జియో vs ఎయిర్‌టెల్..?

ఆధునిక కమ్యూనికేషన్ అస్త్రాలను మార్కెట్లో సంధించినప్పటికి ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియో వెనుకబడి ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

|

ఉచిత సిమ్.. ఉచిత ఇంటర్నెట్ .. ఉచిత వాయిస్ కాల్స్.. ఉచిత ఎస్ఎంఎస్ కాంభినేషన్‌లో జియో పేరుతో రిలయన్స్ కొత్త టెలికమ్ వెంచర్‌ను లాంచ్ చేసిన నాటి నుంచి మార్కెట్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

జియో vs ఎయిర్‌టెల్..?

ఉచితం పేరుతో జియో ఆఫర్ చేస్తున్న ఉచిత వెల్‌కమ్ ఆఫర్‌కు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. డిసెంబర్ 31 2016తో ఈ ఆఫర్ ముగియనుంది. మార్కెట్లో లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే 3 కోట్ల పై చిలుకు యూజర్లను కూడగట్టుకున్న జియో దేశవ్యాప్తంగా బలమైన డిజటిల్ ఇకో సిస్టంను నెలకొల్పేందుకు పునాదాలు వేసుకుంటోంది.

Read More: కొత్తగా ఫోన్ తీసుకున్నారా..? ఇవి మరిచిపోకండి

జియోను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో

జియోను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో

జియోను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి ప్రముఖ టెలికం ఆపరేటర్లు సరికొత్త ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేస్తూనే ఉన్నాయి.

జియో వెనుకబడి ఉన్నట్లు..

జియో వెనుకబడి ఉన్నట్లు..

ఆధునిక కమ్యూనికేషన్ అస్త్రాలను మార్కెట్లో సంధించినప్పటికి ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియో వెనుకబడి ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్..?

జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్..?

జియో ఆఫర్ చేస్తున్న ఎల్టీఈ నెట్‌వర్క్‌తో పోలిస్తే ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న నెట్‌వర్క్ మెరుగ్గా ఉందనటానికి 5 కారణాలు..

కాల్ డ్రాప్స్

కాల్ డ్రాప్స్

జియో యూజర్లను కాల్ డ్రాప్స్ సమస్య ప్రధానంగా వేధిస్తోంది. జియో యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తున్న సమయంలో 90శాతం వరకు కాల్ డ్రాప్స్ సమస్యలను ఫేస్ చేస్తున్నట్లు విశ్లేషనులు చెబుతున్నాయి. ఇతర టెల్కోలు ఇంటర్‌కనెక్షన్ పాయింట్‌లను ఇవ్వకపోవటం కారణంగానే ఇలా జరుగుతోందని జియో ఆరోపిస్తోంది. మరోవైపు ఎయిర్‌టెల్ తన రెండు దశాబ్ధాల సుధీర్ఘమైన అనుభవంతో మార్కెట్లో దూసుకుపోతోంది.

LTE-Only Network

LTE-Only Network

జియో ఆఫర్ చేస్తున్న సర్వీసులు కేవలం 4జీ ఫోన్‌లకు మత్రమే పరిమితమయ్యాయి. జియో, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ పై స్పందించేది కావటంతో 3జీ ఫోన్‌లలో వర్క్ అవటం లేదు. జియో సేవలను పొందాలంటే ఖచ్చింతంగా 4జీ ఎల్టీఈ ఫోన్ ఉండాల్సిందే. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న నెట్‌వర్క్‌ను 2జీ, 3జీ, 4జీ ఫోన్‌లలో వాడుకునే అవకాశం ఉంటుంది.

డేటా కనెక్టువిటీ సమస్యలు

డేటా కనెక్టువిటీ సమస్యలు

లాంచ్ సమయంలో జియో ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉన్నప్పటికి క్రమక్రమంగా జియో డేటా స్పీడ్స్ మందగిస్తున్నాయి. ప్రస్తుతం జియో ఆఫర్ చేస్తున్న స్పీడ్స్ 0.4 MBPS to 5 MBPS మధ్య నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ వేగవంతమైన డేటా స్పీడ్లను నమోదు చేయటం విశేషం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫేలవమైన కస్టమర్ సపోర్ట్!

ఫేలవమైన కస్టమర్ సపోర్ట్!

జియో కస్టమర్ కేర్ సపోర్ట్‌కు కనెక్ట్ అవ్వాలంటే కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు వెయిట్ చేయవల్సిన పరిస్థితి నెలకుంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్ సపోర్ట్‌తో కనెక్ట్ అవ్వాలంటే 3 నుంచి 4 నిమిషాల సమయం సరిపోతుంది.

ఉచిత సిమ్ అన్నారు..?

ఉచిత సిమ్ అన్నారు..?

జియో సిమ్‌లను రిలయన్స్ ఉచితంగా ఆఫర్ చేస్తున్నప్పటికి భారీ డిమాండ్ కారణంగా, వీటిని బ్లాక్ మార్కెట్లో రూ.50 నుంచి రూ.200 మధ్య విక్రయిస్తున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం, ఎక్కువ సంఖ్యలో జియో సిమ్‌ కార్డ్‌లు స్థానిక మొబైల్ రిటైలర్‌లకు రిలయన్స్ స్టోర్స్ ద్వారానే వెళుతున్నాయని తెలుస్తోంది. దీంతో సదురు రిటైలర్లు ఇష్టానుసారంగా జియో సిమ్ రేట్లను పెంచి విక్రయిస్తున్నారని సమాచారం.ఎటు చూసినా వీడియో కాల్స్, ఎవరిది పై చేయి?

Best Mobiles in India

English summary
Reliance Jio’s Welcome Offer is Attractive, But Bharti Airtel is Still the Best in Country!. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X