స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ని షేక్ చేయనున్న జియో !
దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలకు సవాల్ విసిరిన రిలయన్స్ జియో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని సవాల్ చేసేందుకు రెడీ అయింది.
దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలకు సవాల్ విసిరిన రిలయన్స్ జియో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని సవాల్ చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఫీచర్ ఫోన్ మార్కెట్లో దుమ్మురేపిన అనిల్ అంబాని సంస్థ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇందులో టెలికాం సంస్థ రిలయన్స్ జియో త్వరలోనే భారీ స్క్రీన్ కలిగిన ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే అమెరికాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఫ్లెక్స్‌తో జియో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల్లోకెళితే..

ఫ్లెక్స్ కంపెనీతోపాటు...
ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌ను సాధారణ ప్రజలకు కూడా చేరువ చేసిన జియో ఇక వారందరినీ స్మార్ట్‌ఫోన్లు వాడే దిశగా పురికొల్పనుంది. అందులో భాగంగానే ఫ్లెక్స్ కంపెనీతోపాటు పలు భారతీయ కంపెనీలతో కలిసి భారీ తెర కలిగిన స్మార్ట్ ఫోన్లను జియో తయారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

స్మార్ట్‌ఫోన్లలో రిచ్ కంటెంట్‌ను
ఫీచర్ ఫోన్ల కన్నా స్మార్ట్‌ఫోన్లలో రిచ్ కంటెంట్‌ను పొందవచ్చనే ప్రచార అస్త్రంతో జియో ముందుకు దూసుకెళ్తుందని తెలిసింది. ఇప్పటికే ఆపిల్, శాంసంగ్, షియోమీ, ఒప్పో తదితర కంపెనీలతో కలిసి ఒప్పందం చేసుకున్న జియో తన కస్టమర్లకు డేటా, ఇతర బెనిఫిట్స్‌ను అందిస్తున్నది.

గతంలో స్మార్ట్‌ఫోన్లను విక్రయం
ఇక లైఫ్ పేరిట ఇప్పటికే జియో గతంలో స్మార్ట్‌ఫోన్లను విక్రయించగా, వాటికి అంత ఆదరణ లభించలేదు. దీంతో 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. అవి సక్సెస్ సాధించడంతో తిరిగి స్మార్ట్‌ఫోన్లను తయారు చేసి విక్రయించాలని జియో భావిస్తున్నది.

4జీ సర్వీస్ డౌన్‌లోడ్ స్పీడ్
ఇదిలా ఉంటే టెలికాం సంచలనం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దూసుకుపోతోంది. 4జీ సర్వీస్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నవంబర్ గణాంకాలను విడుదల చేసింది.

జియో టాప్
అక్టోబర్‌తో పోలిస్తే4జీ వేగంకొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకునుకు ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో టాప్ ఉంది. అక్టోబర్‌లో ఇది 22.3 గా ఉంది.యూజర్లకు 4జీ సర్వీసు అందించడంలో మిగతా నెట్‌వర్క్‌ల కంటే జియో ముందుంది. ట్రాయ్ అందించిన లెక్కల ప్రకారం నవంబరులో డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియోదే పైచేయి. అప్‌లోడ్ స్పీడ్‌లో ఐడియా సెల్యులార్ టాప్‌లో నిలిచింది.


Click it and Unblock the Notifications








