ఆల్ టైం రికార్డు సెట్ చేసిన జియో

Written By:

టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇస్తూనే దిగ్గజాలను మట్టి కరిపించిన రిలయన్స్ జియో ఇప్పుడు అంతే వేగంతో ముందుకు దూసుకుపోతోంది. ఊహించని స్థాయిలో వినియోగదారులను సొంతం చేసుకున్న జియో ఇప్పుడు మరో కొత్త రికార్డును సృష్టించిందని ట్రాయ్ వెల్లడించింది.

ఇండియాలో లభ్యమవుతున్న టాప్ షియోమి స్మార్ట్‌ఫోన్లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లోనూ..

రిల‌య‌న్స్ జియో 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లోనూ అదే దూకుడు క‌న‌బ‌రుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో జియో 21.9 ఎంబీపీఎస్‌ సగటు వేగాన్ని నమోదు చేసిందని, ఇది ఆల్‌టైమ్ రికార్డ‌ని ట్రాయ్ చెప్పింది.

4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌ 19.123 ఎంబీపీఎస్..

ఈ ఏడాది మే నెలలో జియో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌ 19.123 ఎంబీపీఎస్ గా న‌మోదైంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అదే అత్య‌ధిక 4జీ డౌన్‌లోడ్ స్పీడుగా ఉంది.

తరువాత స్థానంలో..

కాగా, ఈ జాబితాలో వొడాఫోన్‌ 8.7 ఎంబీపీఎస్‌ వేగంతో జియో త‌రువాతి స్థానంలో ఉండ‌గా, 8.6 ఎంబీపీఎస్‌తో ఐడియా, 7.5 ఎంబీపీఎస్‌ వేగంతో ఎయిర్‌టెల్ వరుస‌గా ఉన్నాయి. కాగా ఎయిర్‌టెల్‌ స్పీడ్‌ మాత్రం తగ్గుముఖం పట్టిందని ట్రాయ్ తెలిపింది.

అప్‌లోడ్‌ వేగంలో ఐడియా..

ఇక 4జీ డౌన్‌లోడ్ వేగంలో జియో టాప్ ప్లేస్‌లో నిలిస్తే అప్‌లోడ్‌ వేగంలో ఐడియా ఆ స్థానాన్ని ఆక్ర‌మించింది.

 

ఐడియా 6.4 ఎంబీపీఎస్‌ సగటు వేగాన్ని..

ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ఐడియా 6.4 ఎంబీపీఎస్‌ సగటు వేగాన్ని నమోదు చేయ‌గా, ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా 5.9 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్‌, 4.1 ఎంబీపీఎస్‌తో జియో, 3.5 ఎంబీపీఎస్‌తో ఎయిర్‌టెల్ ఉన్నాయి.

మైస్పీడ్‌ యాప్‌ను ఉపయోగించి..

మైస్పీడ్‌ యాప్‌ను ఉపయోగించి ట్రాయ్‌ ఈ గణాంకాలను సేకరిస్తుంది. ఆయా నెట్‌వర్క్‌ల డేటా వేగాన్ని ప్రతినెలా వెలువరిస్తుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio records all-time high average 4G download speed of 21.9 Mbps: TRAI Read more news at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting