Home
News

ఈ సారి జియో కొట్టే దెబ్బతో అన్నీ అబ్బా అనాల్సిందే...

టెలికాం రంగంలో తీవ్ర దుమారం రేపి, అప్పటి వరకూ దిగ్గజాలుగా ఉన్న కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.

By Hazarath

టెలికాం రంగంలో తీవ్ర దుమారం రేపి, అప్పటి వరకూ దిగ్గజాలుగా ఉన్న కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఇండియాలో అందుబాటులో లేని 5జీ సేవలను మొట్టమొదటి సారిగా జియో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

శాంసంగ్‌తో చేతులు కలిపిన రిలయన్స్ జియో

శాంసంగ్‌తో చేతులు కలిపిన రిలయన్స్ జియో

భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేపుతూ శాంసంగ్‌తో చేతులు కలిపిన రిలయన్స్ జియో... త్వరలోనే 5జీ సర్వీస్ సేవలను ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తోంది.

5జీ సర్వీసుల విషయాన్ని

5జీ సర్వీసుల విషయాన్ని

కొత్త సర్వీస్‌లు ఎప్పటి నుంచీ మొదలవుతాయో ఇంకా తెలీకున్నా.. స్పెయిన్‌లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో 5జీ సర్వీసుల విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించిన విషయం తెలిసిందే.

Airspan నెట్ వర్క్

Airspan నెట్ వర్క్

ఇదిలా ఉంటే జియో 5జీ సేవలను ఇండియాలో ప్రారంభించేందుకు ఇజ్రాయిల్ కు చెందిన Airspan నెట్ వర్క్ తో కలిసి వ్యూహాలను రచిస్తోంది.

350 టెరా బైట్స్ డేటాతో పాటు 5 మిలియన్ వోల్ట్ కాల్స్

350 టెరా బైట్స్ డేటాతో పాటు 5 మిలియన్ వోల్ట్ కాల్స్

ఈ కంపెనీ స్మాల్ సెల్స్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేసే దిశగా సాగుతోంది. దీని ద్వారా ప్రతిరోజూ 350 టెరా బైట్స్ డేటాతో పాటు 5 మిలియన్ వోల్ట్ కాల్స్ వెళ్లే విధంగా ఈ నెట్ వర్క్ తయారుకానుంది.

5జీని 6జీని సపోర్ట్ చేసే విధంగా

5జీని 6జీని సపోర్ట్ చేసే విధంగా

రానున్న మూడు సంవత్సరాల్లో పైబర్ ఆఫ్టిక్ కేబుల్స్ 5జీని 6జీని సపోర్ట్ చేసే విధంగా, 4జీ వైర్లే 5జీకి కనెక్ట్ అయ్యే విధంగా గ్రామ గ్రామాలకు విస్తరించేలా జియో వ్యూహాలు రచిస్తోంది.

త్వరలోనే 5జీ స్మార్ట్ ఫోన్లను

త్వరలోనే 5జీ స్మార్ట్ ఫోన్లను

దీంతో పాటు జియో త్వరలోనే 5జీ స్మార్ట్ ఫోన్లను కూడా మార్కెట్ లోకి తీసుకురానుంది. 

 దేశ వ్యాప్తంగా 2 లక్షల 50 వేల కిలో మీటర్ల మేర

దేశ వ్యాప్తంగా 2 లక్షల 50 వేల కిలో మీటర్ల మేర

అదీ కాక జియో దేశ వ్యాప్తంగా 2 లక్షల 50 వేల కిలో మీటర్ల మేర ఫైబర్ ఆఫ్టిక్ ను 4జీ కోసం వేయనున్నుట్లు సమాచారం. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే విధంగా ఈ పైబర్ ఆప్టిక్ రానుంది.

మరోవైపు నోకియా

మరోవైపు నోకియా

మరోవైపు నోకియా ఇప్పటికే 5జీ సేవలపై దృష్టి సారించి బీఎస్ఎన్ఎల్ తో జట్టుకట్టగా.. ఇప్పుడు జియో తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది.

Best Mobiles in India

English summary
Reliance Jio plans to bring 5G internet to your smartphones Read more At Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X