చేతిలో పేలిన Jio LYF స్మార్ట్‌ఫోన్!

తన జియో 4జీ సర్వీసులతో పాటు చౌక ధర LYF 4జీ స్మార్ట్‌ఫోన్‌లతో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న రిలయన్స్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇంటర్నెట్‌‍లో హల్‌చల్ చేస్తోంది. రిలయన్స్ నుంచి నుంచి విడుదలైన జియో LYF Water 1 వినియోగదారుడి చేతిలోనే పేలుడుకు గురైనట్లు ఓ సోషల్ మీడియా పేజ్ ద్వారా తెలుస్తోంది.

Read More : వాయిస్ కాల్స్ చేసుకుంటే డేటా కట్ అవ్వదు.. క్లారిటీ ఇచ్చిన జియో

చేతిలో పేలిన Jio LYF స్మార్ట్‌ఫోన్!

Gedi Route Jammu పేరుతో ఉన్న ఓ ఫేస్‌బుక్ పేజ్‌లో ధ్వంసమైన ఫోన్‌తో చేతికి గాయమైన ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫోన్‌లో బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చేసుకున్నట్లు యూజర్ పేర్కొన్నాడు. ఈ బ్లాస్ట్‌లో తన అరచేతికి గాయమైనట్లు తెలిపాడు. ఈ ఘటన పై రిలయన్స్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read More : ఈ నెలలో కొత్త ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి 20 ఆప్షన్స్

చేతిలో పేలిన Jio LYF స్మార్ట్‌ఫోన్!

ఇప్పటికే బ్యాటరీ లోపం కారణంగా సామ్‌సంగ్ నోట్ 7 ఫోన్‌లు పేలిపోతుండటంతో వాటిని రీకాల్ చేస్తున్నట్లు సామ్‌సంగ్ ప్రకటించింది. మరోవైపు వన్‌ప్లస్, ఐఫోన్ వంటి ఫోన్‌లు కూడా పేలుడుకు గురైనట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి. నకిలీ మొబైల్ చార్జర్‌లను వాడొద్దు. మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి.

 

 

#2

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి. నకిలీ మొబైల్ చార్జర్‌లను వాడొద్దు. మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి.

#3

తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకూడదు. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడటం అంత శ్రేయస్కరం కాదు.

#4

ఉబ్బి ఉన్న బ్యాటరీని వాడటం మంచిది కాదు. కాబట్టి, వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి.

#5

ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి ఫోన్‌ను తొలగించండి. వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

#6

నాసిరకం చార్జర్లలో తక్కువ నాణ్యతతో కూడిన హార్డ్‌వేర్‌ను ఉపయోగిచటం వల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై ఎంతో కొంత దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, బ్యాటరీ చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్‌లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం.

#7

వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం వల్ల బ్యాటరీ పై ఆ వేడి ఉష్ణోగ్రతలు కచ్చితంగా దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకు వేడి వాతావరణంలో మీ స్మార్ట్‌‌ఫోన్‌ను ఉంచొద్దు.

#8

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ మాట్లాడమనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే చార్జింగ్‌ను ఆఫ్ చేసి మాట్లాడండి.

#9

ఐఫోన్ విద్యుత్ షాక్‌కు గురైన ఘటన చైనాలో కలకలం రేపింది. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు 10 రోజులు కోమాలో స్థితిలో ఉండాల్సి వచ్చింది. గెలాకక్సీ ఎస్2 బ్యాటరీలో పేలుడు సంభవించటంతో దక్షిణ కొరియాకు చెందిన స్కూల్ విద్యార్థి గ్వాన్జూ చేతులను కాల్చుకున్నాడు. ప్యాంట్ జేబీలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ పేలటంతో 55 ఏళ్ల వ్యక్తి గాయాలపాలయ్యాడు. ఇలా అనేక సంఘటను స్మార్ట్‌ఫోన్ యూజర్లను బయపెడుతూనే ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio's LYF Smartphone 'Water' Allegedly Explodes In User's Hand. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot