Home
News

జియోఫోన్ యూజర్లకు అదిరిపోయే కొత్త ఉచిత ఆఫర్స్!! మిస్ చేసుకోకండి

ఇండియా యొక్క అతి పెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. జియోఫోన్ మీద గల ఆఫర్లతో ఈ ఫోన్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత మహమ్మారి సమయాల్లో వినియోగదారులకు సహాయం చేయడానికి రిలయన్స్ జియో సంస్థ తన యొక్క జియోఫోన్ వినియోగదారుల కోసం రెండు కొత్త ఆఫర్లను రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించింది.

జియోఫోన్

వినియోగదారులు ఎల్లప్పుడూ కనెక్ట్ అయ్యేలా చూడటానికి కంపెనీ ప్రతి నెలా 300 నిమిషాల వాయిస్ కాలింగ్ ను జియోఫోన్ వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా వారు రీఛార్జ్ చేసే ఏ ప్లాన్ అయినా వినియోగదారులకు ‘బయ్-వన్-గెట్-వన్' ఆఫర్‌ను కంపెనీ ఇస్తుంది. ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ కొత్త ఆఫర్‌లు

రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ కొత్త ఆఫర్‌లు

రిలయన్స్ జియో టెలికాం సంస్థ తన యొక్క జియోఫోన్ వినియోగదారుల కోసం ఇప్పుడు రెండు కొత్త ఆఫర్లను విడుదల చేసింది. ఇందులో మొదటి ఆఫర్ విషయానికి వస్తే ఇది వినియోగదారులకు ఒక నెలలో 300 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను ఉచితంగా అందిస్తుంది. వినియోగదారులకు అందించే మొత్తం 300 నిమిషాల ఉచిత వాయిస్ కాల్‌లో రోజువారీ 10 నిమిషాల పరిమితం చేయబడి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు ఈ 10 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్‌ను నెలలో ప్రతి రోజు (10 నిమిషాలు x 30 రోజులు = 300 నిమిషాలు) ఉపయోగించవచ్చు. లాక్డౌన్ పరిమితుల కారణంగా తమ జియోఫోన్‌ను రీఛార్జ్ చేయలేని వ్యక్తులకు సహాయం చేయడానికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

జియో రెండవ ఆఫర్

జియోఫోన్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో ప్రారంభించిన రెండవ ఆఫర్ విషయానికి వస్తే ‘బయ్-వన్-గెట్-వన్' ఆఫర్. ఈ ఆఫర్ సంస్థ అందించే అన్ని జియోఫోన్ ప్లాన్‌లకు వర్తిస్తుంది. ఉదాహరణకు వినియోగదారులు ఎవరైనా సరే రూ.75 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే కనుక వారు అదనంగా మరొక రూ.75 ప్లాన్ యొక్క చందాను ఉచితంగా పొందుతారు. అది తరువాత ఉపయోగం కోసం క్యూలో ఉంటుంది. మహమ్మారి మరియు లాక్డౌన్ల కారణంగా ఇళ్ళకే పరిమితమైన వినియోగదారులకు ఈ ప్లాన్లు మరియు ఆఫర్లు ఖచ్చితంగా సహాయపడతాయి. అంతేకాకుండా వినియోగదారులు వారి పనికి అంతరాయం ఏర్పడిన సమయంలో డబ్బు ఆదా చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.

రిలయన్స్ ఫౌండేషన్

రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో రిలయన్స్ జియో సంస్థ తన యొక్క వినియోగదారులకు సహాయంగా అవిశ్రాంతంగా పనిచేస్తు ఈ ప్లాన్లన్నింటినీ అందిస్తోంది. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (vi), మరియు బిఎస్‌ఎన్‌ఎల్ తో సహా ఇతర ఆపరేటర్లు కూడా ప్రస్తుత మహమ్మారి సమయంలో ఇటువంటి ఆఫర్లను విడుదల చేయాలని సూచిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్‌లు ఎంతకాలం వర్తిస్తాయో అన్నదాని మీద కంపెనీ ఎటువంటి వివరణను పేర్కొనలేదు.

Best Mobiles in India

English summary
Reliance Jio Provides New Free Offers For Jiophone Users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X