Home
News

జియోఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

టెలికాం మార్కెట్లో ప్రకంపనలు రేపుతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్‌ జియోను చూసి, ఇతర టెల్కోలు కూడా తమ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి.

టెలికాం మార్కెట్లో ప్రకంపనలు రేపుతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్‌ జియోను చూసి, ఇతర టెల్కోలు కూడా తమ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి. తాజాగా రిలయన్స్‌ జియో మరోసారి తన జియోఫోన్ కస్టమర్లకు సరికొత్త ఆఫర్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన జియోఫోన్ కస్టమర్ల కోసం రూ.594 మరియు రూ.297 అనే రెండు కొత్త ప్లాన్లను లాంచ్‌ చేసింది.

రూ.594 ప్లాన్

రూ.594 ప్లాన్

ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకున్న జియోఫోన్ యూజర్ కి 168 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, నెలకు 300 ఎస్‌ఎంఎస్‌లు,రోజుకి 0.5 జీబీ డేటాను పొందవచ్చు. దీంతో పాటు జియో సూట్ యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు.

రూ.297 ప్లాన్

రూ.297 ప్లాన్

ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకున్న జియోఫోన్ యూజర్ కి 3 నెలల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, నెలకు 300 ఎస్‌ఎంఎస్‌లు,రోజుకి 0.5 జీబీ డేటాను పొందవచ్చు. దీంతో పాటు జియో సూట్ యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు.

జియో గిగా ఫైబర్ ఈ ఏడాది....

జియో గిగా ఫైబర్ ఈ ఏడాది....

జియో గిగా ఫైబర్ ఈ ఏడాది అందరి ఇళ్లల్లో కనువిందు చేయనుంది. అన్నీ కుదిరితే మార్చి నాటి కల్లా జియో తన గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే కొన్ని ఏరియాల్లో జియో గిగా ఫైబర్ మీద టెస్టింగ్ లు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఢిల్లీ, ముంబై లాంటి ఏరియాల్లో ఇప్పటికే జియో గిగాఫైబర్ ను వేలమంది వినియోగదారులు వాడుతున్నారు. దీనిపై ఇప్పటికే అనేక రివ్యూలు కూడా వచ్చాయి. దేశ వ్యాప్తంగా మార్చి నుండి గిగాఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అనధికార వర్గాల సమాచారం.

Fibre-to-the-Home (FTTH)

Fibre-to-the-Home (FTTH)

గతేడాది జరిగిన 41వ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ Fibre-to-the-Home (FTTH) broadband సేవలను ఇంటింటికి అందిస్తామని తెలిపిన సంగతి విదితమే. ఫిక్స్ డ్ లైన్ల ద్వారా ఈ సేవలు అందుతాయని తెలిపారు.

50 మిలియన్ల మంది టార్గెట్

50 మిలియన్ల మంది టార్గెట్

కాగా 50 మిలియన్ల మందికి బ్రాండ్ బ్యాండ్ సర్వీసులను అందించడమే లక్ష్యంగా జియో పనిచేస్తుంది. జియో గగా ఫైబర్ ద్వారా రూటర్ గిగా టీవీ సెటప్ బాక్స్ లాంటవి వినియోగదారులకు అందుతాయి. ఈ జియో గిగా ఫైబర్ రూటర్ ద్వారా ఒకసారి మల్టిపుల్ డివైస్ ల మీద 1జిబిపిఎస్ స్పీడుతో ఇంటర్నెట్ సర్వీసులను అందుకోవచ్చు.

1100 నగరాలకు విస్తరణ

1100 నగరాలకు విస్తరణ

కాగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద నెట్ వర్క్ గా జియో గిగాఫైబర్ అవతరించనుంది. దేశవ్యాప్తంగా 1100 ప్రధాన నగరాల్లో ఈ సేవలను అందించడమే లక్ష్యంగా జియో ఛైర్మెన్ ముఖేష్ అంబానీ పావులు కదుపుతున్నారు.

వీటికి సేవలు అందుతాయి

వీటికి సేవలు అందుతాయి

జియో గిగా ఫైబర్ ద్వారా ఫోన్లు, టెలివిజన్, కంప్యూటర్, ఇతర పరికరాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలో భాగంగా 1100 నగరాల్లో గిగా ఫైబర్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రివ్యూ ఆఫర్

ప్రివ్యూ ఆఫర్

జియో గిగా ఫైబర్ ఆఫర్ ఫస్ట్ కింద మొదటి మూడు నెలలు 100 ఎంబిపిఎస్ స్పీడుతో 1100 జిబి డేటాను అందించనుంది. జియో గిగా ఫైబర్ ఉచిత ఇన్ స్టాలేషన్ కింద అందిస్తుందని సమాచారం. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.4500 కింద చెల్లించాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Reliance Jio rolls out new Rs 594 and Rs 297 plans: Validity, data and all other details.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X