Home
News

జియో ప్రైమ్ ఉచితం.. అలా చేయండి, ఇలా తీసుకోండి

జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్‌ను ఉచితంగా పొందేందుకు సరికొత్త ఆఫర్

By Sivanjaneyulu Bommu

జియో నెట్‌వర్క్‌లోకి మరింత మంది యూజర్లను రాబట్టే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సరికొత్త ఆఫర్లను అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. జనవరి 1, 2017 నుంచి జియో అందుబాటులో ఉంచిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ మార్చి 31, 2017తో పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌ను జియో అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

Read More : ఫోన్ నచ్చకుంటే 90 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు..?

 మార్చి 31, 2018 వరకు ప్రత్యేక రాయితీలతో జియో సర్వీసులు

మార్చి 31, 2018 వరకు ప్రత్యేక రాయితీలతో జియో సర్వీసులు

మార్చి 1, 2017 నుంచి అందుబాటులోవచ్చిన ఈ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్ మార్చి 31, 2017 వరకు అందుబాటులో ఉంటుంది. జియో యూజర్లు మార్చి 31, 2017లోపు రూ.99 చెల్లించి ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకోవటం ద్వారా మార్చి 31, 2018 వరకు ప్రత్యేక రాయితీలతో కూడిన జియో సర్వీసులు వర్తిస్తాయి

రూ.303 చెల్లించి రీచార్జ్ చేసుకోవటం ద్వారా...

రూ.303 చెల్లించి రీచార్జ్ చేసుకోవటం ద్వారా...

ఈ 12 నెలల సబ్‌స్క్రిప్షన్ పిరియడ్‌లో, జియో ప్రైమ్ యూజర్ నెలకు రూ.303 పెట్టి రీచార్జ్ చేసుకోవటం ద్వారా ప్రస్తుతం ఉన్న హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తరహాలోనే రోజుకు 1జీబి డేటాతో పాటు జియో మీడియో సర్వీసెస్ ఇంకా కాల్స్ అందుబాటులో ఉంటాయి.

జియో మనీ ద్వారా

జియో మనీ ద్వారా

జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్‌ను ఉచితంగా పొందేందుకుగాను సరికొత్త ఆఫర్‌ను, జియో మనీ అప్లికేషన్ ద్వారా రిలయన్స్ లాంచ్ చేసింది. ఆఫర్ వివరాలను పరిశీలించినట్లయితే..

స్టెప్ 1

స్టెప్ 1

జియో మనీ యాప్ ద్వారా చేసే ప్రతి రీఛార్జ్ పై రూ.50 క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్ ఆఫర్ చేస్తుంది. ఈ క్రమంలో మీరు ముందుగా జియో మనీ యాప్‌ను గూగుల్ ప్లో స్టోర్ ద్వారా మీ ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకుని యాప్ ద్వారా రూ.99 ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ను తీసుకోండి. ఇప్పుడు మీకు రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

స్టెప్ 2

స్టెప్ 2

ప్రైమ్ మెంబర్ షిప్‌ను తీసుకున్న తరువాత నెలవారీ చందాక్రింద రూ.303 తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంది. కాబట్లి, రూ.303 రీచార్జ్‌ను కూడా జియో మనీ యాప్ ద్వారా మీరు కొనుగోలు చేసినట్లయితే మరో రూ.50 క్యాష్‌బ్యాక్ మీకు లభిస్తుంది.

క్యాష్‌బ్యాక్ మనీ వాలెట్‌లోకి వస్తుంది..

క్యాష్‌బ్యాక్ మనీ వాలెట్‌లోకి వస్తుంది..

ఈ క్యాష్‌బ్యాక్ అనేది జియో మనీ వాలెట్‌లోకి వస్తుంది. తద్వారా మీరు మరొకసారి రీఛార్జి చేసుకోవచ్చు. లేకుంటే ఏదయినా షాపింగ్ కోసం యూజ్ చేయవచ్చు. మొత్తం మీద 5సార్లు దీన్ని వాడుకోవచ్చు.

ఇతర షాపింగ్‌లకు వాడుకోవచ్చు

ఇతర షాపింగ్‌లకు వాడుకోవచ్చు

జియో ప్రైమ్ ఆఫర్, రూ.99కే కాకుండా మిగతా ప్లాన్స్‌కి కూడా రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు jio వాలెట్ మనీ యాప్ ద్వారా రీఛార్జి చేసిన ప్రతిసారి రూ. 50 సేవ్ అవుతాయి. దాన్ని మీరు ఇతర షాపింగ్‌లకు వాడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio Prime membership available for free;how to avail. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X