JioJuiceతో దుమ్మురేపిన ముకేష్ అంబానీ, యూజర్లకు పండగే, పూర్తి వివరాలు ఇవే

సస్పెన్స్‌కు తెరదించుతూ రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిపాటు కొనసాగిన ప్రైమ్ మెంబర్ షిప్ మార్చి31తో ముగియనున్న నేపథ్యంలో సరికొత్త ప్రకటన చేసింది.

|

సస్పెన్స్‌కు తెరదించుతూ రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిపాటు కొనసాగిన ప్రైమ్ మెంబర్ షిప్ మార్చి31తో ముగియనున్న నేపథ్యంలో సరికొత్త ప్రకటన చేసింది.స‌రికొత్త‌గా జియో జ్యూస్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ప్లాన్లో భాగంగా జియో యాజమాన్యం 99 రూపాయ‌ల‌తో రీఛార్జ్ చేయించుకున్న వినియోగ‌దారులను ప్రైమ్ మెంబ‌ర్లుగా గుర్తించింది. వారికోసం 'జియో జ్యూస్‌' పేరుతో సరికొత్త ప్లాన్‌ను ఏప్రిల్ 1 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంచింది. ప్రైమ్ మెంబ‌ర్లుగా ఉన్న‌వారు మ‌రో ఏడాది పాటు ఎలాంటి రుసుం లేకుండానే ఉచితంగా ప్రైమ్ సేవ‌ల‌ను పొందవ‌చ్చ‌ని జియో ప్ర‌క‌టించింది.పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

తక్కువ ధరలో 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తున్న ప్లాన్లు, బెస్ట్ ఛాయిస్ మీదేతక్కువ ధరలో 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తున్న ప్లాన్లు, బెస్ట్ ఛాయిస్ మీదే

జియో జ్యూస్ వ‌స్తోంది..

జియో జ్యూస్ వ‌స్తోంది..

మీ డిజిటల్‌ జీవితంలో ఎలాంటి అంతరాయం ఉండదు. జియో జ్యూస్ వ‌స్తోంది' అంటూ ట్విట్టర్లో ఓ జిప్ ఫైల్‌ను రిల‌య‌న్స్ జియో యాజ‌మాన్యం ట్వీట్ చేసింది.

309 రూపాయ‌లు

309 రూపాయ‌లు

309 రూపాయ‌లు లేదా ఆపై మొత్తాల రీఛార్జ్‌తో పాటు వన్ టైమ్‌ వార్షిక ఫీజు కింద 99 రూపాయలు చెల్లించిన వారికి ఈ ప్లాన్ స‌భ్య‌త్వం వర్తిస్తుందని ట్విట్టర్లో ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే కంపెనీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది.

70 రోజుల పాటు..
 

70 రోజుల పాటు..

కేవలం 399 రూపాయల ఛార్జ్‌తోనే ఉచితంగా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను, ఎస్‌ఎంఎస్‌లను, 4జీ డేటాను యూజర్లు 70 రోజుల పాటు పొందవచ్చు. జియో ప్రైమ్ యూజర్లు కొన్ని ప్రత్యేక ప్లాన్స్‌ను కూడా ఉన్నాయి. అంతేకాక ఏడాది పాటు వెయ్యి రూపాయల విలువైన జియో ప్రీమియం కంటెంట్‌ను పొందవచ్చు.

 జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ..

జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ..

ప్రైమ్ సభ్యత్వం కలిగిన ఖాతాదారులకు జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ పీవీ-19, పీవీ-49, పీవీ-96, రూ.149, పీవీ రూ. 303, పీవీ-351, పోస్టు పెయిడ్ ప్లాన్ రూ.303, రూ.499, రూ.999 ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే జియో యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

జియో యాప్‌లో..

జియో యాప్‌లో..

అందుకు గాను జియో యాప్‌లో అందుబాటులోకి రానున్న ఓ ఆప్ష‌న్‌ను క్లిక్ చేసి అందులో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ కొన‌సాగించేందుకు సంసిద్ధ‌త‌ను తెలుపుతూ క‌స్ట‌మ‌ర్లు రిక్వెస్ట్ పెట్టుకోవాలి.

 ఏప్రిల్ 1, 2018 నుంచి..

ఏప్రిల్ 1, 2018 నుంచి..

దీంతో ఏప్రిల్ 1, 2018 నుంచి మార్చి 31, 2019 వ‌ర‌కు ఏడాది పాటు ఎలాంటి రుసుం చెల్లించ‌కుండానే జియో ప్రైమ్ మెంబ‌ర్ షిప్ ఉచితంగా ల‌భిస్తుంది.

 కొత్తగా జియోలో చేరే క‌స్ట‌మ‌ర్లు..

కొత్తగా జియోలో చేరే క‌స్ట‌మ‌ర్లు..

ఇక కొత్తగా జియోలో చేరే క‌స్ట‌మ‌ర్లు మాత్రం ఎప్ప‌టిలా రూ.99 చెల్లించి ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను పొందాల్సి ఉంటుంది. దీంతో వారికి కూడా ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ సేవ‌లు మార్చి 31, 2019 వ‌ర‌కు ల‌భిస్తాయి.

యాప్స్‌తో మూవీస్‌, వీడియో లాంటి మ్యూజిక్‌..

యాప్స్‌తో మూవీస్‌, వీడియో లాంటి మ్యూజిక్‌..

ఎప్పటికప్పుడు జియో ప్రైమ్‌ యూజర్లకు ఆఫర్లను, డీల్స్‌ను జియో ప్రకటిస్తూ వచ్చింది. అంతేకాక జియో యాప్స్‌ అన్ని ఉచితంగా లభించాయి. ఈ యాప్స్‌తో మూవీస్‌, వీడియో లాంటి మ్యూజిక్‌, కంటెంట్‌ను యూజర్లు ఉచితంగా పొందుతున్నారు.

ప్రస్తుతం 175 మిలియన్ల మంది జియోకు ఖాతాదారులు..

ప్రస్తుతం 175 మిలియన్ల మంది జియోకు ఖాతాదారులు..

గతేడాది జియో 99 రూపాయలతో ఈ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 175 మిలియన్ల మంది జియోకు ఖాతాదారులుగా ఉన్నారు. సాధారణ వినియోగదారులతో పోలిస్తే ప్రైమ్ సభ్యులకు అదనంగా 20 నుంచి 50 శాతం అధిక ప్రయోజనాలు అందించనున్నట్టు జియో పేర్కొంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Prime membership extended for another year for free: Here’s how to avail More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X