సరసమైన ధరల వద్ద తక్కువ డేటాతో లభించే జియో ప్లాన్‌లు ఇవే...

|

ఇండియాలోని టెలికాం రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో యొక్క కస్టమర్ బేస్ ను పెంచుకోవడానికి మరియు ఇతర టెల్కోలకు పోటీగా జనాదరణ పొందిన అనేక ప్లాన్‌లను విడుదల చేసింది. రోజువారీ అధిక డేటా బెనిఫిట్ మరియు ఉచిత OTT సబ్స్క్రిప్షన్ లను కోరుకునే వారికి అద్బుతమైన ప్లాన్‌లను అందించినట్లే అధికంగా డేటాను వినియోగించని వారికి సరసమైన ధరల వద్ద కూడా ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. అయితే ఇతర టెల్కోలకు పోటీగా కేవలం రూ.129 నుండి అందించడం గమనార్హం. సరసమైన ధరల వద్ద తక్కువ డేటా ప్రయోజనంతో అధిక చెల్లుబాటు కాలంతో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

తక్కువ ధరలో లభించే జియో రూ.129 ప్రీపెయిడ్ ప్యాక్ ప్రయోజనాలు
 

తక్కువ ధరలో లభించే జియో రూ.129 ప్రీపెయిడ్ ప్యాక్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో రూ.129 సరసమైన ధర వద్ద అందించే ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌ అద్బుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీనిని ‘2GB ప్యాక్' అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం జియో నెట్‌వర్క్‌లో అత్యంత సరసమైన ధరలో లభించే అపరిమిత కాంబో ప్లాన్ ఇదే కావడం విశేషం. ఈ ప్యాక్ భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్, 2GB 4G డేటా మరియు 300SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. 2GB హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత డేటా స్పీడ్ 64Kbps కు తగ్గించబడుతుంది అని రిలయన్స్ జియో తెలిపింది. ఇదేకాకుండా కాంప్లిమెంటరీ విభాగంలో జియో యొక్క అన్ని యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

జియో రూ.329 ప్రీపెయిడ్ ప్యాక్ ప్రయోజనాలు

జియో రూ.329 ప్రీపెయిడ్ ప్యాక్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో సరసమైన ధరలో అందించే రెండవ ప్లాన్ యొక్క ధర రూ.329. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.129 ప్యాక్ అందించే ప్రయోజనాలకు మూడు రెట్లను అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాల్లో అపరిమిత వాయిస్ కాలింగ్, 1000SMS‌లు, 6GB 4G మొబైల్ డేటా ఉన్నాయి. ఈ డేటా తరువాత స్పీడ్ 64Kbps‌ కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం 84 రోజులు. ఈ ప్లాన్ కూడా జియో యొక్క అన్ని యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

జియో 24GB ప్యాక్ ప్రయోజనాలు

జియో 24GB ప్యాక్ ప్రయోజనాలు

‘24GB ప్యాక్' పేరుతో లభించే రిలయన్స్ జియో యొక్క రూ.1,299 ప్రీపెయిడ్ ప్లాన్ అధికంగా డేటాను వినియోగించని వారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమమైన మరియు సరసమైన దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్ లో ఇదే బెస్ట్. 336 రోజుల చెల్లుబాటుతో లభించే ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది దేశంలోని అన్ని నెట్వర్క్ లకు అపరిమిత ఆన్-నెట్ & ఆఫ్-నెట్ కాల్స్, 3600 SMSలు మరియు 24GB డేటా ప్రయోజనం లభిస్తుంది. అదనపు ప్రయోజనాలలో JioTV, JioCinema వంటి జియో యాప్ లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ను ఉచితంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ vs జియో: సరసమైన ధర ప్రీపెయిడ్ ప్లాన్‌లు
 

ఎయిర్‌టెల్ vs జియో: సరసమైన ధర ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ కూడా ఇలాంటి ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. జియో రూ.129 ధర వద్ద తన సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుండగా భారతి ఎయిర్‌టెల్ రూ.149 ధర వద్ద అందిస్తుంది. దీని తరువాత రూ.379 ధర వద్ద కూడా అందిస్తోంది. చివరగా జియో యొక్క రూ.1,299 ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ రూ.1,498 వార్షిక ప్లాన్ ను అందిస్తుంది. అయితే ఎయిర్‌టెల్ లాంగ్ టర్మ్ ప్లాన్ యొక్క చెల్లుబాటు 365 రోజులు ఉండగా జియో యొక్క రూ.1,299 ప్లాన్ చెల్లుబాటు 336 రోజులు మాత్రమే. రెండు టెల్కోలు దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికలను అందిస్తున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio Prepaid Plans Available At Affordable Prices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X