బిట్ కాయిన్‌కు పోటీగా జియో కాయిన్, అంబాని టార్గెట్ ..?

Written By:

దేశీయ టెలికాం రంగంలో అత్యంత చవకైన ప్లాన్లతో దిగ్గజాలను మట్టికరిపించిన రిలయన్స్ జియో భారీ కొండనే ఢీకొట్టబోతుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిర బిట్ కాయిన్ తరహాలో ముఖేష్ అంబాని జియో కాయిన్ పేరిట తన సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించేదిశగా అడుగులు వేస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని జియో అధికారికంగా ధృవీకరించనప్పటికీ భవిష్యత్ లో ఇది జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

జియోతో సహా అన్ని టెల్కోలకు భారీ దెబ్బ, ఆ ఛార్జీలు సగం తగ్గింపు, ట్రాయ్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో కాయిన్

లైవ్‌మింట్‌ రిపోర్టు ప్రకారం రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ జియో కాయిన్ పేరిట మార్కెట్లోకి తన సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా తెలుస్తోంది.

అధినేతగా ముఖేష్‌ పెద్ద కొడుకు..

దీనికి అధినేతగా ముఖేష్‌ పెద్ద కొడుకు ఆకాష్‌ అంబానీ సారధ్యం వహిస్తున్నట్లుగా ఆ రిపోర్టు తెలిపింది. మొత్తం 50 మంది యువకులతో కూడిన టీమ్ జియో కాయిన్ మీద కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ వైపు..

వీరంతా క్రిప్టోకరెన్సీ రూపకల్పన, దాని విక్రయం వంటి అన్ని అంశాలను పరిశీలిస్తూ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ వైపు శరవేగంగా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే సమాచారం బయటకు వస్తోంది.

పెట్టుబడులకు పెట్టుబడిదారులు..

కాగా వీటిల్లో పెట్టుబడులకు పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండడంతో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఈ వ్యాపారంపై కన్నేసినట్టు లైవ్‌మింట్‌ పేర్కొంది.

చట్టవిరుద్ధమైన కరెన్సీ..

అయితే క్రిప్టోకరెన్సీలో పెట్టబడులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. ఇది చట్టవిరుద్ధమైన కరెన్సీగా ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇందులో పెట్టుబడులు పెట్టరాదని పెట్టుబడిదారులను హెచ్చరించారు.

గ్యారెంటీ ఉండదని..

బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు గ్యారెంటీ ఉండదని స్పష్టంచేశారు. వీటిల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని దీనికి చట్టబద్దత లేదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.

ఎటువంటి అధికారిక సమాచారం..

అయితే ఈ జియో కాయిన్ విషయంపై రిలయన్స్ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కేవలం లైవ్‌మింట్‌ మాత్రమే దీనిని రిపోర్ట్ చేసింది. మరి ఇందులో నిజమెంత అన్నది జియో స్వయంగా ప్రకటించేవరకు తెలియదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio plans its own cryptocurrency JioCoin, Akash Ambani leading project More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot