జియో కొత్త ప్లాన్స్, ఆసక్తికర విషయాలు

మార్చి 31 2017తో జియో ఉచిత ఆఫర్లకు ముగింపు పలకబోతున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను తెరపైకి తెచ్చారు. మార్చి 1 నుంచి ఈ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జియో లాంచ్ చేసిన కొత్త ఆఫర్లకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Read More : రూ.345కే 16జీబి 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చవకైన నెట్‌వర్క్‌గానే..

మార్చి 31, 2017తో జియో ఉచిత ఆఫర్లు ముగిసినప్పటికి జియో చవకైన నెట్‌వర్క్‌గానే అందుబాటులో ఉంటుందని అంబానీ స్పష్టం చేసారు.

మార్చి 31లోపు జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌..

మార్చి 31లోపు జియో యూజర్లు రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకోవటం ద్వారా ఏప్రిల్ 1, 2017 నుంచి మార్చి 31, 2018 వరకు 'Happy New Year' తాలుకూ అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

28 రోజుల పాటు 28జీబి 4జీ డేటా

ఈ మెంబర్‌షిప్ పిరియడ్‌లో భాగంగా జియో డేటా సేవలను పొందేందుకు నెలకు రూ.303 చెల్లించటం ద్వారా 28జీబి డేటా జియో ప్రైమ్ యూజర్‌కు లభిస్తుంది. ఈ 28జీబి డేటాను రోజుకు 28 రోజుల పాటు రోజుకు 1జీబి చొప్పున వాడుకోవచ్చు. జియో ప్రైమ్ సభ్యత్వం అనేది మార్చి 31, 2018 వరకు వర్తిస్తుంది. రూ.303 టారిఫ్ ప్లాన్ మాత్రమే కాకుండా మరో 8 డేటా ప్లాన్‌లను ప్రైమ్ యూజర్ల కోసం జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ బడ్జెట్ అలానే అవసరాన్ని బట్టి వీటిలో ఏ ప్లాన్‌నైనా మీరు ఎంపిక చేసుకోవచ్చు. 

'Happy New Year' తాలుకా ఆఫర్స్..

జియో ప్రైమ్ యూజర్లు నెలకు రూ.303 చెల్లిస్తూ ఉండటం ద్వారా మార్చి 31, 2018 వరకు 'Happy New Year' తాలుకా అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

జియో యాప్ సూట్‌ కూడా ఉచితం..

ప్రైమ్ యూజర్లు తమకు ప్రతి నెలా లభించే 28జీబి డేటాను రోజుకు ఒక డేటా చొప్పున నెలమొత్తం వాడుకోవచ్చు, ఇదే సమయంలో వాయిస్ కాల్స్‌తో జియో యాప్ సూట్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

బూస్టర్ ప్యాక్స్..

జియో ప్రైమ్ యూజర్లు అదనపు డేటాను పొందాలనకున్నట్లయితే అదనంగా రూ.51 (1జీబి), రూ.91 (2జీబి), రూ.201 (5జీబి), రూ.301 (10జీబి) బూస్టర్ ప్యాక్‌లను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

అర్థరాత్రి నుంచి ఉచిత ఇంటర్నెట్..

జియో ప్రైమ్ యూజర్లు ప్రతి రోజు అర్థరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉచిత 4జీ ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

విద్యార్థులకు 25% అదనపు 4జీ డేటా

విద్యార్థులకు జియో 25% అదనపు 4జీ డేటాతో పాటు ఉచితం వై-ఫై డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ రాయితీని పొందే క్రమంలో విద్యార్ధలు తమ ఐడీ కార్డులను చూపించాల్సి ఉంటుంది.

జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ పొందాలంటే.?

Jio Prime మెంబర్‌షిప్‌ను పొందాలనుకునే జియో యూజర్లు మార్చి 31 లోపు జియో అఫీషియల్ వెబ్‌సైట్ లేదా సమీపంలోని జియో స్టోర్‌లలోకి వెళ్లి రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.

128 kbpsకు పడిపోతుంది

రూ.303 ప్లాన్‌లో భాగంగా రోజుకు 1 జీబి డేటా లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ వేగం కాస్తా 128 kbpsకు పడిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio's new tariff plan goes live: 10 things you need to know. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot