అఫర్లు అందిస్తూ అనతి కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

|

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఓ విప్లవాన్ని సృష్టించి చౌక ధరల్లో డేటా అఫర్లు అందిస్తూ అనతి కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చేసుకుంది. జియో దెబ్బతో ఇతర టెలికాం సంస్థలు కూడా డేటా టారిఫ్‌లను తగ్గించి కస్టమర్లకు ఉపశమనం కల్గించాయి. కాగా జియో రాకతో వినియోగదారులకు ఏటా రూ. 64వేల కోట్లు ఆదా అయినట్లు ఓ నివేదిక వెల్లడించింది. దీంతో పాటు తలసరి జీడీపీ కూడా పెరిగిందని పేర్కొంది.జియో ప్రవేశం వల్ల ఒక జిబి డౌన్‌లోడ్‌ ధర 152 రూపాయల నుంచి 10 రూపాయలకు దిగి వచ్చిందని, భారీ సంఖ్యలో భారతీయ జనాభాకు అందుబాటులోకి వచ్చిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ర్టాటజీ అండ్‌ కాంపిటీటివ్‌నెస్‌ భారత అనుబంధ విభాగం అయిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌ (ఐఎ్‌ఫసి) దేశంలో జియో అరంగేట్రం అనంతరం అది చేకూరుస్తున్న ఆర్థిక ప్రయోజనాలపై అధ్యయనం నిర్వహించింది.

ఆ సంచలన టీవీలు మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి..ఆ సంచలన టీవీలు మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి..

జియో తర్వాత భారత టెలికాం మార్కెట్లో ..

జియో తర్వాత భారత టెలికాం మార్కెట్లో ..

జియో తర్వాత భారత టెలికాం మార్కెట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. జీవితకాలం పాటు ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం కల్పించి జియో ఇతర టెలికాం సంస్థలకు పోటీగా నిలిచింది' అని నివేదిక వెల్లడించింది.

జియో ప్రారంభమైన ఆరు నెలల్లోనే..

జియో ప్రారంభమైన ఆరు నెలల్లోనే..

జియో ప్రారంభమైన ఆరు నెలల్లోనే భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక మొబైల్‌ డేటా యూజర్లు గల దేశంగా ఎదిగింది. జియోకు పోటీగా ఇప్పటికే అనేక టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో వినియోగదారులకు డేటా ఖర్చుల నుంచి ఊరట కల్గినట్లయింది.

డేటా ధరలు గణనీయంగా దిగి రావడంతో ..

డేటా ధరలు గణనీయంగా దిగి రావడంతో ..

డేటా ధరలు గణనీయంగా దిగి రావడంతో కొత్త సామాజిక వర్గాలు డేటా వినియోగంలోకి ప్రవేశించాయి. పలువురు తొలిసారిగా ఇంటర్నెట్‌ అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఇంటర్నెట్‌ విస్తరణ ఒక్క టెలికాం రంగానికే కాకుండా ఇంటర్నెట్‌ ఆధారిత వ్యవస్థలకు కూడా వరంగా మారుతుంది. 18 రాష్ర్టాల్లో 2004-14 సంవత్సరాల మధ్య ఇంటర్నెట్‌ విస్తరణ 10 శాతం ఉంటే తలసరి జిడిపి 3.9 శాతం పెరిగింది.

75 శాతం ఆదాయాలు వాయిస్‌ కాల్స్‌ ద్వారానే..

75 శాతం ఆదాయాలు వాయిస్‌ కాల్స్‌ ద్వారానే..

జియో వచ్చే వరకు టెలికాం పరిశ్రమ ముఖచిత్రం ఒకలా ఉంటే ఆ తర్వాత ముఖచిత్రం మరోలా మారిపోయింది. 75 శాతం ఆదాయాలు వాయిస్‌ కాల్స్‌ ద్వారానే ఆర్జిస్తున్న టెలికాం పరిశ్రమలో వినియోగదారులకు ఉచిత జీవిత కాల కాలింగ్‌ సదుపాయం ఇవ్వడం పోటీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

నెలకు 100 కోట్ల జిబి డేటా వినియోగంతో..

నెలకు 100 కోట్ల జిబి డేటా వినియోగంతో..

జియో వచ్చిన తర్వాతి ఆరు నెలల కాలంలోనే దేశంలో నెలకు 100 కోట్ల జిబి డేటా వినియోగంతో ప్రపంచంలోనే అతి పెద్ద డేటా వినియోగదేశంగా మారిపోయింది. అంతకు ముందు ఇది 20 కోట్ల జిబి ఉండేది. 2017 చివరి నాటికి జియో వినియోగదారులు సగటున ప్రతి నెలా 10 జిబి డేటా, 700 నిమిషాల వాయిస్‌ ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా 134 గంటల వీడియోలు వీక్షిస్తున్నారు.

యాప్‌ డౌన్‌లోడ్లలో కూడా ..

యాప్‌ డౌన్‌లోడ్లలో కూడా ..

యాప్‌ డౌన్‌లోడ్లలో కూడా చైనా తర్వాతి స్థానంలో భారత్‌ ఉంది. ఏడాదిన్నర క్రితం డిజిటల్‌ వినియోగం ఇంతగా ఉండేది కాదు. విద్య, ఆరోగ్యం, వినోదం, బ్యాంకింగ్‌ విభాగాల్లో వినియోగదారుల అవసరాల కోసం పలు డిజిటల్‌ అప్లికేషన్లను జియో ప్రవేశపెట్టింది.

Best Mobiles in India

English summary
Reliance Jio offers transformed industry, caused users to save $10 bn More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X