Jio - Realme పార్టనర్ షిప్!!! అతి తక్కువ ధరలో 4G హ్యాండ్‌సెట్‌ల తయారీకి వ్యూహం...
ఇండియాలో ప్రస్తుతం 4G శకం కొనసాగుతున్నది. 4G స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర హ్యాండ్‌సెట్‌ల వినియోగం ఎక్కువగా ఉన్నది. 4G అనుసంధాన పరికరాలను రిలయన్స్ సంస్థ తక్కువ ధరలో అందిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ ధరను మరింత తగ్గించడానికి రిలయన్స్ జియో సంస్థ ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మితో కొత్తగా చేతులను కలిపింది. ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లుగా రియల్‌మితో కూడా పనిచేస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. రిలయన్స్ జియో సరసమైన ధరల వద్ద 2G హ్యాండ్‌సెట్‌లను ఉపయోగిస్తున్న వ్యక్తులను 4G మరియు 5G కి అప్‌గ్రేడ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

Jio - Realme పార్టనర్ షిప్
రిలయన్స్ సంస్థ ముందు నుంచి జియోఫోన్‌ల ద్వారా 4G కనెక్టివిటీ యొక్క ప్రయోజనాలను సరసమైన ధరల వద్ద అందిస్తున్నాయి. ఇతర 4G పరికరాలను కూడా మరింత సరసమైన ధరల వద్ద అందించడానికి రియల్‌మి మరియు ఇతర సంస్థలతో కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే జియో మొబైల్ ఫోన్ విభాగాన్ని మాత్రమే అభివృద్ధి చేయడం కాకుండా ఇతర 4G కనెక్ట్ పరికరాలను కూడా అభివృద్ధి చేయడానికి కూడా పనిచేస్తుందని "ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020లో" కంపెనీ సీనియర్ అధ్యక్షుడు దత్ చెప్పారు.

రియల్‌మి 5G
రియల్‌మి సీఈఓ మాధవ్ శేత్ మాట్లాడుతూ భవిష్యత్తులో 5G కనెక్టివిటీ స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితం కానటువంటి ఆవిష్కరణలకు చాలా వరకు వచ్చే అవకాశాలను ఉన్నాయి.5G ఫోన్‌లను గరిష్ట సంఖ్యలో తీసుకురావడంలో చిప్‌సెట్‌లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి అని ఆయన అన్నారు. అలాగే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 5G బాటలో పయనించడానికి మీడియాటెక్ సంస్థ యొక్క అవసరం చాలా ఉందని నేను భావిస్తున్నాను. మేము హార్డ్వేర్ ప్రొవైడర్లుగా ఉన్నాము. ఈ డివైస్ లు సాంకేతిక అంశాలతో రాజీ పడకుండా అందుబాటు ధరలోనే 5G పరికరాలు ముందు ముందు గరిష్ట సంఖ్యలో ప్రజలకు లభిస్తాయి అని మాధవ్ శేత్ చెప్పారు.

మీడియాటెక్ 5G చిప్‌సెట్
చిప్‌సెట్‌ల తయారీ సంస్థ మీడియాటెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకు జైన్ మాట్లాడుతూ మహమ్మారి సమయంలో డిజిటల్ 5G టెక్నాలజీని కంపెనీ ఛాలెంజింగ్ స్వీకరించింది. ఈ అభివృద్ధిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డ్రోన్స్ మరియు వెహికల్ ఆటోమేషన్ వంటి పోకడలను ముందు ముందు సరికొత్త టెక్నాలిజీలతో చూడవచ్చు. ఈ టెక్నాలజీలలో 5Gతో కలిసి ఒక మంచి జీవనశైలి కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తాయి. 2021 లో 5G వేగంగా మరియు తెలివిగా అభివృద్ధి చెందుతుంది అని జైన్ తెలిపారు.


Click it and Unblock the Notifications