Home
News

లవ్ ట్వీటుతో ప్రత్యర్థులకు అదిరిపోయే ఝలక్ ఇచ్చిన జియో

దేశీయ టెలికాం రంగంలో షాకుల మీద షాకులు ఇస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో ప్రత్యర్థులకు లవర్స్ డే రోజున దిమ్మదిరిగే ఝలక్ ఇచ్చింది.

దేశీయ టెలికాం రంగంలో షాకుల మీద షాకులు ఇస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో ప్రత్యర్థులకు లవర్స్ డే రోజున దిమ్మదిరిగే ఝలక్ ఇచ్చింది. కేవలం ఒకే ఒక్క ట్వీట్‌తో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలను ట్రోల్ చేసింది. కాగా ఇండియన్ టెలికం రంగంలో తన ఎంట్రీతోనే సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఉచిత కాల్స్, ఉచిత మెసేజ్‌లు, చౌక ధరకే 4జీ డేటాతో ప్రత్యర్థులకు చమటలు పట్టించింది. ఇప్పుడు ట్వీటీతో అదరగొట్టింది. విషయంలోకి వెళ్తే..

కవిత రూపంలో ఒక ట్వీట్

వాలెంటైన్స్ డే నాడు రిలయన్స్ జియో తన ప్రత్యర్థులను ఉద్దేశించి కవిత రూపంలో ఒక ట్వీట్ చేసింది. ఇందులో ‘రోజెస్ ఆర్ రెడ్.. వైలెట్స్ ఆర్ బ్లూ.. వన్స్ ఎ నైబర్ ఇన్ సిమ్ స్లాట్ 2, వేర్ ఆర్ యూ? హ్యాపీ వాలెంటైన్స్ డే' అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో తన ప్రత్యర్థులందరినీ ట్రోల్ చేసింది.

రెండో సిమ్ స్లాట్‌‌

రెండో సిమ్ స్లాట్‌‌

రిలయన్స్ జియో ఈ ట్వీట్ ద్వారా రెండో సిమ్ స్లాట్‌‌ను కూడా తామే ఆక్రమిస్తున్నామని పరోక్షంగా తెలియజేసింది. జియో సిమ్ కార్డు 4జీ సిమ్ స్లాట్‌లోనే పని చేస్తుంది.

 

 

మొదటి సిమ్ స్లాట్

మొదటి సిమ్ స్లాట్

సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లో మొదటి సిమ్ స్లాట్ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు రెండో సిమ్ స్లాట్ స్థానాన్ని కూడా తామే ఆక్రమిస్తున్నామని తెలిపింది. కాగా ఈ ట్వీట్‌కు 2,300కు పైగా లైక్‌లు, 500కు పైగా రీట్వీట్‌లు వచ్చాయి.

రియాక్షన్

రియాక్షన్

ఈ విషయం మీద ప్రత్యర్థులైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాల నుంచి ఎటువంటి రియాక్షన్ ఇంకా రాలేదు. కాగా ఈ విషయం మీద ఈ దిగ్గజాలు సీరియస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్రాయ్ కు కంప్లయిట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

 

 

యూజర్లను కాపాడుకునేందుకు

యూజర్లను కాపాడుకునేందుకు

కాగా జియో ఎంట్రీతో చేసిదేమీలేక యూజర్లను కాపాడుకునేందుకు ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు కూడా వాటి చార్జీలను తగ్గించుకోవాల్సి వస్తోంది. టెల్కోలు కొత్త కొత్త ప్లాన్లు ఆవిష్కరిస్తూ కస్టమర్లను కాపాడుకుంటునే పనిలో బిజీ అయ్యాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio sends ‘missing you’ message to Airtel, Vodafone More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X