జూన్‌లో జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు, 100Mbps వేగంతో..

ప్రస్తుతం బేటా ట్రెయిల్స్‌లో ఉన్న జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలను, రిలయన్స్ ఇండస్ట్రీస్.. జూన్ నాటికి పబ్లిక్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఫైబర్ టు ద హోమ్ (FTTH) టెక్నాలజీ పై రూపొందించబడిన జియో బ్రాడ్‌బ్యాండ్ మినిమమ్ 100Mbps స్పీడ్‌ను ఆఫర్ చేయగలదట.

Read More : నెం.1 సామ్‌సంగ్, నెం.2 షియోమీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులు కూడా..

జియో బ్రాడ్‌బ్యాండ్‌కు అనుసంధానంగా మరిన్ని హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులను కూడా జియో అందించబోతున్నట్లు సమచారం. జియో ఫైబర్ టెక్నాలజీ పై స్పందించగలిగే ఈ ఆటోమేషన్ ప్రొడక్ట్స్ ద్వారా స్మార్ట్ హోమ్ అనుభూతులను ఆస్వాదించే వీలుంటుంది.

స్మార్ట్ కాలింగ్ ఫీచర్

ఉదాహరణకు జియో ఆఫర్ చేయబోయే హోమ్ ఆటోమేషన్ ఫీచర్లలో స్మార్ట్ కాలింగ్ ఫీచర్ ఒకటుందని అనుకుందాం.. ఈ ఫీచర్ మీ ఇంట్లోని ఫోన్ లన్నింటికి వర్చువుల్‌గా కనెక్ట్ చేసేస్తుంది. అంటే మీ ల్యాండ్‌లైన్‌కు కాల్ వచ్చినా, ఆ కాల్‌ను మొబైల్ ఫోన్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు.

హోమ్ సర్వైలెన్స్ సర్వీసు కూడా.

హోమ్ ఆటోమేషన్‌తో పాటుగా హోమ్ సర్వైలెన్స్ సర్వీసును కూడా జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలతో ఆఫర్ చేయబోతున్నట్లు సమాచారం. జియో హోమ్ సర్వైలెన్స్ సర్వీసు అనేది హోమ్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

1000 జిబి డేటాతో జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

మొబైల్స్ లో అయితే ఏవిధంగా జియోను వినియోగదారులు వాడారో అదే వేగంతో జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 1000 జిబి డేటాతో జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రానున్నట్లు తెలుస్తోంది.

100 జిబి మొదలుకుని..

నెలకు 100 జిబి మొదలుకుని 1000 జీబీ డేటా వరకు అందించే ప్లాన్‌ను జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ వర్గాల సమాచారం

10 జీబీపీఎస్ స్పీడ్‌తో..

10 జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 100 జీబీ వరకు ఉచిత డేటా మొదలుకొని 10 జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు గరిష్టంగా 1000 జీబీ వరకు డేటా ఇచ్చేలా జియో బ్రాడ్ బ్యాండ్ సేవలను తీసుకురానున్నట్టు సమాచారం.

ముంబై, పూణెలాంటి నగరాలలో..

ఇప్పటికే జియో తన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ముంబై, పూణెలాంటి నగరాలలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నది. అక్కడ కొందరు యూజర్లకు ఇప్పటికే ఉచితంగా ఈ సేవలను జియో అందిస్తోంది.

నెట్ స్పీడ్ వివరాలను సోషల్ మీడియాలో...

ఈ క్రమంలో వారు తమకు జియో బ్రాడ్‌బ్యాండ్ ద్వారా వస్తున్న నెట్ స్పీడ్ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. ఈ వివరాలతో జియో స్పీడ్‌పై భారీగా అంచనాలు పెరిగేలా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio’s Broadband Services With 100Mbps Speed to Commence in June Claims a New Report. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot