దూసుకొస్తున్న Jio పేమెంట్ బ్యాంక్, SBIతో కలిసి ముందుకు,సమగ్ర సమాచారం ఇదే..
4జీ నెట్‌వర్క్ సేవలతో వినియోగదారులను ఆకట్టుకున్న జియో ఇప్పుడు బ్యాకింగ్ రంగంలోకి ప్రవేశిస్తోంది.
4జీ నెట్‌వర్క్ సేవలతో వినియోగదారులను ఆకట్టుకున్న జియో ఇప్పుడు బ్యాకింగ్ రంగంలోకి ప్రవేశిస్తోంది. రిలయన్స్ జియో ఇకపై బ్యాంకింగ్ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నది. ఈ విషయమై ఇప్పటికే ఎస్‌బీఐ బ్యాంక్‌తో జియో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఏడాది మార్చిలో 10 కోట్ల వినియోగదారుల మార్క్‌ను దాటిన జియో ఆర్‌బీఐ నుంచి పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ పొందింది. కాగా డిసెంబర్ నెలలో ఈ బ్యాంక్ సేవలను ప్రారంభించనుంది. ఎయిర్‌టెల్, పేటీఎం వంటి సంస్థలు ఇప్పటికే పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందిస్తుండగా ఆ కోవలో ఇప్పుడు జియో వచ్చి చేరనుంది.

వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా సేవలను అందించాలని ఆర్‌బీఐ సూచించడంతో జియో ఆ దిశగా సేవలను అందించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో జియో తన పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.

పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏమిటి..?
ఈ బ్యాంకులు మొబైల్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి. ఆర్బిఐ మార్గదర్శకాలతో ఈ బ్యాంకులు తమ శాఖలను ఏర్పాటు చేస్తాయి.

ఇండియాలో ఉన్న పేమెంట్ బ్యాంకులు
ఆదిత్యా బిర్లా Nuvo Ltd, Airtel M Commerce Services Ltd, Cholamandalam Distribution Services Ltd,
Department of Posts
Fino PayTech Ltd
National Securities Depository Ltd
Reliance Industries Ltd
Dilip Shantilal Shanghvi
Vijay Shekhar Sharma
Tech Mahindra Ltd
Vodafone m-pesa Ltd

ఎంత మనీ డిపాజిట్
ఈ బ్యాంకుల్లో లక్ష వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది సేవింగ్ బ్యాంకు అకౌంట్ ద్వారా పనిచేస్తుంది.

పేమెంట్ బ్యాంకులు ఎలా ఉపయోగించుకోవచ్చు
వీటిని మొబైల్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. మీ మొబైల్‌లో ఆ బ్యాంకు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే చాలు. రోజు వారి లావాదేవీలు జరుపుకోవచ్చు.

లోన్లు
ఈ బ్యాంకులు మీకు ఎటువంటి లోన్లను కాని క్రెడిట్ కార్డులు కాని ఇవ్వవు. ఇది కేవలం చిన్న చిన్న లావాదేవీలు జరుపుకోవడానికి మాత్రమే.

ఏటీఎం కార్డులు
ఈ బ్యాంకులు మీకు ఏటీఎం కార్డులు ప్రొవైడ్ చేస్తాయి. ఇవి అన్ని ఏటీఏం కేంద్రాలలో పనిచేస్తాయి. అలాగే Forex Cardsని కూడా తక్కువ ఫీజుతో ఇవి అందిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








