రిలయన్స్ జియో లాంచ్.. ముఖ్యాంశాలు

భారత టెలికాం రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ తమ కొత్త నెట్ వర్క్ అయిన Reliance Jioను గురువారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసారు.

రిలయన్స్ జియో లాంచ్.. ముఖ్యాంశాలు

Read More : మీ పాత నెంబర్‌తోనే Reliance Jioలోకి మారటం ఎలా..?

కనీవినీ ఎరగని తక్కువ ధరలతో ప్రపంచపు అతిచవకమైన 4జీ డేటా ఆఫర్లను రిలయన్స్ జియో ద్వారా అందుబాటులోకి తీసకువచ్చిన ముకేశ్ భారతీయుల పై వరాల జల్లులు కురిపించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

జియో నెట్‌వర్క్‌లో భాగంగా వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవని, 4జీ డాటా పై ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లు వసూలు చేస్తున్న మొత్తంలో కేవలం 10వ వంతు మాత్రమే రిలయన్స్ జియో తన 4జీ డేటా పై వసూలు చేస్తుందని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ తెలిపారు.

#2

ఎంబీకి 5 పైసుల చప్పున, 1జీబికి రూ.50 మాత్రమే ఛార్జ్ ఉంటుందని ఆయన తెలిపారు. నెలకు 75జీబి కన్నా ఎక్కువ వాడే వారిక రూ.25కే జీబి డాటా లభిస్తుందని ఆయన తెలిపారు.  

#3

'Jio welcome offer'లో భాగంగా ప్రతిఒక్కరూ జియో సర్వీసులను మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. అంటే డిసెంబర్ 31 వరకు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. జనవరి 1 నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. 1జీబి డేటా ఖరీదు రూ.50 మాత్రమే. 75జీబి కన్నా ఎక్కువ వాడే వారిక రూ.25కే జీబి డాటా లభిస్తుంది. పండుగల.. ప్రత్యేక రోజుల్లో స్పెషల్ ఛార్జీలు ఉండవు.

#4

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే వారికి వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. లోకల్, ఎస్‌‌టీడీ తేడా ఉండదు. దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవ్చు. రోమింగ్ ఛార్జీలు ఉండవు.

#5

డిసెంబర్ 31 2017 వరకు రిలయన్స్ జియో యాప్ సూట్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఈ యాప్ సూట్ నెల వారీ చందా రూ.1250గా ఉంది. ఈ సూట్ లో ఉండే యాప్స్ ద్వారా సినిమాలు, పాటలతో ఇతర ప్రత్యేక సేవలను ఆస్వాదించవచ్చు.

#6

నిన్నమొన్నటి వరకూ కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే లభించిన రిలయన్స్ జియో సేవలు సెప్టెంబర్ 5 నుంచి అందరికీ అందుబాటులోకి రానున్నాయి. జియో సిమ్‌ను పొందాలనుకుంటున్న 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు సెప్టెంబర్ 5 నుంచి సంబంధింత ధృవీకరణ పత్రాలతో సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కెళ్లి సంప్రదిస్తే చాలు.మీ ఆధార కార్డ్, వేలి ముద్రతో సిమ్‌కార్డ్‌ను పొందవచ్చు.సెప్టెంబర్ 5 నుంచి మాత్రమే ఈ కొత్తగా ప్రవేశపెట్టిన సిమ్‌కార్డ్స్ అందుబాటులోకి వస్తాయి. రిలయన్స్ స్టోర్స్‌లో మాత్రమే సిమ్‌కార్డ్స్‌ అందుబాటులో ఉంటాయని రిలయన్స్ ఇన్ఫోకామ్ వెల్లడించింది.

#7

జియో టారిఫ్స్ వివరాలు

రూ.19కే 100 ఎంబీ 4జీ డేటా ఇస్తారు. ఒక రోజు వ్యాలిడిటీతో వచ్చే ఈ పథకంలో రోజు మొత్తం వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. రాత్రి పూట డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు.
రూ.129కి 750 ఎంబీ 4జీ డేటాను ఇస్తారు. 7 రోజులు వ్యాలిడిటీతో వచ్చే ఈ పథకంలో వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. రాత్రి పూట డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. 1.5జీబి జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితం.
రూ.221కి 2జీబి డేటా ఇస్తారు. 21 రోజులు వ్యాలిడిటీతో వచ్చే ఈ పథకంలో వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. రాత్రి పూట డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉపయోగించుకోవచ్చు.

#8


రూ.148 స్టార్టర్ ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 300ఎంబీ 4జీ డాటా లభిస్తుంది. ఈ 28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.

#9

రూ.499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 4జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది. ఈ 28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 8జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#10

రూ.999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 10జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 20జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#11

రూ.1499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 20జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 40జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#12

రూ.2499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 35జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 70జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#13

రూ.3999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 60జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 120జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#14

రూ.4999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 75జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 150జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#15

రిలయన్స్ ప్రతిష్టాత్మకంగా వెలువరించిన ఈ జియో ప్లాన్ కు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వారసులే ప్రతినిధులు కావడం ఉండడం విశేషం. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ (24), కుమార్తె ఈషా ఈ సరికొత్త డేటా ప్లాన్ కు రూపకర్తలు. వాళ్లలో మెదిలిన ఆలోచనకు ప్రతిరూపమే రిలయన్స్ జియో ప్లాన్. రెండేళ్ల క్రితం రిలయన్స్ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన వీరిద్దరు దీనిపై చాలానే కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది.

#16

డేటా వినియోగం కోసం దేశ యువత సరాసరిన ఎంత డబ్బు ఖర్చు పెడుతోంది.. ఒక నెలలో ఎంత డేటాను ఉపయోగిస్తున్నారు.. అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఆయా గణంకాల ఆధారంగా రిలయన్స్ జియో ప్లాన్ రూపొందించారు. రిలయన్స్ యంగ్ డైరెక్టర్లుగా ఉన్న వీరిద్దరు.. నేటి యువ తరానికి ప్రతినిధులుగా నిలబడగలరన్న నమ్మకాన్ని ముఖేష్ అంబానీ వ్యక్తం చేశారు.

#17

జియో ప్లాన్ ను వినియోగించే వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారే అని అభిప్రాయపడ్డ ముఖేశ్.. తమ కంపెనీలో పనిచేసే వారి సగటు వయసు కూడా 30 ఏళ్లే అని ప్రకటించడం గమనార్హం.

#18

రిలయన్స్ జియో విద్యార్థులకు ప్రత్యేకమైన రాయితీలను అందిస్తోంది. విద్యార్థులు తమ గుర్తింపు కార్డును చూపించటం ద్వారా 25 రాయితీని పొందవచ్చు. ఏడాదిలో 10 కోట్ల మంది యూజర్లకు చేరువ కావాలన్నది రిలయన్స్ జియో సంకల్పం.  

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio SIM Available to Everyone From September 5, Free to Use Till December 31. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot