వేలమంది జియో ఉద్యోగులు ఇంటికి, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

దేశీయ టెలికాం రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తాజా రిపోర్టుల ఆధారంగా ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో తన ఉద్యోగులను ఇంటికి ప

|

దేశీయ టెలికాం రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తాజా రిపోర్టుల ఆధారంగా ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో తన ఉద్యోగులను ఇంటికి పంపనుందని తెలుస్తోంది. రిపోర్టు ప్రకారం సంస్థలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపించిందనే వార్తలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.

వేలమంది జియో ఉద్యోగులు ఇంటికి, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 10 శాతం శాశ్వత ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులు 5 వేల మందిని తొలగించిందని తెలుస్తోంది.

 5వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన

5వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన

నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు లాభాలను పెంచుకునేందుకుగాను 5వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రస్తుతం రిలయన్స్ జియోలో 50 వేలమంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పది శాతం అంటే 5 వేలమందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇందులో 500-600 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. ముఖ్యంగా జనవరి-మార్చి మధ్యకాలంలో సంస్థ వేలమంది కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించిందని రిపోర్టులు వెలువడుతున్నాయి.

నిర్వహణ మార్జిన్లలో

నిర్వహణ మార్జిన్లలో

జియో పింక్ స్లిప్స్ సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్ వర్క్స్ విభాగాల్లోని ఉద్యోగులకు రిలయన్స్ జియో పింక్ స్లిప్స్ ఇచ్చింది. గత రెండేళ్లలో నిర్వహణ మార్జిన్లలో పెద్దగా పురోగతి లేకపోవడంతో ఉద్యోగులను తొలగించినట్లుగా తెలుస్తోంది. అయితే నియామకాల్లో తమ సంస్థ కీలకంగా ఉంటుందని, కాస్ట్‌ కటింగ్‌ అనే ప్రశ్నే లేదని జియో స్పందించిందని ఈటీ నౌ రిపోర్ట్‌ చేసింది.

జియో యూజర్ల సంఖ్య 30.7 కోట్లు
 

జియో యూజర్ల సంఖ్య 30.7 కోట్లు

2016లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో ప్రస్తుత జియో యూజర్ల సంఖ్య 30.7 కోట్లు. యూజర్ బేస్ ప్రకారం 26 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. రెవెన్యూ మార్కెట్ షేర్ 31 శాతంగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ జియో 126.2 కోట్ల లాభాన్ని గడించింది. అంతకుముందు క్వార్టర్‌లో రూ.131.7 కోట్లు గడించింది.

మొత్తంగా 15 వేల నుంచి 20 వేల మంది ఉద్యోగులు

మొత్తంగా 15 వేల నుంచి 20 వేల మంది ఉద్యోగులు

ఇదిలా ఉంటే కన్జ్యూమర్ వ్యాపారాలను విస్తరిస్తున్నామని, జియో ఇండస్ట్రీలో ఎప్పటికీ నెట్ రిక్రూటర్‌‌‌‌గానే కొనసాగుతుందని జియో అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఉద్యోగులను తొలగించినప్పటికీ... కొత్తగా చేర్చుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని తెలిపారు. తాము కాంట్రాక్టర్స్‌‌తో కలిసి పనిచేస్తామని, వారిని ఫిక్స్‌‌డ్ టైమ్ కాంట్రాక్ట్‌‌ల కోసం పలు ప్రాజెక్ట్‌‌లలో నియమించు కుంటామని చెప్పారు. జియోలో మొత్తంగా 15 వేల నుంచి 20 వేల మంది ఉద్యోగులున్నారు.

ఐదు రకాల రీచార్జ్ ప్యాక్స్

ఐదు రకాల రీచార్జ్ ప్యాక్స్

2016లో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. అతి తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ ఇస్తూ ప్రత్యర్థి టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు కొరకరాని కొయ్యగా మారింది. రిలయన్స్ జియో ప్రస్తుతం ఐదు రకాల రీచార్జ్ ప్యాక్స్ ఇస్తోంది. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత లోకల్ కాల్స్, ఎస్టీడీ కాల్స్ ఇస్తోంది. రూ.149 నుంచి రూ.1,699 వరకు ప్యాకేజీలు ఉన్నాయి.

జియో 1.5 జిబి డేటా ప్లాన్స్

జియో 1.5 జిబి డేటా ప్లాన్స్

జియో రూ.149 ప్లాన్

రూ.149 ప్యాకేజీ కింద రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు. 28 రోజుల పీరియడ్. జియో మొబైల్ అప్లికేషన్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్.

జియో రూ.349 ప్లాన్

రూ.349 ప్లాన్ కింద కింద రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు. 84 రోజుల పీరియడ్. జియో మొబైల్ అప్లికేషన్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్. జియో రూ.449 ప్లాన్ రూ.449 ప్లాన్

కింద రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు. 91 రోజుల పీరియడ్. జియో మొబైల్ అప్లికేషన్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్.

జియో రూ.1,699 ప్లాన్

రూ.1,699 ప్లాన్ కింద రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు. 365 రోజుల పీరియడ్. జియో మొబైల్ అప్లికేషన్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్.

 

Best Mobiles in India

English summary
Reliance jio reportedly lays 5000 workforce cost cutting drive

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X