మళ్లీ అదిరే డిస్కౌంట్లతో దూసుకొచ్చిన జియో

|

తన ప్రీపెయిడ్ ఖాతాదారులకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ చెప్పింది. తన పాపులర్‌ ప్రీ పెయిడ్‌ ప్లాన్‌పై డిస్కౌంట్‌ను ప్రకటించింది. ముఖ్యంగా అత్యధికంగా అమ్ముడు పోతున్న ప్రీపెయిడ్ ప్లాన్‌ రూ .399 పై తక్షణ డిస్కౌంట్ ను ఆఫర్‌ చేస్తోంది. రూ.399ల రీచార్జ్‌ ప్లాన్‌ 100 రూపాయల డిస్కౌంట్‌తో ఇపుడు రూ.299లకే లభ్యం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 'ఫోన్‌పే'తో ఒప్పందం కుదుర్చుకున్న జియో 'హాలీడే హంగామా' పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.మై జియోలోని ఫోన్‌పే ద్వారా రూ.399 ప్యాక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.50 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

 

షియోమి తొలి నోచ్‌ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్, అబ్బురపరిచే ఫీచర్లతో Mi 8షియోమి తొలి నోచ్‌ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్, అబ్బురపరిచే ఫీచర్లతో Mi 8

84 రోజుల కాలపరిమితితో ..

84 రోజుల కాలపరిమితితో ..

రూ.399 ప్యాక్‌లో వినియోగదారులకు 84 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, 1.5 జీబీ డేటా లభిస్తుంది.

ఇప్పటికే రూ.50 విలువైన డిస్కౌంట్ ఓచర్లు

ఇప్పటికే రూ.50 విలువైన డిస్కౌంట్ ఓచర్లు

రూ.399 రీచార్జ్ ప్యాక్‌పై ఇప్పటికే రూ.50 విలువైన డిస్కౌంట్ ఓచర్లు అందిస్తోంది. దీనికి ప్రస్తుతం ప్రకటించిన క్యాష్ బ్యాక్ అదనం. అంటే రూ.399 విలువైన ప్యాక్ వంద రూపాయల రాయితీతో రూ.299కే లభిస్తుందన్నమాట.

జూన్‌ 1 నుంచి 15 తేదీ వరకు మాత్రమే

జూన్‌ 1 నుంచి 15 తేదీ వరకు మాత్రమే

జూన్‌ 1 నుంచి 15 తేదీ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. కాగా రూ.399 ప్లాన్‌లో 126 జీబీ డేటాను జియో అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84రోజులు.

 

 

186.6 మిలియన్లకు
 

186.6 మిలియన్లకు

కాగా జియో. 2018 క్యూ1లో జియో తన యూజర్‌ బేస్‌ను 186.6 మిలియన్లకు పెంచుకున్నట్టు పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 26.5 మిలియన్ల యూజర్లను జియో తన సొంతం చేసుకున్నట్టు తెలిపింది.

కస్టమర్‌ సగటున 9.7జీబీ డేటాను

కస్టమర్‌ సగటున 9.7జీబీ డేటాను

నెలలో ఒక్కో కస్టమర్‌ సగటున 9.7జీబీ డేటాను వాడుతున్నట్టు జియో తెలిపింది. అంటే మొత్తంగా 2018 క్యూ1లో 506 కోట్ల జీబీ డేటాను సబ్‌స్క్రైబర్లు వాడినట్టు తెలిపింది.

వాయిస్‌ కాల్స్‌ పరంగా

వాయిస్‌ కాల్స్‌ పరంగా

అదేవిధంగా వాయిస్‌ కాల్స్‌ పరంగా కూడా ఈ కాలంలో 37,218 కోట్ల నిమిషాల కాలింగ్‌ ట్రాఫిక్‌ నమోదైనట్టు తెలిపింది. అంటే ప్రతి జియో 4జీ సబ్‌స్క్రైబర్‌ నెలకు 716 నిమిషాల వాయిస్‌ కాలింగ్‌ను, సగటున 13.8 గంటల వీడియోలను వీక్షించినట్టు వెల్లడించింది.

జియో యూజర్‌బేస్‌ భారీగా పెరగడం

జియో యూజర్‌బేస్‌ భారీగా పెరగడం

ముఖ్యంగా జియో యూజర్‌బేస్‌ భారీగా పెరగడం కంపెనీకి ఎంతో సహకరిస్తున్నట్టు తెలిపింది. ఆర్పూ కూడా జనవరి-మార్చి కాలంలో రూ.137.1గా నమోదైందని, అయితే ఇది గత మూడు నెలల కాలంతో పోలిస్తే తక్కువేనని రిలయన్స్‌ వెల్లడించింది.

Best Mobiles in India

English summary
Reliance Jio rolls out discounts for prepaid customers More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X