ఇక 3జీ ఫోన్‌లలో రిలయన్స్ Jio!

ప్రస్తుతం రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న 4జీ వోల్ట్ నెట్‌వర్క్ కేవలం 4జీ ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తోంది.ఇదే సమయంలో, 3జీ స్మార్ట్‌ఫోన్‌లను వాడతున్న వారు మాత్రం జియో 4జీని పొందలేక పోతున్నారు. అలాంటి వారి కోసం జియో త్వరలోనే ఓ
సొల్యూషన్‌ను తీసుకురాబోతోంది.

Read More : ప్రమాదంలో లక్షల లెనోవో ఫోన్‌లు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రత్యేకమైన యాప్‌..

3జీ ఫోన్ యూజర్లు కూడా జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే విధంగా ప్రత్యేకమైన యాప్‌ను జియో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హై-స్పీడ్ 4జీ సేవలు..

ఆర్డర్ చేస్తే డబ్బులు ఇంటికి తెచ్చిస్తాం : స్నాప్‌డీల్

రిలయన్స్ లాంచ్ చేయబోయే ఈ మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా 3జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు సైతం హై-స్పీడ్ 4జీ సేవలను అందుకోగలుగుతారట.

జియో హ్యాపీ న్యూ ఇయర్

మరికొద్ది రోజుల్లోనే ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. యాప్ అందుబాటులోకి వచ్చినట్లయితే 3జీ యూజర్లు సైతం ‘జియో హ్యాపీ న్యూ ఇయర్' ఆఫర్‌ను పొందే అవకాశముంటుంది.

ఇక్కడో చిక్కుముడి కూడా ఉంది..

ఫోన్‌లో బంగారం ఎక్కడుంటుంది?, ఎలా బయటకు తీస్తారు?

అయితే, ఇక్కడో చిక్కుముడి కూడా కనపిస్తోంది. రిలయన్స్ జియో తన నెట్‌వర్క్‌ను మొత్తాన్నిIP 4G service provider క్రింద అందిస్తోన్నట్లు చెబుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో 3జీ ఫోన్‌లలో 4జీ సదుపాయం ఎలా సాధ్యమవుతుంది అనే దాని పై స్పష్టత రావల్సి ఉంది.

LYF Easy ఫోన్స్..

రిలయన్స్ జియో నుంచి LYF Easy పేరుతో సరికొత్త 4జీ ఫోన్‌లు మార్కెట్లోకి రాబోతున్నట్లు వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రూ.1000కే అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లను 2017 ఆరంభంలో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముందని సమాచారం.

గ్రామాలకు సైతం విస్తరించేందుకు...

ఆండ్రాయిడ్ ఫోన్‌ల వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

తన 4జీ వోల్ట్ నెట్‌వర్క్‌ను దేశంలోని మారుమూల పల్లెలకు సైతం విస్తరించే క్రమంలో జియో తన లైఫ్ ఈజీ ఫోన్‌లను రూ.1000 కంటే తక్కువ ధరకు విక్రయించినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం..

2017 ఆరంభంలో లాంచ్ అయ్యే ఈ ఫోన్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలబాటు కూడా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లైఫ్ ఈజీ ఫోన్‌లను బుక్ చేసుకునేందుకు పలు సలువైన మార్గాలు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio SIM cards could soon work with 3G smartphones: Report. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot