లీకైన జియో సెట్ టాప్ బాక్స్ ఫోటోలు

రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ జియో డీటీహెచ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.

Read More : జియో ప్రైమ్ ఆఫర్ పొడిగింపు, ఒక నెల కొంటే 4 నెలలు ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అఫీషియల్ ఫోటోలు..

తాజాగా, జియో బ్రాండెడ్ సెట్ టాప్ బాక్సులకు సంబంధించి అఫీషియల్ ఫోటోలు డీటీహెచ్ ఫోరమ్ ద్వారా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

బ్లూ కలర్ ప్యాకేజింగ్‌లో

బ్లూ కలర్ ప్యాకేజింగ్‌లో దర్శనమిస్తోన్న ఈ జియో సెట్ టాప్ బాక్స్ సరికొత్త ఉహాగానాలకు తావిస్తోంది. ఈ ఎస్‌టీబీలో ఉన్న ఫీచర్లను చూస్తుంటే డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) సేవలతో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సేవలను కూడా జియో ఆఫర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అనేక కనెక్టింగ్ పోర్టులతో..

లీకైన ఫోటోలను బటి చూస్తుంటే జియో సెట్ టాప్ బాక్స్ అనేక కనెక్టింగ్ పోర్టులను కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. వాటిలో స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ పోర్ట్, ఆడియో, వీడియో అవుట్ పుట్ పోర్ట్స్ తో పాటు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేందుకు అవసరమైన Ethernet పోర్ట్ కూడా ఉంది. జియో సెట్ టాప్ బాక్స్ ముందు భాగంలో కూడా యూఎస్బీ పోర్ట్ ను అందుబాటులో ఉంచటం విశేషం.

రోజుకు 10జీబి డేటా, BSNL సంచలనం

వెల్‌కమ్ ఆఫర్‌ సదుపాయం కూడా..?

జియో తన వెల్‌కమ్ ఆఫర్‌ను కొత్తగా లాంచ్ చేయబోయే డీటీహెచ్ సర్వీసులకు విస్తరించే అవకాశముందని అనధికారికంగా తెలియవచ్చింది. ఇదే గనుక నిజమైన మొదటి మూడు నెలల పాటు జియో డీటీహెచ్ ప్రసారాలను ఉచితంగా వీక్షించే అవకాశం ఉంటుంది.

తక్కువ ధరకే ఎక్కు చానళ్లు..

దేశంలో ఏ డీటీహెచ్ సర్వీస్ ఆపరేటర్ ప్రకటించనంత తక్కువగా జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించనుందని వార్తలు వస్తున్నాయి.

రూ.185కే కేబుల్ టీవీ ప్రసారాలు..

ఇతర కంపెనీలు 275 నుంచి 300 రూపాయలకు అందించే నెలవారీ డీటీహెచ్ ప్యాక్‌ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో రూ. 185కే అందించేందుకు సిద్దమైనట్లు సమాచారం. సర్వీస్ ఆరంభంలో భాగంగా 300 ఛానళ్లను జియో అందుబాటులో ఉంచుతుందట.

వాళ్లకు పెద్ద దెబ్బే..?

జియో డీటీహెచ్ సర్వీసులు లాంచ్ అయితే ఎయిర్‌టెల్, టాటా స్కై, డిష్ టీవీ యాజమాన్యాలను కోలుకోలేని దెబ్బ తీస్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. లీకైన ఫోటోలను బట్టి చూస్తుంటే రిలయన్స్ జియో డీటీహెచ్ సేవలు అతి త్వరలోనే మార్కెట్లో రాబోతున్నట్లు తెలుతస్తోంది.

ప్రపంచంలోనే అతి‌చిన్న స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance JIO Set Top Box With Official Packaging Leaked Online. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot