తక్కువ ధరకు రోజుకు 2GB & 3GB డేటాను అందిస్తున్న రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

|

రిలయన్స్ జియో ఇప్పుడు తక్కువ ధర వద్ద అధిక డేటాను అందిస్తున్న చౌకైన ఆపరేటర్‌గా ఉంది. ఈ టెలికాం ఆపరేటర్ ఇతర నెట్‌వర్క్‌లకు చాలా కాల్స్ చేయడానికి చందాదారులు అదనపు మొత్తాన్ని తన చందాదారుల నుండి IUC ఛార్జీలతో నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తున్నప్పటికీ డేటా విషయానికి వస్తే రిలయన్స్ జియోకు గొప్ప ఆఫర్లతో వస్తున్నది.

 

ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా నుండి పోల్చదగిన సమర్పణల కంటే దాదాపు 20% ధరతో ఉన్నాయి. దీని అర్థం చాలా డేటాను ఉపయోగించే చందాదారులకు రిలయన్స్ జియో ఒక మంచి ఎంపిక. అలాగే ఎవరైనా ఎక్కువ కాల్స్ చేయకపోతే వారు ప్రీపెయిడ్ రీఛార్జిలలో చాలా డబ్బు ఆదా చేయవచ్చు.

 

 

1 మిలియన్ వినియోగదారులను దాటిన ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్1 మిలియన్ వినియోగదారులను దాటిన ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్

జియో

ఇప్పుడు రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లలో 1.5 జిబి డైలీ డేటా మరియు 2 జిబి డైలీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఏదేమైనా రిలయన్స్ జియో ఇప్పుడు 3GB రోజువారీ డేటా ప్లాన్లను కూడా అందిస్తున్నది. చందాదారులకు ఎక్కువ డేటా అవసరమైతే వాటిని ఎంచుకోవచ్చు. వాటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

గూగుల్ మ్యాప్స్ ద్వారా పార్కింగ్ అందుబాటును తెలుసుకోవడం ఎలా?గూగుల్ మ్యాప్స్ ద్వారా పార్కింగ్ అందుబాటును తెలుసుకోవడం ఎలా?

 2GB డైలీ డేటాతో రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు
 

2GB డైలీ డేటాతో రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో ద్వారా రోజుకు 2GB డేటాను అందిస్తున్న అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను పరిశీలిద్దాం. ఇందులో భాగంగా రిలయన్స్ జియో యొక్క రూ.249 ల ప్లాన్‌ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ చందాదారులకు 2 జిబి రోజువారీ డేటాను, నాన్-జియో ఆపరేటర్లకు 1000 నిమిషాల కాల్ మరియు జియో టు జియో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది.

 

 

టిక్‌టాక్‌కు పోటీగా భారత్‌లో త్వరలో ఫేస్‌బుక్ వీడియో యాప్టిక్‌టాక్‌కు పోటీగా భారత్‌లో త్వరలో ఫేస్‌బుక్ వీడియో యాప్

ఇతర ఎంపికలు

ఈ ప్లాన్‌లలో ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. ఇందులో రిలయన్స్ జియో యొక్క రూ.444ల ప్లాన్. ఇది 56 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ చందాదారులకు 2,000 నాన్-జియో నిమిషాలను మరియు జియో టు జియో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. చివరగా రిలయన్స్ జియో యొక్క రూ.599 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో రోజుకు 2 జిబి డేటాను చందాదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్ జియో టు జియో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ ప్రయోజనాలతో పాటు 3,000 నిమిషాల నాన్-జియో కాలింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని చందాదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తాయి.

 

 

కనీస రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన ఎయిర్‌టెల్ & వొడాఫోన్ ఐడియాకనీస రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన ఎయిర్‌టెల్ & వొడాఫోన్ ఐడియా

3GB డైలీ డేటాతో రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

3GB డైలీ డేటాతో రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో చందాదారుల కోసం రోజుకు 3 జిబి డేటాను అందిసున్న ప్లాన్‌ల విషయానికొస్తే రూ.349 ప్లాన్ ముందు వరుసలో ఉంది. ఈ ప్లాన్ మొత్తం రోస్టర్‌లో రోజుకు 3 జిబి డేటాను అందించే ఏకైక ప్లాన్‌. భారీ డేటాను ఉపయోగించాలి అనుకునే చాలా మంది చందాదారులకు ఈ ప్లాన్ ఖచ్చితంగా సరిపోతుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో జియో టు జియో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ మరియు 1,000 నిమిషాల నాన్-జియో కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కాకుండా చందాదారులు రిలయన్స్ జియో పోర్ట్‌ఫోలియో యాప్ ల చందాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను కూడా పొందవచ్చు.

 

 

Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!

రిలయన్స్ జియో 4G డేటా వోచర్

రిలయన్స్ జియో 4G డేటా వోచర్

ఒకవేళ చందాదారులు ఇప్పుడు వాడుతున్న అధిక డేటా కూడా అయిపోయినట్లయితే అటువంటి వారి కోసం రిలయన్స్ జియో విడిగా డేటా ప్యాక్‌లను కూడా అందిస్తోంది. ఈ డేటా ప్యాక్‌లను మీ డేటా పరిమితిలో రోజువారీ పరిమితి లేకుండా విస్తరించడానికి ఉపయోగించవచ్చు. కానీ ఈ డేటా ప్యాక్‌ల యొక్క చెల్లుబాటు మీ బేస్ ప్లాన్ యొక్క చెల్లుబాటుకు సమానం. ఈ డేటా ప్యాక్‌లు రూ.11, రూ .21, రూ .51 మరియు రూ.101 వంటి అనేక ఆప్షన్లలో కూడా లభిస్తాయి. ఈ ప్లాన్‌లు 6 జిబి వరకు డేటాను అందిస్తాయి. ఇవి చందాదారుల రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఉపయోగించవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio Prepaid Plans Offering 2GB and 3GB Data Per Day at a Low Price

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X