జియో 100జిబి డేటా ఆఫర్

Written By:

దేశీయ దిగ్గజం జియో చైనా కంపెనీలతో జట్టు కట్టింది. ఆ కంపెనీల ఫోన్లపై భారీగానే జియో డేటా ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఒప్పోతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఆ ఫోన్లు కొన్న జియో యూజర్లకు అదనపు డేటాను ఆఫర్‌ లభించనుంది.

నోకియా 6, 8పై స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.309, ఆపై మొత్తాల జియో రీఛార్జ్‌లకు,,

ఒప్పో ఫోన్లు కొన్నవారు రూ.309, ఆపై మొత్తాల జియో రీఛార్జ్‌లకు 100జీబీ వరకు అదనపు డేటాను పొందనున్నారు. ఈ ఆఫర్‌ 2017 అక్టోబర్‌ 27 నుంచి 2018 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఆఫర్‌ 1 :

ఒప్పో ఎఫ్‌3, ఎఫ్‌3 ప్లస్‌, ఎఫ్‌1 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన జియో​ కస్టమర్లకు రూ.309, ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై అదనంగా 10జీబీ డేటాను ప్రతి నెలా అందించనుంది. ఇలా గరిష్టంగా 10 రీఛార్జ్‌లపై ఆఫర్‌ చేయనుంది.

ఆఫర్‌ 2 :

ఒప్పో ఎఫ్‌1ఎస్‌, ఏ33ఎఫ్‌, ఏ37ఎఫ్‌, ఏ37ఎఫ్‌డబ్ల్యూ, ఏ57, ఏ71 స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు కస్టమర్లకు రూ.309, ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై అదనంగా 10జీబీ డేటాను ప్రతి నెలా అందించనుంది. అయితే గరిష్టంగా ఆరు రీఛార్జ్‌లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తించనుంది.

ఈ ఆఫర్‌ రిడీమ్‌ ఎలా చేసుకోవాలంటే...

ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో మైజియో యాప్‌ ఓపెన్‌ చేసి అక్కడ కనిపించే మై వోచర్స్‌ సెక్షన్‌లో రిడీమ్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి కిందవైపున్న రీఛార్జ్‌ బటన్‌ క్లిక్‌ చేయడం ద్వారా మీరు పొందవచ్చు. ఒక్కసారి రీఛార్జ్‌ చేసుకోవడం అయిపోయిన తర్వాత, వోచర్‌ రిడెంప్షన్‌ విజయవంతమైనట్టు ధృవీకరణ అవుతుంది. ఆ తర్వాత మీరు ఈ ఆఫర్ ని విజయవంతంగా అందుకుంటారు.

 

 

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీతో ఒప్పో ఎఫ్5..

ఒప్పో గత నెలలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీతో ఒప్పో ఎఫ్5ని లాంచ్ చేసిన సంగతి విదితమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio-Oppo 100GB data offer: All you want to know more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot