జియో యూజర్లకి భారీ షాక్ !

Written By:

జియో ఉచితత డేటా, వాయిస్ కాలింగ్ ఆఫర్లను పుల్ గా ఎంజాయ్ చేస్తున్నారా..అయితే మీ డేటా లీక్ అయిందేమో ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఉచితడేటా, వాయిస్‌ కాలింగ్‌ ఆఫర్లతో ఎంజాయ్‌ చేస్తున్న రిలయన్స్‌ జియో కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. ఏంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

2 కోట్ల జియో రూ. 500 ఫోన్లు, ఆగస్టు వరకు ఆగాల్సిందే ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కస్టమర్ల డేటా

జియో కస్టమర్ల డేటా ఆన్‌లైన్‌లో లీక్‌ అయిందన్న వార్త ఇపుడు ప్రకంపనలు రేపుతోంది. జియో వినియోగదారుల సమాచారం ప్రస్తుతం ఒ​క వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందన్నవార్త హల్‌ చల్‌ చేస్తోంది.

కస్టమర్ల వ్యక్తిగత సమాచారం

లక్షల కొద్దీ రిలయన్స్ జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్‌లో మాజిక్‌ ఏపీకే.కాం అనే వెబ్‌సైట్‌లో లీక​ అయిందనే కథనాలు ఆదివారం వెలువడ్డాయి.

వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ను

సంబంధిత వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ను కొంతమంది ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. జియో కస్టమర్ల ఫోన్‌ నెంబర్లు, ఈమెయిల్‌తదితర సమాచారం ఈ సైట్‌ లో దర్శనిమస్తున్నాయని ట్వీట్‌ చేయడంతో దుమారం రేగింది.

ఏమేరకు ఉంది అనేది మాత్రం

డేటాబేస్ ఉల్లంఘన ఏమేరకు ఉంది అనేది మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.

వినియోగదారుల డేటా సురక్షితం

అయితే ఈ వార్తను జియోతీవ్రంగా ఖండించింది. వదంతులను నమ్మవద్దని వివరించింది. తమ వినియోగదారుల డేటా సురక్షితంగా ఉందని గట్టిగా వాదిస్తోంది. ఎలాంటి డేటా లీక్‌ కాలేదని జియో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

మరింత విచారణ

తమ కస్టమర్ల డేటా భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అనంతరం డేటాలీక్‌ అనేది అవాస్తవమని, నిరాధారనమైనదని జియో తేల్చింది. దీనిపై మరింత విచారణ కొనసాగుతోందని చెప్పారు.

120 మిలియన్ల మంది ఖాతాదారులు

కాగా రిలయన్స్ జియోలో సుమారు 120 మిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నట్టు అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Says No Customer Database Breach After Alleged Data Dump Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot