రోజుకు 6 లక్షల కొత్త కస్టమర్‌లు, ఆ ఫోన్‌లలోనూ జియో సపోర్ట్

సెప్టంబర్ 5 అధికారిక లాంచ్ తరువాత రోజుకు 6 లక్షల కొత్త కస్టమర్‌లను జాయిన్ చేసుకుంటూ టెలికం రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో ఉచితం పేరుతో మార్కెట్‌ను ఊపేస్తోంది. ఇప్పటి వరకు 3 కోట్ల పై చిలుకు కస్టమర్‌లు జియో నెట్‌వర్క్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

Read More : మిజు 3జీబి ర్యామ్ ఫోన్, రూ.6,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు ఉండవు.

జియో నెట్‌వర్క్‌లో భాగంగా వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవని లాంచ్ సందర్భంగా ముఖేష్ అంబానీ వెల్లడించిన విషయం తెలిసిందే. కేవలం డేటాకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 'Jio welcome offer'లో భాగంగా ప్రతిఒక్కరూ జియో సర్వీసులను డిసెంబర్ 31 వరకు ఉచితంగా పొందే అవకాశాన్ని కూడా జియో కల్పించింది.

4G VoLTE ఫోన్‌లలో మాత్రమే..?

జియో ఆఫర్ చేస్తున్న వాయిస్ కాల్స్ కేవలం 4G VoLTE ఫోన్‌లలో మాత్రమే వర్క్ అవుతున్నాయంటూ కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

non-VoLTE 4G సెట్‌లలోనూ..

వాస్తవానికి non-VoLTE 4G సెట్‌లలోనూ జియో వాయిస్ కాల్స్ పొందవచ్చు. VoLTE సపోర్ట్ అందుబాటులోలేని ఫోన్‌లలో Jio4GVoice appను ఇన్‌స్టాల్ చేయటం ద్వారా వాయిల్స్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

యాప్‌ను మీ 4జీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే

ఈ యాప్‌ను మీ 4జీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మీ ఫోన్ డైలర్, మెసెజింగ్ యాప్‌లను యాక్సిస్ చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వమని అడుగుతుంది. వీటిని యాక్సిస్ చేసుకునేందుకు పర్మిషన్ గ్రాంట్ చేసిన వెంటనే వెరిఫికేషన్ నిమిత్తం ఓ OTP నెంబర్ మీకు అందుతుంది.

కాల్ స్టేటస్ ‘Online'లోకి మారిపోతుంది

వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే వాయిస్ కాల్ స్టేటస్ ‘Online'లోకి మారిపోతుంది. తద్వారా మీ 4జీ ఫోన్ నుంచే నేరుగా జియో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance JIO SIM can work in non-VoLTE 4G sets. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot